రక్షణ మంత్రిత్వ శాఖ
ఎళిమలలోని భారత నావికాదళ అకాడమీ కమాండెంట్‌గా వైస్ అడ్మిరల్ సి.ఆర్.ప్రవీణ్ నాయర్, ఎన్ఎమ్ బాధ్యతల స్వీకారం
Posted On:
29 AUG 2024 4:19PM by PIB Hyderabad
భారత నావికాదళ అకాడమీ కమాండెంట్‌గా వైస్ అడ్మిరల్ సి.ఆర్.ప్రవీణ్ నాయర్, ఎన్ఎమ్ 2024 ఆగస్టు 29న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ వైస్ అడ్మిరల్ వినీత్ మెకార్తీ ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఫ్లాగ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయర్ 1991 జూలై 1న భారత నావికాదళం (ఐఎన్)లో చేరారు. ‘సర్ఫేస్ వార్‌ఫేర్’ అధికారిగా ఉన్న సమయంలో ‘కమ్యూనికేషన్స్- ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్’లో నైపుణ్యం సంపాదించారు. అమెరికాలోని న్యూపోర్ట్ లోగల ‘డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్టన్’, అమెరికా నావల్ వార్ కాలేజ్’లలో విద్యాభ్యాసం చేసిన ఈ ఫ్లాగ్ ఆఫీసర్ ముంబై విశ్వవిద్యాలయంలో రక్షణ-వ్యూహాత్మక అధ్యయనం ప్రధానాంశాలుగా ఎం.ఫిల్ కూడా సాధించారు.
భారత నావికాదళంలోని వివిధ నౌకలలో సిగ్నల్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా, ఫ్లీట్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఆఫీసర్‌గా, వెస్ట్రన్ ఫ్లీట్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. అలాగే 2018-2019 మధ్య తూర్పు నావికాదళం ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
క్షిపణి ప్రయోగ నౌక ‘ఐఎన్ఎస్ కిర్ష్, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’, భారత నావికాదళంలో అతిపెద్ద యుద్ధ, విమానవాహక నౌక రియర్ ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’లలో ఈ ఫ్లాగ్ ఆఫీసర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నిర్వర్తించిన వివిధ బాధ్యతలకు సంబంధించి- గోవాలోని నావల్ వార్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్, నేవల్ హెడ్‌క్వార్టర్స్ లో ఆఫీసర్-ఇన్-చార్జ్ సిగ్నల్ స్కూల్, కమోడోర్ (పర్సనల్) డైరెక్టరేట్ ఆఫ్ పర్సనల్ హోదాలో పనిచేశారు. అలాగే మూడేళ్లుగా నావికాదళ అత్యున్నత మేథో సంస్థ- ‘ఇండియన్ నేవల్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ కౌన్సిల్’ (ఐఎన్ఎస్ఒసి)లో సభ్యుడుగానూ ఉన్నారు.
రియర్ అడ్మిరల్‌గా 2020 జనవరిలో పదోన్నతి అనంతరం నావల్ హెడ్‌క్వార్టర్స్ లో ‘నావల్ స్టాఫ్ (పాలసీ అండ్ ప్లాన్స్) అసిస్టెంట్ చీఫ్’గా నియమితులయ్యారు. వైస్ అడ్మిరల్ స్థాయికి పదోన్నతితో భారత నావికాదళ అకాడమీ కమాండెంట్‌గా నియమితులయ్యే ముందు ఈ ఫ్లాగ్ ఆఫీసర్ భారత పశ్చిమ నావికాదళానికి నాయకత్వం వహించారు.
***
(Release ID: 2049965)
Visitor Counter : 72