ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav g20-india-2023

ఒకప్పుడు అధికారంలో ఉన్న వారు దేశ వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సవాలు చేయడం దురదృష్టకరం: ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి


పక్షపాత బుద్ధితో కొందరు జాతీయ ఆర్థిక ఉన్నతినీ, ప్రపంచంలో పెరుగుతున్న భారత ప్రతిష్ఠనీ చూడలేకున్నారు: ఉపరాష్ట్రపతి

పర్యావరణ మార్పులు బలహీనులను ఎక్కువ నష్టపరుస్తాయి. పర్యావరణ న్యాయమే మన మార్గదర్శక సూత్రం: ఉపరాష్ట్రపతి



భూమాత బిడ్డలుగా మనం దానిని రక్షించడం, సురక్షితంగా చూసుకోవడం మన బాధ్యత: ఉపరాష్ట్రపతి

భారత్ ఆర్థిక పురోగతి స్థిరమైన అభివృద్ధితో సమన్వయం అయింది; భవిష్యత్ తరానికి గర్వకారణమైన వారసత్వాన్ని నిర్ధారిస్తుందని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి

పరిశోధన, అభివృద్ధి దేశ ఎదుగుదలను సూచిస్తుంది: ఉపరాష్ట్రపతి

పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు విరివిగా ఖర్చు చేయాలి: శ్రీ ధన్కడ్

Posted On: 31 AUG 2024 6:42PM by PIB Hyderabad

ఒకప్పుడు పాలనలో లేదా అధికార పదవుల్లో ఉన్న వ్యక్తుల నుండి మన ప్రజాస్వామ్యానికిజాతీయవాద స్ఫూర్తికి సవాళ్లు ఎదురుకావడం దురదృష్టకరమని ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్  ధన్కడ్  ఆందోళన వ్యక్తం చేశారు. "పక్షపాత ప్రయోజనాల కోసం వారు జాతీయ వ్యతిరేక కథనాలను ప్రచారంలో పెడుతూ మన గొప్ప ప్రజాస్వామ్యాన్ని పొరుగున ఉన్న వ్యవస్థతో పోల్చే స్థాయికి వెళ్లారు" అని ఉపరాష్ట్రపతి అన్నారు. 
 

ఈ వ్యక్తులు తమ నిజమైన ఉద్దేశాల ద్వారా మభ్యపెట్టడమే కాకుండా  ఈ దేశ అపూర్వమైనగణనీయమైన అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని దారి మళ్లించేలా అన్ని ప్రయత్నాలు చేస్తారు. మన దేశ ఆర్థిక వృద్ధిభిన్నదేశాలమధ్య సౌభ్రాతృత్వం పెంపొందించే చర్యలను చూడలేకపోతున్నారు" అని ఉపరాష్ట్రపతి తెలిపారు. 

భారతదేశ స్థిరమైన ప్రజాస్వామ్యానికీపొరుగు దేశాల వ్యవస్థలకీ మధ్య పోలిక తేవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు, "మనం ఎప్పుడైనా అలా పోల్చగలమా?" అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కథనాలకు అతీతంగా యువత ఎదగాలనిఈ హానికరమైన పోలికలను తటస్థీకరించాలనిఉపసంహరించుకోవాలనిబహిర్గతం చేయాలని ఉపరాష్ట్రపతి యువతను కోరారు.
 

వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నేతృత్వంలో భారతదేశంఅతిపెద్దఅత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంఇలాంటి అవమానకరమైన పరిశీలనలకు గురికాకూడదని ఆయన సూచించారు. "దేశంజాతీయవాదంఇక్కడ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ఎవరికైనా ఈ ఆలోచన ఎలా వస్తుంది?" అలాంటి  కథనాలు- దుర్మార్గమనీచెప్పడానికి మాటల్లేవనీ, ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. 

