రక్షణ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ లో భారత నౌకాదళ సహాయక చర్యలు
ప్రభావిత ప్రాంతం నుంచి ఏ ఎల్ హెచ్ లో 22 మంది తరలింపు
प्रविष्टि तिथि:
03 SEP 2024 2:32PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో స్థానిక అధికారుల అభ్యర్థన మేరకు భారత నావికా దళం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. విశాఖపట్నంలోని తూర్పు నావికా దళ కమాండ్ కు చెందిన నౌకాదళ ఎయిర్ క్రాఫ్ట్, వరద సహాయక బృందాలు(ఎఫ్ఆర్టీలు,) డైవింగ్ బృందాలు మానవతా సాయం, విపత్తు ఉపశమన(హెచ్ఏడీఆర్) చర్యలు చేపట్టాయి.
నాలుగు హెలికాఫ్టర్లు (రెండు ఏ ఎల్ హెచ్ , రెండు చేతక్), ఒక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను గాలింపు, రక్షణ(ఎస్ఏఆర్) కార్యకలాపాల కోసం మోహరించారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 22 మందిని రక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి 1000 కేజీలకు పైగా ఆహారపదార్థాలను జారవిడిచారు. సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు 10 ఎఫ్ఆర్టీలను మోహరించారు.
అవసరమైన సహాయాన్ని అందించేందుకు అదనపు రక్షణ బృందాలు, నావికా దళ సహాయ పరికరాలతో సిద్ధంగా ఉన్నాయి.
(रिलीज़ आईडी: 2051358)
आगंतुक पटल : 119