ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టానికి ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 06 SEP 2024 8:45PM by PIB Hyderabad

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్‌లో రోడ్డు ప్ర‌మాదంలో జ‌రిగిన ప్రాణ‌న‌ష్టం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. 

 

మృతుల కుటుంబీకులకు ప్రధాన మంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 సహాయం ప్రకటించారు.

 

ప్రధానమంత్రి 'ఎక్స్' మాధ్యమంగా ఇలా పోస్ట్ చేశారు:  

 

“ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించుగాక. దీంతో పాటు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పాలన యంత్రాంగం బాధితులకు సాధ్యమైన సహాయం అందించడంలో నిమగ్నమై ఉంది: ప్రధానమంత్రి @narendramodi." 

 

“ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు."


(रिलीज़ आईडी: 2052803) आगंतुक पटल : 70
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam