ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జీఎస్టీ భవన్‌ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
వాణిజ్య వర్గాలు, పన్ను అధికారుల మధ్య క్రమబద్ధమైన పరస్పర చర్చలు, సానుకూల సంభాషణల ద్వారా పరిష్కారాలు ఏకీకృతం అవుతాయి: కేంద్ర ఆర్థిక మంత్రి
కస్టమ్స్ కార్యకలాపాల కోసం హ్యాండ్‌హెల్డ్ పరికరం 'ఐసిఈ ట్యాబ్ 2.0'ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి
ఈ పరికరం ద్వారా రియల్ టైంలో పరిశీలన నివేదికలను అప్ లోడ్ చేయడానికి , కార్గోలను త్వరగా క్లియరెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది
సిజిఎస్టీ ఉదయపూర్ భవనం ఆధునికమైనది, ఇంధన సామర్థ్యం, హరిత భవనాల కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రూపొందింది: సిబిఐసి చైర్మన్
Posted On:
23 AUG 2024 6:16PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఆధ్వర్యంలో ఉదయపూర్ కమిషనరేట్, సిజిఎస్టి అధికారిక సముదాయాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రారంభించారు.
లోక్ సభ సభ్యులు శ్రీ మన్నా లాల్ రావత్; రాజ్యసభ సభ్యులు శ్రీ చున్నిలాల్ గరాసియా, సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్; సిబిఐసి సభ్యులు శ్రీ శశాంక్ ప్రియ; శ్రీ రాజీవ్ తల్వార్; శ్రీ సూర్జిత్ భుజబల్; జైపూర్ జోన్ సిజిఎస్టీ చీఫ్ కమీషనర్ శ్రీ మహేంద్ర రంగా ; సిబిఐసి సీనియర్ అధికారులు, సిజిఎస్టి ఉదయపూర్ కమిషనరేట్, జైపూర్ జోన్ అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు.
జింక్, సీసం, వెండి, సిమెంట్, ఎరువులు, టైర్లు వంటి వస్తువులను ఉత్పత్తి చేసే హబ్‌లో ఉదయపూర్ కమిషనరేట్ ఆర్థికంగా ప్రాశస్త్యాన్ని కలిగి ఉందని శ్రీమతి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సవాళ్లు ఎదురైనప్పటికీ కేటాయించిన బడ్జెట్లో, అనుకున్న సమయంలోపు ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేయడం అభినందనీయమన్నారు.

పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాలు, సిబ్బందికి విస్తారమైన పని ప్రదేశం అందించడంలో ప్రాజెక్ట్ నాణ్యత, భవిష్యత్ అవసరాలకు కట్టుబడి ఉందని శ్రీమతి సీతారామన్ తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వహణలో, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి సన్నాహాలు చేయడంలో అధికారులు, ఏజెన్సీల కృషిని ప్రశంసించారు. జిఎస్టి జోన్‌లు, కమిషనరేట్‌లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 2019 నుండి ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
వర్తక, వాణిజ్య వర్గాలు, పన్ను అధికారుల మధ్య క్రమబద్ధమైన పరస్పర సానుకూల చర్చల ద్వారా పరిష్కారాలను ఏకీకృతం చేస్తుందని ఆమె అన్నారు. జిఎస్టీ-సంబంధిత ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని, మరింత సంస్కరణలు అవసరమయ్యే ప్రాంతాల గుర్తింపు కోసం రంగాల వారీగా ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను సిఫార్సు చేయాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ చట్టాన్ని మృదువుగా అమలు చేయాలని, చివరి ప్రయత్నంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి కస్టమ్స్ కార్యకలాపాల కోసం హ్యాండ్‌హెల్డ్ పరికరం అయిన ఐసిఈ ట్యాబ్ 2.0ని కూడా ప్రారంభించారు. ఇది రియల్ టైం లో పరిశీలన నివేదికలను అప్‌లోడ్ చేయడంలో, కార్గోలను త్వరగా క్లియరెన్స్ చేయడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వాగత ప్రసంగంలో, సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, సిజిఎస్టీ ఉదయపూర్ భవనం ఆధునికమైనది, ఇంధన సామర్థ్యం, గ్రీన్ బిల్డింగ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందని అన్నారు.
ఈ సముదాయం ఉదయపూర్‌లో అత్యంత అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఉదయపూర్ కమిషనరేట్‌లోని ప్రధాన జిల్లాలకు కూడలిలో ఉంటుంది. జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయపూర్ రైల్వే స్టేషన్ నుండి 2.5 కి.మీ, బస్టాండ్ నుండి 3.5 కి.మీ దూరంలో ఉంది.
***
(Release ID: 2048532)
Visitor Counter : 76