రక్షణ మంత్రిత్వ శాఖ
సింధుదుర్గలోని రాజ్ కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి జరిగిన నష్టంపై విచారణకు సంయుక్త కమిటీ
प्रविष्टि तिथि:
29 AUG 2024 12:51PM by PIB Hyderabad
అసాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల సింధుదుర్గ లోని రాజ్ కోట్ కోటలో ప్రతిష్ఠించిన శివాజీ మహరాజ్ విగ్రహానికి జరిగిన నష్టంపై దర్యాప్తు చేయడానికి సంయుక్త సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులతో కూడిన ఈ కమిటీకి నావికాదళం నేతృత్వం వహిస్తుంది.
గతేడాది డిసెంబరు 4న నిర్వహించిన నావికాదళ దినోత్సవంలో భాగంగా ఆ విగ్రహాన్ని సింధుదుర్గలో ఆవిష్కరించారు. సముద్ర రక్షణ, భద్రతకు సంబంధించి మరాఠా నావికాదళం, ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాలను గౌరవించుకోవడం దాని లక్ష్యం. ఆధునిక భారత నావికాదళంతో దాని చారిత్రక సంబంధాన్నీ ఆ విగ్రహం చాటుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారత నౌకాదళం ఈ ప్రాజెక్టును రూపొందించి ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రప్రభుత్వమే దీనికి నిధులు కూడా అందించింది.
వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి విగ్రహాన్ని పునరుద్ధరించడానికి, పూర్వస్థితిలో నిలపడానికి భారత నౌకాదళం కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2049779)
आगंतुक पटल : 119