నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2024 6:53PM by PIB Hyderabad
ప్యారిస్ 2024 పారాలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పారా-అథ్లెటిక్స్ జట్టు సభ్యులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ రోజు సత్కరించారు. ఈ సందర్బంగా క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందిని కేంద్ర మంత్రి సత్కరించారు.
క్రీడాకారుల విజయాలను ప్రస్తావిస్తూ మంత్రి మండవీయ వారిని ప్రశంసించారు. “పారాలింపిక్స్ క్రీడలకు తొలిసారిగా వెళ్లిన ఆరుగురు కొత్త క్రీడాకారులను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో తొలిసారిగా పాల్గొని పతకం సాధించినందుకు దీప్తిని అభినందించాలనుకుంటున్నాను. భవిష్యత్ పారాలింపిక్స్ కోసం నేను మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఇక్కడ మీరు పతకాలు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. గుర్తుంచుకోండి, ఆడటం అంటే కేవలం పతకాలు మాత్రమే కాదు, మీలో ప్రతి ఒక్కరూ జీవితం అందించిన సవాళ్లను అధిగమించి విజేతలుగా నిలిచారు. భారతదేశంలోని లక్షలాది మంది యువతకు మీరంతా స్ఫూర్తిదాయకం" అని కేంద్ర మంత్రి తెలిపారు.
పారాలింపిక్ అరంగేట్రంలోనే మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో కాంస్యం సాధించిన క్రీడాకారిణి దీప్తి జీవన్జీ, ఆమె లాగే అరంగేట్రం చేసిన తోటి అథ్లెట్లు రవి రొంగలి (పురుషుల షాట్‌పుట్ ఎఫ్ 40), రక్షిత రాజు (మహిళల 1500 మీటర్ల టీ11), కాంచన్ లస్కాని (మహిళల డిస్కస్ త్రో ఎఫ్53) ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఇంకా సాక్షి కసానా(మహిళల డిస్కస్ త్రో ఎఫ్55), మను (పురుషుల షాట్‌పుట్ F37), వారి కోచ్‌లు రాహుల్ బాలకృష్ణ, సురేష్ కుమార్ కురుబా, సునీల్ లఖానీ, ఎస్కార్ట్ పాల్గొన్నారు.
దీప్తిలో ఉన్న ప్రతిభను హైదరాబాద్‌లోని సాయ్ కోచ్ ఎన్ రమేష్ వెలికి తీశారు. 2019లో తన పారా-అథ్లెటిక్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు దీప్తి. ఆమె 2018 నుండి ఖేలో ఇండియా అథ్లెట్‌గా ఉన్నారు. ఇప్పుడు టాప్ అథ్లెట్‌గా ఉన్నారు. తక్కువ వ్యవధిలో, ఆమె ఆసియా పారా గేమ్స్ లో బంగారు పతకం, 2024 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో సహా అనేక అంతర్జాతీయ పోటీల్లో తన సత్తా చాటారు. అక్కడ ఆమె ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. స్వదేశంలో 2020లో జరిగిన ఖేలో ఇండియా క్రీడల్లో రెండు పతకాలను గెలుచుకోవడం ద్వారా ఆమె తనదైన ముద్ర వేశారు.