కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికాం రంగంలోని ఓఈఎంలతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో ఎస్ఏసీ సమావేశం


* అభివృద్ధి చెందిన టెలికాం తయారీ రంగంతో ప్రవేశ స్థాయి ఉద్యోగావకాశాలు, నైపుణ్య మానవ వనరులకు గొప్ప అవకాశం

* నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం, ప‌రిశ్ర‌మ‌లకు అనువైన విధానాన్ని రూపొందించాం: మంత్రి

Posted On: 21 AUG 2024 7:25PM by PIB Hyderabad

టెలికాం రంగంలోని పరికరాల తయారీ సంస్థ(ఓఈఎమ్)లతో కలసి టెలికమ్యూనికేషన్ల విభాగం - నిపుణుల సలహా సంఘం(ఎస్ఏసీ) రెండో సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కమ్యూనికేషన్లుఈశాన్య భారత అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగింది. భారత టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ భవిష్యత్తును మలచడంలో పారిశ్రామిక దిగ్గజాలను మమేకం చేసేందుకు ఈ చొరవ కీలకం కానుంది. సమ్మిళితసహకార విధాన నిర్ణయాలను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా ఈ సమావేశం సాగింది.

 

దేశీయంగా తయారీని ప్రోత్సహించడంఆచరణ సాధ్యమైన అమలు విధానంసరళీకృత వ్యాపార విధానాలను విస్తరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై సమీక్ష జరిపారు. నిపుణుల సలహా సంఘం (ఎస్ఏసీ)లోని సభ్యులు టెలికాం రంగంలో తాము సాధించబోయే లక్ష్యాల గురించి వివరించారు. అభివృద్ధి చెందిన టెలికాం తయారీ రంగం ప్రవేశ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి చేస్తుందని ఎస్ఏసీ విశ్వాసం వ్యక్తం చేసింది. దేశీయంగానూ అంతర్జాతీయంగానూ టెలికాం రంగ అభివృద్ధికి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని సభ్యులు తెలిపారు.

 

సమావేశంలో ఓఈఎంలకు చెందిన ప్రతినిధులు/సీనియర్ అధికారులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని శ్రీ సింధియా హామీ ఇచ్చారు. నిర్ణీత కాలవ్యవధిలో వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు పారిశ్రామిక అనుకూలమైన విధానాలను  ప్రభుత్వం రూపొందించిందని మంత్రి తెలిపారు. ఇతర దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను ఓఈఎంలు దేశంలో అమలు చేయాలని సూచించారు.

టెలికమ్యూనికేషన్ల విభాగానికి సంబంధించిన వివిధ అంశాల్లో విలువైన సూచనలు ఇచ్చేందుకు మంత్రి సింధియా ఆరు నిపుణుల సలహా సంఘాలను(ఎస్ఏసీస్) ఏర్పాటు చేశారు. ఈ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో పరస్పర చర్చలు నిర్వహించడంపై ఈ కమిటీలు దృష్టి సారిస్తాయి. పారిశ్రామిక మేధావులుఅగ్ర సీఈవోలువిద్యావేత్తలుపరిశోధకులువ్యాపారవేత్తలుఅంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ సలహా కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.

ప్రతిపాదించిన సూచనలు అమలు చేస్తూ, ఉత్పాదకతను ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించి టెలికాం రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టెలికమ్యూనికేషన్ల విభాగం నిర్దేశించుకుంది. ఈ చర్చల ద్వారా నిర్దేశించిన అంశాలను వేగంగా అమలు చేసేందుకు ఈ విభాగం కట్టుబడి ఉంది.

 

***



(Release ID: 2047883) Visitor Counter : 26