సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే 7వ అనుభవ్ అవార్డుల ప్రదానోత్సవం-2024లో ఐదుగురికి అనుభవ్ అవార్డులు, ఐదుగురు మహిళా పింఛనుదారులతో సహా 10 మందికి జ్యూరీ ధ్రువీకరణ పత్రాల ప్రదానం


విజేతలకు అవార్డులు, ధ్రువీకరణ పత్రాలను అందించనున్న సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 AUG 2024 3:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఆదేశాల మేరకు పింఛనుపింఛనుదారుల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) 2015 మార్చిలో 'అనుభవ్పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. పదవీ విరమణ చేయనున్న లేదా చేసిన ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో సాధించిన గణనీయమైన విజయాలను ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక. ఇప్పటి వరకు 54 అనుభవ్ అవార్డులు, 9 జ్యూరీ ధ్రువీకరణ పత్రాలను అందించారు.


2. డీఓపీపీడబ్ల్యూ 2016లో ఈ అవార్డులను ప్రధానోత్సవాన్ని ప్రారంభించింది. ఇప్పుడు నిర్వహించేంది ఏడవది.  2024 ఆగస్టు 28న న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే 7వ అనుభవ్ అవార్డుల ప్రదానోత్సవంలో సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అవార్డులుధ్రువీకరణ పత్రాలను అందించనున్నారు.

3. 2024లో ఐదుగురు అనుభవ్ అవార్డు గ్రహీతలు కాగా..  10 మంది జ్యూరీ విజేతలుగా నిలిచారు. వారి జాబితా:



 

అనుభవ్ అవార్డ్ విజేతలు

క్రమ సంఖ్య

అవార్డు విజేతల పేరు

(శ్రీమతి/శ్రీ.)

హోదా

మంత్రిత్వ శాఖ/విభాగం/సంస్థ

1.

టీ.జాకొబ్ 

కార్యదర్శి

యూపీఎస్సీ

2.

అదితి దాస్ రౌత్

అదనపు కార్యదర్శి

మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ

3.

జీ.నాంచారమ్మ

టెక్నికల్ ఆఫీసర్-డీ

డీఆర్డీఓ

4.

రాజేష్ కుమార్ పరిడా

డిప్యూటీ కమాండెంట్

బీఎస్ఎఫ్

5.

అప్పన్ శ్రీధర్

జూనియర్ ఇంజనీర్

రైల్వే మంత్రిత్వ శాఖ


 

అనుభవ్ జ్యూరీ ధ్రువీకరణ పత్రాల విజేతలు

క్రమ సంఖ్య

అవార్డు విజేతల పేరు

(శ్రీమతి/శ్రీ.)

హోదా

మంత్రిత్వ శాఖ/విభాగం/సంస్థ

1.

సంజీవ్ శర్మ

చీఫ్ కమిషనర్ఆదాయపు పన్ను శాఖ

సీబీడీటీ

 

2.

శకుంతలా పట్నాయక్

డిప్యూటీ చీఫ్ లేబర్

కమీషనర్

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ

3.

సుదేశ్ కుమార్

టెక్నికల్ ఆఫీసర్-డీ

డీఆర్డీఓ

4.

కృష్ణ మోహన్ షాహి

కమిషనర్ఆదాయపు పన్ను శాఖ

సీబీడీటీ

5.

ఎన్.దేశింగు రాజన్

ఇన్స్పెక్టర్/మంత్రిత్వ శాఖ

సీఐఎస్ఎఫ్

6.

జీ. స్వర్ణలత

ప్రధాన కార్యాలయం సూపరింటెండెంట్

రైల్వే మంత్రిత్వ శాఖ

7.

మోనిరుల్ ఇస్లాం

సబ్ ఇన్ స్పెక్టర్

సీఆర్పీఎఫ్

8.

రాజేంద్ర సింగ్

లాన్స్ నాయక్

బీఎస్ఎఫ్

9.

సురేందర్ సింగ్

సబ్ ఇన్‌స్పెక్టర్

సీఆర్పీఎఫ్

10.

కన్సోంటినా లక్రా

అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్/ నర్సింగ్ అసిస్టెంట్

సీఆర్పీఎఫ్


4. 2024 సంవత్సరానికిఅనుభవ్ అవార్డు గ్రహీతలుజ్యూరీ ధ్రువీకరణ పత్రాల విజేతలు ఈ విభాగాల కింద తమ రచనలను సమర్పించారు: (i) అడ్మిన్ వర్క్, (ii) సుపరిపాలన, (iii) పరిశోధన, (iv) ప్రక్రియల సరళీకరణ, (v) ఖాతాలు (vi) క్షేత్రస్థాయిలో వారి పనికి సహకారం (vi) పని విధానాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక అభిప్రాయాలు లేదా సూచన.

5. 15 మంది అవార్డు గ్రహీతల్లో 33 శాతం మంది మహిళలే కావటం, 2015లో 'అనుభవ్ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. ఇది మహిళల పెరుగుతున్న పాత్రను తెలియజేస్తుంది. ఈ కారణాల వల్ల ఈ అవార్డు ప్రదానోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది.
6. అనుభవ్ అవార్డులో (i) పతకం (ii) ధ్రువీకరణ పత్రం (iii) రూ. 10,000/- ప్రోత్సాహకం ఉంటాయి. అనుభవ్  జ్యూరీ ధ్రువీకరణ పత్రంలో (i) మెడల్ (ii) ధ్రువీకరణ పత్రం ఉంటాయి.

 

****


(Release ID: 2049235) Visitor Counter : 85