 రోజు డెహ్రాడూన్‌లోని సిఎస్ఐఆర్ - ఐఐపీలో విద్యార్థులుఅధ్యాపకులను ఉద్దేశించి శ్రీ ధన్కడ్ ప్రసంగించారు. వాతావరణ మార్పుమానవాళి ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాల సవాళ్లను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 
 

శ్రీ ధన్కడ్ ...  వాతావరణ న్యాయ ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావిస్తూ..,వాతావరణ మార్పులు బలహీనులను ఎక్కువగా నష్టపరుస్తాయని, అందుకే వాతావరణ న్యాయం మనకు మార్గదర్శక సూత్రంగా ఉండాలి" అని అన్నారు.

భూమాత బిడ్డలుగా మన గ్రహాన్ని రక్షించుకోవడంమన గ్రహాన్ని సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. ఈ  వాస్తవాన్ని గుర్తిస్తూప్రపంచ దేశాల నిబద్ధతను ప్రతిబింబించేలా భారత్ తన సుస్థిర అభివృద్ధి అజెండాను అమలులోకి తేవడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. “మన ఘన చరిత్ర స్ఫూర్తినిమన నాగరికత కీర్తిని ప్రతిబింబించేలాపాలనలో సుస్థిరతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది భారత్. ఇతర ప్రపంచాన్ని మనం వేరుగా చూడటం లేదు. ప్రపంచం నిర్ధారించుకున్న నిబద్ధతకు అనుగుణంగా దేశం ముందుకు సాగుతోంది. అందుకే మనం అంటాం ప్రపంచం అంతా ఒక కుటుంబమని చెబుతూ వసుధైక కుటుంబం అంటాం’’ అని శ్రీ ధన్కర్ వ్యాఖ్యానించారు.  

"అంతర్జాతీయ సౌర కూటమికాప్ 28లో గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్లైఫ్ (పర్యావరణం కోసం జీవనశైలి) వంటి ప్రపంచ పథకాలను భారత్ అవలంబిస్తోంది.  లైఫ్... సామాజిక అభివృద్ధికివృద్ధికి అత్యంత విజయవంతమైన ఇతివృత్తం. కీలకమైన సానుకూల ప్రభావాలతో వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తనా మార్పును ప్రేరేపించే సామూహిక ఉద్యమానికి ఉపకరిస్తుంది’’ అని ఆయన తెలిపారు.

సుస్థిర అభివృద్ధికి క్లీన్ ఎనర్జీ ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, "క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయ ఎంపిక కాదుఇది ఏకైక ఎంపిక. అది లేకపోతేమనం అస్తిత్వ సవాలును ఎదుర్కొంటాం. ఏదైనా ఇతర వృద్ధి విధానం మన గ్రహానికి ముప్పు కలిగిస్తుంది" అని అన్నారు. 
 

భారతదేశం ఆర్థిక పురోగతి మార్గాన్ని వివరిస్తూ, "అస్థిరమైన అయిదు" ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండే భారత్అయిదో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించింది, 2030 నాటికి మూడో అతి  పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. భారత్ ఆర్థిక పురోగతి సామరస్యంగా ఉంది. స్థిరమైన అభివృద్ధిభవిష్యత్ తరాలకు గర్వించదగిన వారసత్వాన్ని నిర్ధారిస్తుంది” అని ఉపరాష్ట్రపతి చెప్పారు. 

పరిశోధనఅభివృద్ధికి తోడ్పడాలని కార్పొరేట్లుప్రభుత్వాలకు ఆయన పిలుపునిచ్చారు. పరిశోధనఅభివృద్ధి దేశం ఎదుగుదలను నిర్వచిస్తుంది. పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలుకార్పొరేట్లు అధిక నిధులను కేటాయించాలి" అని సూచించారు.
 

భారతదేశ వృద్ధిని ముందుకు నడిపించే కొత్త మార్గాలను తెరవడంలో సైన్స్పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయి. పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వంకార్పొరేట్ రంగానికి నేను పిలుపునిస్తున్నాను. పరిశోధనఅభివృద్ధిని పెంపొందించడం కోసం ఆర్థిక వనరులు  కూడా ఎక్కువగా అవసరం అవుతాయి” అని అన్నారాయన.

