ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంచనా విశ్లేషణల ద్వారా పన్ను అమలులో ఆవిష్కరణలు వేగవంతం: జీఎస్టీ ఎనలిటిక్స్ హాకథాన్ ను నిర్వహిస్తున్న వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్)
నమోదు ప్రారంభం నుండి రూపొందించిన నమూనాల సమర్పణ తుది గడువు వరకు 45 రోజుల పాటు కొనసాగనున్న హాకథాన్
प्रविष्टि तिथि:
23 AUG 2024 3:46PM by PIB Hyderabad
అంచనా విశ్లేషణల ద్వారా పన్ను అమలులో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్) జీఎస్టీ ఎనలిటిక్స్ హాకథాన్ నిర్వహిస్తున్నది. జీఎస్టీ విశ్లేషణల పని విధానం కోసం ఒక అంచనా నమూనాను రూపొందించడానికి భారత విద్యార్థులు, పరిశోధకులకు అలాగే అంకుర సంస్థలు, కంపెనీలకు చెందిన నిపుణులను ఈ సవాలు స్వాగతిస్తోంది. నమోదుతో ప్రారంభమయ్యే ఈ హాకథాన్ రూపొందించిన నమూనాలను సమర్పించు తుది గడువు వరకు మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది.
జీఎస్టీ విశ్లేషణల హాకథాన్ కోసం అర్హత, బహుమతి, ఇతర వివరాలు:
అర్హత: విద్యాసంస్థలు లేదా వ్యాపార సంస్థలతో అనుబంధంగా ఉన్న భారతీయులందరూ పాల్గొనవచ్చు.
బహుమతి: అభ్యర్థులు మొత్తం రూ.50 లక్షల బహుమతి కోసం పోటీపడవచ్చు. దీనిలో ప్రథమ బహుమతి రూ.25 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.12లక్షలు, తృతీయ బహుమతి రూ.7లక్షలు. అలాగే ప్రోత్సాహక బహుమతి రూ.లక్ష ఉన్నాయి. అదనంగా, అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళా బృందానికి ప్రత్యేక బహుమతి రూ. 5 లక్షలు.
నమోదు, పాల్గొనడం: పాల్గొనే అభ్యర్థులు కింది లింక్ ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు అలాగే డేటా సెట్స్, పోటీ మార్గదర్శకాలు సహా వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు:
https://event.data.gov.in/event/gst-analytics-hackathon/
జీఎస్టీలో ఒక అధునాతన విశ్లేషణల నమూనా రూపకల్పనలో పాల్గొనుటకు అర్హులైన ఆవిష్కర్తలందరినీ ఆహ్వానిస్తున్నారు. జీఎస్‌టీఎన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వ్యక్తిగతంగా బహుమతులను గెలుచుకోవడంతో పాటు జాతి నిర్మాణం కోసం ఆవిష్కరణలు చేయడానికీ, అలాగే తోడ్పాటునందించే అత్యుత్తమ అవకాశాన్ని కల్పిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2048543)
आगंतुक पटल : 107