వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రి అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి గా శ్రీ అమర్ దీప్ సింగ్ భాటియా పదవీ బాధ్యతల స్వీకారం
प्रविष्टि तिथि:
21 AUG 2024 3:49PM by PIB Hyderabad
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) కు చెందిన అధికారి శ్రీ అమర్ దీప్ సింగ్ భాటియా వాణిజ్యం- పరిశ్రమల మంత్రిత్వ శాఖ- డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న ఐఎఎస్ అధికారి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ కు రక్షణ విభాగం లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. ఇంతకు ముందు ఆయన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని వాణిజ్య విభాగంలో అదనపు కార్యదర్శిగా సేవలను అందించారు.
శ్రీ అమర్ దీప్ సింగ్ భాటియా 1993 బ్యాచ్ లో నాగాలాండ్ కేడరుకు చెందిన ఐఎఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వంలో, ఆయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోను, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోను అనేక ముఖ్య పదవులలో పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో- ఆయన ప్రణాళిక రచన, సమన్వయం, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, పర్యావరణం- అడవులు, పురపాలక సంఘాలు, ఇంకా స్థానిక స్వపరిపాలన, హోమ్ సహా ఇతర విభాగాల్లో పని చేశారు.
***
(रिलीज़ आईडी: 2047571)
आगंतुक पटल : 93