సహజ వనరుల దుర్వినియోగంపై మాట్లాడుతూ, “మేము మీ సహజ వనరులకు ట్రస్టీషిప్‌లో ఉన్నాం! సహజ వనరుల వినియోగం మన ఆర్థిక శక్తిని నిర్ధారించదు. సహజ వనరుల సరైన వినియోగంసంరక్షణపై మనం దృష్టి పెట్టాలి. అవి పరిమితంప్రకృతి ద్వారా అందినవి. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం కాదు. సహజ వనరులు అందరికీ సమానంగా వినియోగం అవ్వాలిఅసమానత ఉండకూడదు" అని శ్రీ ధన్కడ్ తెలిపారు.  

జి20 సమ్మిట్ 2023 సందర్భంగా గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ప్రారంభంలో దేశం కీలక పాత్రను శ్రీ ధన్కడ్ ప్రస్తావించారు. సుస్థిరమైన ఇంధన భవిష్యత్తు దిశగా భారతదేశం కీలక అడుగు వేస్తూతద్వారా స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నివాసయోగ్యమైన గ్రహానికి భరోసా ఇవ్వడంతో ఇది చారిత్రాత్మకమైనవిస్తృతంగా ప్రశంసించదగ్గ అభివృద్ధి అని ఆయన అభివర్ణించారు. రవాణా రంగంలో జీవ ఇంధన వినియోగాన్ని విస్తరించడంలో గణనీయమైన పురోగతితో 2070 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే భారతదేశ ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. .

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడాన్ని కూడా శ్రీ ధన్కడ్ ప్రస్తావించారు. ఇది ఒకప్పుడు సుదూర స్వప్నంగా ఉందికానీ ఇప్పుడు అది నిజమైంది. ఈ పురోగతులుఅపూర్వమైన మద్దతును పొందుతున్నాయనివృత్తాకార ఆర్థిక వ్యవస్థ విశాల దృక్పథానికి దోహదపడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. యువత తమకు తాము సంక్షోభాల ఉబిలో నుండి బయట పడే ప్రయత్నం చేయాలనీనేడు దేశంలో వారికి అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఉద్బోధించారు. ''ప్రభుత్వ ఉద్యోగాలపై అనవసర దృష్టి మన యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆకర్షణలకువ్యసనాలకు లోనుకావడం ఆందోళనకర అంశాలు. అద్భుతంగా కనబడే పై మెరుగులకు యువత ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. పెట్టుబడులుఅవకాశాలలో భారతదేశం ప్రపంచానికి ఇష్టమైన గమ్యస్థానమని ఐఎంఎఫ్ ఇచ్చిన ప్రశంసలను గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడాలన్న ఆలోచనలకు దూరంగా ఉంచుతుంది ” అని అన్నారాయన.

క్వాంటం కంప్యూటింగ్, 6జి వంటి అగ్రగామి టెక్నాలజీల రంగంలో దేశం సాధించిన ఇటీవలి పురోగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూమనం ఇకపై పశ్చిమ దేశాల వైపు చూడకుండాఈ రంగాలలో వినూత్నంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇతర దేశాలకు ఇవ్వగల స్థితిలో ఉంది. ఆధునిక సాంకేతికతలలోదానిపై దృష్టి సారించే సింగిల్ డిజిట్ దేశాలలో మన దేశం కూడా ఉందని గమనించడం ఓదార్పునిస్తుంది. ఉదాహరణకు మన క్వాంటం కంప్యూటింగ్ మిషన్గ్రీన్ హైడ్రోజన్ మిషన్, 6జి సాంకేతికతను వాణిజ్యపరంగా వినియోగించుకోవడంలో మనం ముందు వరుసలో ఉన్న దేశాల సరసన ఉన్నాం" అని ఆయన తెలిపారు. 

ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్సిఎస్‌ఐఆర్-ఐఐపి డైరెక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్ బిష్త్విద్యార్థులుఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 2050670) Visitor Counter : 32