ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఆర్ఐఎన్ఎల్, ఐఓసీఎల్ మధ్య ఎంఓయూ 5 సంవత్సరాలపాటు హైడ్రాలిక్, లూబ్రికేటింగ్ నూనెలు, గ్రీజుల సరఫరా

Posted On: 27 AUG 2024 6:14PM by PIB Hyderabad

విశాఖపట్నం ఉక్కు క‌ర్మాగారానికి చెందిన‌  కార్పొరేట్ సంస్థ  ఆర్ ఐ ఎన్ ఎల్  పరిపాలనా భవనంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఈ రోజు జరిగిన ఒక సాధారణ కార్యక్రమంలో  ఆర్.ఐ.ఎన్.ఎల్ కీఐఓసిఎల్ మ‌ధ్య‌న ఒక అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రం ( ఎంఓయు)పై సంత‌కాలు జ‌రిగాయి. దీని ప్రకారం, 2024 నుండి 2029 వరకు అంటే 5 సంవత్సరాల కాలంపాటు హైడ్రాలిక్లూబ్రికేటింగ్ నూనెలుగ్రీజుల‌ను ఆర్ ఐ ఎన్ ఎల్ కు... ఐఓసీఎల్ స‌ర‌ఫ‌రా చేస్తుంది. 

 

ఎంఓయూ పత్రాలను  ఆర్ఐఎన్ఎల్ అధికారి శ్రీ ఎకె బాగ్చి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) అదనపు ఛార్జ్ డైరెక్టర్ (ఆపరేషన్స్), ఐఓసీఎల్ అధికారి శ్రీ బి ఎన్ అనిల్ కుమార్‌ఈడీ అండ్ స్టేట్ హెడ్ (టిపి ఎస్ ఓ- తెలంగాణఆంధ్రప్ర‌దేశ్ స్టేట్ ఆఫీస్) ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్. ఉద‌య్ కుమార్ఈడీ ( ల్యూబ్స్)ఐఓసీఎల్‌శ్రీ. యు. శ్రీధ‌ర్సీజీఎం ( వ‌ర్క్స్‌) ఇంఛార్జిఆర్ ఐ ఎన్ ఎల్శ్రీ వివి సోమ‌రాజుజిఎం (ఎంఎం) అండ్ ఇంఛార్జి హెచ్ ఓడిఎంఎంఆర్ ఐ ఎన్ ఎల్శ్రీ ఆర్. సుంద‌ర నారాయ‌ణ‌న్ సీజీఎం ( ల్యూబ్స్)టిఏపిఎస్ ఓఐఓసిఎల్ జిఎం ( ల్యూబ్స్‌)శ్రీ ఎన్ విఎస్ మూర్తి జిఎం (ల్యూబ్స్)ఐఓసిఎల్‌శ్రీ జ‌య‌శంక‌ర్ వ‌రిక్క‌ట్‌జిఎంటిఏపిఎస్ ఓఐఓసిఎల్‌ఇంకా ఆర్ ఐ ఎన్ ఎల్‌ఐఓసీ ఎల్ సంస్థ‌ల‌కు చెందిన సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా ఆర్‌ఐఎన్‌ఎల్ కు చెందిన‌ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) అడిషనల్ ఛార్జ్ డైరెక్టర్ (ఆపరేషన్స్)  అయిన శ్రీ ఎకె బాగ్చి మాట్లాడుతూ  ఆర్‌ఐఎన్‌ఎల్ & ఐఓసిఎల్ మధ్యన కుదిరిన ఈ ఎంఓయు అనేది జాతి నిర్మాణానికి వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌గ‌తిశీల స‌హ‌కారం ఎలా దోహ‌దం చేస్తుందో తెలియ‌జేయ‌డానికి ఒక ప్ర‌మాణంగా నిలుస్తుంద‌ని అన్నారు. 

 

ఆర్ఐఎన్ఎల్ అమ‌లు చేస్తున్న  కఠినమైన కార్యాచరణ అవసరాలను తీర్చ‌గ‌లిగేలా క్లిష్టమైన,  కీలకమైన అంశాల్లో  లూబ్రికెంట్ల కు సంబంధించిన‌ అనేక క్లిష్టమైన గ్రేడ్‌లను అభివృద్ధి చేసినందుకు శ్రీ  ఐఓసీఎల్ కు  శ్రీ ఏకె బాగ్చీ  కృతజ్ఞతలు తెలిపారు.

 

ఐఓసీఎల్ ఈడీ (ల్యూబ్స్)  శ్రీ ఆర్. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ ఐ ఎన్ ఎల్ కు ఐఓసిఎల్ కు మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందాన్ని అత్యంత‌కీల‌క‌మైన‌దిగా అభివ‌ర్ణించారు. ఆర్ఐఎన్ఎల్ఐఓసీఎల్ మ‌ధ్య 3 ద‌శాబ్దాల‌కు పైగా దీర్ఘ‌కాల అనుబంధం ఉంద‌ని అన్నారు. ప‌ర‌స్ప‌ర న‌మ్మ‌కంవృత్తిప‌ర‌మైన అత్యున్న‌త సామ‌ర్త్యం  దీనికి కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. 

 

ఆర్ఐఎన్ఎల్ కుఐఓసీఎల్ కు మ‌ధ్య‌న‌ మొద‌టి ఎంఓయు 1994-95 మ‌ధ్య‌న కుదిరిన విష‌యం గ‌మ‌నార్హం. 

 

ఈ ఎంఓయు అనేది ఆర్ఐఎన్ఎల్  అవసరాలను తీర్చడానికి వీలుగా  ఐఓసిఎల్ నుండి ఎలాంటి అవాంత‌రాలు లేకుండానిరంత‌రం లూబ్రికెంట్ల సరఫరా జ‌రిగేలా విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఐఓసిఎల్ అనేది విశాఖపట్నం ఆర్ఐఎన్ఎల్  ఉక్కు కర్మాగారానికి లూబ్రికేషన్ విభాగంలోనుక్లిష్ట‌మైన‌భారీ హైడ్రాలిక్‌ల్యూబ్ వ్య‌వ‌స్థ‌ల విష‌యంలోనుమొత్తం భారీ ఆయిల్ నిర్వ‌హ‌ణ‌వినియోగ ఆయిల్ నిర్వ‌హ‌ణ‌లోను సాంకేతిక మద్దతును అందిస్తుంది. 

 

ఐఓసిఎల్ సంస్థ‌.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారులకు ఫరీదాబాద్‌లోని ఐఓసిఎల్- ఆర్ అండ్ డి కేంద్రంలో శిక్షణను అందిస్తుంది. ఈ శిక్ష‌ణ‌ లూబ్రికెంట్ల వినియోగాన్ని తగ్గించడానికి,  ల్యూబ్ వినియోగానికి సంబంధించిన ఉత్త‌మ‌  స్థాయులను నిర్వహించడానికి ఆర్ఐఎన్ఎల్ కు  సహాయపడుతుంది.

 

***


(Release ID: 2049242) Visitor Counter : 106
Read this release in: Urdu , Hindi , English , Tamil