భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ ద్వారా శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాటాల కొనుగోలుకు ‘సిసిఐ’ ఆమోదం
प्रविष्टि तिथि:
20 AUG 2024 8:17PM by PIB Hyderabad
మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ (కొనుగోలుదారు) ద్వారా శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో వాటా కొనుగోలుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ) ఆమోదం తెలిపింది.
మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ మారిషస్ దేశానికి చెందినది. ఈ కంపెనీ పెట్టుబడుల సంబంధిత లావాదేవీలు నిర్వహిస్తూంటుంది. కాగా, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘నేషనల్ హౌసింగ్ బ్యాంక్’ పరిధిలో నమోదిత గృహనిర్మాణ ఆర్థిక సహాయ సంస్థ.
ఈ రెండు కంపెనీల మధ్య విక్రయం-కొనుగోలు లావాదేవీపై ‘సిసిఐ’ త్వరలో పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2047558)
आगंतुक पटल : 90