రక్షణ మంత్రిత్వ శాఖ
జలాంతర్గాముల రక్షణ, విస్తృత సహకారంపై భారత, దక్షిణాఫ్రికా నౌకాదళాల ఒప్పందం
Posted On:
04 SEP 2024 5:00PM by PIB Hyderabad
దక్షిణాఫ్రికా జలాంతర్గాముల సిబ్బంది ప్రమాదంలో చిక్కినపుడు వారిని రక్షించే విషయమై, భారత-దక్షిణాఫ్రికా నావికా దళాలు తక్షణమే అమలుచేయాల్సిన ప్రాతిపదికన ఒక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దక్షిణ ఆఫ్రికా నౌకాదళానికి చెందిన జలాంతర్గామి సిబ్బంది ఆపదలో చిక్కుకున్నప్పుడు గాని, లేదా ఏదైనా దుర్ఘటనకు లోనైనప్పుడు గాని వారిని కాపాడడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
ఈ ఒప్పంద పత్రంపైన భారతీయ నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, దక్షిణాఫ్రికా నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ మోండే లోబేస్ సంతకాలు చేశారు.
సముద్ర వాణిజ్య భద్రత, పరస్పర సహకారంలో ఇరుదేశాల నిబద్ధతకు ఈ ఒప్పందం అద్దం పడుతున్నది. ఈ ఒప్పందంలో భాగంగా- భారతీయ నౌకాదళం అవసరమైనప్పుడు తన డీప్ సబ్‌మర్జన్స్ రెస్క్యూ వెహికల్ (డిఎస్ఆర్‌వి)ని రంగంలోకి దించి సహాయాన్ని అందిస్తుంది. ఇది రెండు దేశాల స్నేహ పూర్వక సంబంధాలనే కాకుండా, సముద్ర వాణిజ్యంలో- ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను ఈ ఒప్పందం మరింత దృఢతరం చేస్తోంది.
***
(Release ID: 2051961)
Visitor Counter : 101