జాతీయ మానవ హక్కుల కమిషన్

మాన‌వ హ‌క్కుల‌పై ఆన్‌లైన్ ఫొటోగ్రఫీ పోటీ-2024 విజేత‌ల‌ను ప్ర‌క‌టించిన‌ ‘ఎన్‌హెచ్ఆర్‌సి’


ఆరుగురు విజేతలలో ఒకరికి తృతీయ బహుమతి రూ.5,000; ఐదుగురికి రూ.2,000 వంతున ప్రోత్సాహక బహుమతి;

10 మానవ హక్కుల-సంబంధిత ఇతివృత్తాల కింద ఒక నెలపాటు నిర్వహించిన పోటీకి ‘మైగవ్’.. ‘ఎన్‌హెచ్ఆర్‌సి’ వెబ్‌సైట్ల ద్వారా 642 ఎంట్రీలు

Posted On: 27 AUG 2024 9:40PM by PIB Hyderabad

   భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) ‘మైగవ్’ పోర్టల్ సహకారంతో నిర్వహించిన ఆన్‌లైన్ మానవ హక్కుల ఫొటోగ్రఫీ పోటీ-2024 ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు తాత్కాలిక చైర్‌పర్సన్, సెక్రటరీ జనరల్, విభాగాల అధిపతులు, ఒక నిపుణుడితో కూడిన పూర్తిస్థాయి కమిషన్ న్యాయ నిర్ణేతల సంఘం విజేతలను ఎంపిక చేసింది. అయితే, సముచిత చర్చ అనంతరం ప్రథమ, ద్వితీయ బహుమతులకు అర్హతగల ఫొటో ఏదీ లేదని నిర్ణయించింది. ఆ మేరకు తృతీయ స్థానం పొందిన విజేతకు రూ.5,000; ప్రోత్సాహక విభాగంలో మరో ఐదుగురికి తలా రూ.2,000 వంతున బహుమతి అందజేస్తామని వెల్లడించింది.

 

విజేతల వివరాలు:

 

3వ బహుమతి: డింపల్ పంచోలి

ఇతివృత్తం: మానవ జీవనం, జీవన ప్రమాణాల మెరుగుకు కార్యక్రమాల రూపకల్పన.

 

ప్రోత్సాహక బహుమతి: సౌరవ్ దాస్

ఇతివృత్తం: మహిళలు (హక్కులు-సవాళ్లు, దేశాభివృద్ధిలో వారి కృషి)

ప్రోత్సాహక బహుమతి: శంకరి రాయ్

ఇతివృత్తం: మహిళలు (హక్కులు-సవాళ్లు, దేశాభివృద్ధిలో వారి కృషి)

ప్రోత్సాహక బహుమతి: అలోక్ అవినాష్

ఇతివృత్తం: భూగోళంపై ప్రాణికోటి ప్రభావితం, పర్యావరణ ముప్పు

ప్రోత్సాహక బహుమతి: సోమ్‌నాథ్‌ ముఖోపాధ్యాయ

ఇతివృత్తం: భూగోళంపై ప్రాణి కోటి ప్రభావితం, పర్యావరణ ముప్పు

ప్రోత్సాహక బహుమతి: శౌర్యేంద్ర దత్తా

ఇతివృత్తం: భూగోళంపై ప్రాణికోటి ప్రభావితం, పర్యావరణ ముప్పు

 

   ‘ఎన్‌హెచ్ఆర్‌సి’ నిర్వహించిన ఈ పోటీకి ‘మైగవ్’ (471), కమిషన్ వెబ్‌సైట్ (171)ల ద్వారా  మొత్తం 642 ఫొటోలు అందాయి. అటుపైన వీటన్నిటినీ పరిశీలించి, విజేతల ఎంపిక కోసం కమిషన్ పూర్తిస్థాయి న్యాయనిర్ణేతల సంఘానికి నివేదించేందుకు బయట నుంచి నిపుణులను సభ్యులుగా చేర్చి, మూడు ఉప-సంఘాలను ఎన్‌హెచ్ఆర్‌సి’ నియమించింది. ఈ కమిటీలు లోతుగా పరిశీలించిన అనంతరం 20 ఛాయా చిత్రాలను ఎంపిక చేసి, న్యాయనిర్ణేతల సంఘానికి నివేదించాయి.

 

***



(Release ID: 2049245) Visitor Counter : 46


Read this release in: English , Urdu , Hindi , Tamil