శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొత్త బయో ఈ 3 విధానాన్ని లాంఛనంగా విడుదల చేసిన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


తదుపరి నూతన పారిశ్రామిక విప్లవానికి ఇండియా మార్గదర్శి అంటూ ప్రశంసించిన మంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్

బయో ఈ 3 విధానం జీవ ఆర్ధిక వ్యవస్థకు కీలక మైలురాయిగా నిలవడమే కాక, వికసిత్ భారత్ @2047 సాధనలో విప్లవాత్మక మార్పునకు దోహదపడుతుంది: మంత్రి

అంతర్జాతీయ జీవసాంకేతిక రంగంలో ఇండియా కీలక శక్తిగా ఎదగడంతో, నూతన జీవ సాంకేతిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచం ప్రశంసిస్తోంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


పిపిపి నమూనా, ఉపాధిని ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు రాయితీల వంటివి బయో ఈ 3 విధానం అమలులో అంతర్లీనంగా ఉంటాయి: మంత్రి

2014లో 10 బిలియన్ డాలర్లు ఉన్న భారత జీవ ఆర్ధికవ్యవస్థ, 2024 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి అది 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 31 AUG 2024 6:22PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలోని ఎల్.మీడియా సెంటర్ లో, వినూత్న జీవ ఆర్ధిక విధానాన్ని విడుదల చేశారు. తదుపరి పారిశ్రామిక విప్లవానికి ఇండియా నాయకత్వ స్థానంలో ఉందంటూ మంత్రి ప్రశంసించారు. ఇందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందిస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బయో ఈ 3 విధానం, జీవ ఆర్ధిక వ్యవస్థకు కీలక మైలురాయిగా నిలవడమే కాకవికసిత్ భారత్ @2047 సాధనలో విప్లవాత్మక మార్పునకు దోహదపడుతుంది’’ అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంనూతన బయో ఈ3 విధానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కర్బన ఉద్గార రహిత ఆర్ధిక వ్యవస్థమిషన్ లైఫ్ (పర్యావరణ హిత జీవన విధానం) వంటి జాతీయ విధానాలకు అనుగుణంగాఅత్యున్నత పనితీరు కనబరిచే జీవ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం.

బయో ఈ3 విధానం విడుదల సందర్భంగా మాట్లాడుతూకేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖభూవిజ్ఞాన శాఖప్రధాని కార్యాలయసిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లుఅణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర) సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌, అంతర్జాతీయ జీవసాంకేతిక రంగంలో ఇండియా కీలకశక్తిగా ఎదగడంతోనూతన జీవ సాంకేతిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచం ప్రశంసిస్తోంది’’ అని అన్నారు. మన దేశంలో వినూత్న, పోటీతత్వంతో కూడినశరవేగంతో వృద్ధి చెందుతున్న జీవసాంకేతిక పరిశ్రమ ఉందని కూడా ఆయన చెప్పారు.

 “బయో ఈ3 విధానం ఆహారంఇంధనంఆరోగ్య రంగాలపై కీలక ప్రభావాన్ని చూపుతుందని మంత్రి అన్నారు. ఈ విధానంలోని ఆరు ముఖ్యమైన అంశాలను డాక్టర్ జితేంద్ర ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో 1)జీవ ఆధారిత రసాయనాలుఎంజైములు, 2) అదనపు పోషక విలువలు కలిగిన ఆహార పదార్ధాలుస్మార్ట్ ప్రోటీన్లు 3) కచ్చితమైన జీవ చికిత్సా విధానాలు 4) వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు 5) కర్బన ఉద్గారాలను ఒడిసిపట్టి నిల్వచేసివాతావరణ మార్పులను నిరోధించడానికి దానిని వినియోగించడం 6) భవిష్యత్ దార్శనికతతో చేపట్టే సముద్రరంగఅంతరిక్ష పరిశోధనలు ఉన్నాయి.

అంతరిక్షజీవ ఆర్ధిక రంగాలలో దేశం సాధించిన ఘన విజయాన్ని మంత్రి ఈ సందర్భంగా  పునరుద్ఘాటించారు. బయో ఈ 3 విధానం అమలులో పిపిపి నమూనాతో పాటు, ఉపాధికల్పనను ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు రాయితీలు అంతర్లీనంగా ఉంటాయని ఆయన తెలిపారు.

‘‘భారత భవిష్యత్ జీవ ఆర్థిక వ్యవస్థకుజీవ తయారీ రంగంజీవ కర్మాగారాలు చోదకశక్తిగా నిలుస్తాయనిఇవి "హరిత వృద్ధి"కి దోహదపడతాయని మంత్రి చెప్పారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో – విధాన పరంగా జరిగిన కీలక మార్పుల అనంతరం, జీవ సాంకేతికరంగలో పరిశోధనజీవ అంకుర పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత లభించిందనిఇవి ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.

జీవ సాంకేతికతకు ఇది అద్భుత  సమయమని అంటూ మంత్రిభారత దేశంలో  జీవసాంకేతికత  సాధించిన ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించారు.

దేశంలోని అపార వనరుల గురించి ప్రస్తావిస్తూ మంత్రి,“దేశంలో అపార జీవ వనరులున్నాయి. తరగని ఈ వనరులు సద్వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. విస్తారమైన జీవవైవిధ్యంహిమాలయాలకు మాత్రమే ప్రత్యేకమైన జీవ వనరులు, జీవసాంకేతికతకు ఎంతో ప్రయోజనకరం కాగలవు అని అన్నారు. దీనికి తోడు 7,500 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉందనిఇందులో  సముద్రగర్భ  అన్వేషణను ప్రారంభించామని,ఇది సముద్రంలోని జీవవైవిధ్యాన్ని వెలికితీయనున్నదని మంత్రి తెలిపారు.

గత పది సంవత్సరాలలో ఈ రంగంలో సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర, 2014లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న జీవ ఆర్ధిక వ్యవస్థ 2024 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుకుందని, 2030 నాటికి ఇది 300 బిలియన్ డాలర్లకు చేరుకోగలదన్న అంచనాలున్నట్టు తెలిపారు.

21వ శతాబ్దపు తదుపరి విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో జీవసాంకేతికతకు అపారశక్తి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ఐటి రంగ విప్లవానికి పశ్చిమదేశాలు నాయకత్వం వహిస్తేజీవ సాంకేతిక విప్లవానికి ఇండియా నాయకత్వం వహిస్తోందని డాక్టర్ జితేంద్ర తెలిపారు.

జీవసాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలేనీతి ఆయోగ్ (శాస్త్రసాంకేతిక విభాగం) సభ్యుడు డాక్టర్ వి.కె.సారస్వత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 2050663) Visitor Counter : 100