సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

7వ అనుభవ్ అవార్డుల ప్రదానోత్సవంలో 5 అనుభవ్ అవార్డులు, 10 జ్యూరీ ధ్రువీకరణ పత్రాలను అందించిన పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ వీ. శ్రీనివాస్


55వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్(పీఆర్‌సీ) కార్యశాలను ప్రారంభించిన పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ కార్యదర్శి వీ.శ్రీనివాస్

కార్యశాలలో పాల్గొన్న 750 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ/సీఏపీఎఫ్ విశ్రాంత ఉద్యోగులు


11వ ఆలిండియా ఫించను అదాలత్ ను ఉద్దేశించి ప్రసంగించిన వీ.శ్రీనివాస్

Posted On: 28 AUG 2024 8:00PM by PIB Hyderabad

ఉద్యోగంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసిన కృషిని గుర్తించేందుకు ఇస్తోన్న అనుభవ్ అవార్డుల 7వ విడత ప్రదానోత్సవాన్ని పింఛనుపింఛనుదారుల సంక్షేమ విభాగం(డీఓపీపీడబ్ల్యూ) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వేర్వేరు మంత్రిత్వ శాఖలువిభాగాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులకు అనుభవ్ అవార్డులు, 10 జ్యూరీ ధ్రువీకరణ పత్రాలను అందించారు. 15 మంది అవార్డు గ్రహీతల్లో అయిదుగురు మహిళా పింఛనుదారులు ఉండటం విశేషం. ఒకేసారి అత్యధికంగా మహిళలు అవార్డులు అందుకోవటం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతల విజయాలను తెలిపే ప్రశంసాపత్రంవారి కృషిని తెలిపే లఘుచిత్రాలను ప్రదర్శించారు.

దేశ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న కృషిని కార్యదర్శి (ఫించన్ల విభాగం) కొనియాడారు. అనుభవ్ అవార్డులను ఇవ్వటం.. ప్రస్తుతతరం ఉద్యోగులు వారి వారి రంగాలలో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

31/03/2025 వరకు పదవీ విరమణ చేయబోతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 55వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (పీఆర్‌సీ) కార్యశాలను 28.08.2024న దిల్లీ విజ్ఞాన్ భవన్‌ ప్లీనరీ నిర్వహించారు,


ఈ కార్యశాలలో- భవిష్య పోర్టల్ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్పదవీ విరమణ ప్రయోజనాలుకుటుంబ పింఛనుసీజీహెచ్ఎస్ ప్రక్రియఆదాయపు పన్ను నిబంధనలుఅనుభవ్డిజిటల్ జీవిత ధ్రువీకరణ పత్రం(లైఫ్ సర్టిఫికేట్)..  పెట్టుబడి పద్ధతులుఅవకాశాలుతదితర అంశాలపై వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పదవీ విరమణకు ముందు అనుసరించాల్సిన ప్రక్రియనింపాల్సిన ఫారాల గురించి, పదవీ విరమణ తర్వాత వారికి లభించే ప్రయోజనాల గురించి సమాచారాన్ని అందించారు. త
పీఆర్‌సీ కార్యశాల సందర్భంగా బ్యాంకులు కూడా ప్రదర్శన నిర్వహించాయి. ఇందులో మొత్తం 18 పింఛను పంపిణీ బ్యాంకులు చురుగ్గా పాల్గొన్నాయి. పింఛనుదారులకు సంబంధించిన అన్ని బ్యాంకింగ్ సేవలను ఈ సందర్భంగా అందుబాటులో ఉంచాయి. పింఛను ఖాతా తెరవడంపింఛను నిధిని వారికి అనువైన వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడంపై బ్యాంకులు రిటైరైన వారికి మార్గనిర్దేశం చేశాయి.

31/03/2025 వరకు పదవీ విరమణ చేయబోతున్న 750 మందికి పైగా ఉద్యోగులు ఈ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (పీఆర్‌సీ) కార్యశాల ద్వారా లబ్ధి పొందారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సజావుగాసౌకర్యవంతంగా విశ్రాంత జీవనగం గడపడానికి సుపరిపాలనలో భాగంగా ఇటువంటి కార్యశాలల్ని పింఛను విభాగం ఇకపైన కూడా కొనసాగిస్తుంది. పదవీ విరమణ తర్వాత వారు అన్ని ప్రయోజనాలను పొందడానికి వీలుగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వారికి తెలియజేయడానికి సంబంధింత ప్రభుత్వ విభాగంగా అన్ని చర్యలు తీసుకుంటోంది.

పింఛనుపింఛనుదారుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.8.2024న న్యూఢిల్లీలో పింఛను శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్ అధ్యక్షతన 11వ దేశవ్యాప్త పింఛను అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్‌లో భారత ప్రభుత్వానికి చెందిన 22 మంత్రిత్వ శాఖలుపింఛనుదారులుగా ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో పాల్గొన్నారు. అదాలత్‌లో 298 కేసులను చర్చించగా 245 కేసులు అక్కడికక్కడే పరిష్కరించారు. 82 శాతం కేసులకు పరిష్కారం లభించింది. 

***


(Release ID: 2049618) Visitor Counter : 52


Read this release in: English , Urdu , Marathi , Hindi