వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యార్థుల‌ కోసం హాక‌థాన్ ను ప్రారంభించిన భార‌తీయ ప్రమాణాల సంస్థ‌


విద్యార్థుల‌ కోసం హాక‌థాన్ ను ప్రారంభించిన భార‌తీయ ప్రమాణాల సంస్థ‌

Posted On: 20 AUG 2024 5:27PM by PIB Hyderabad

బీఐఎస్ తో అవ‌గాహ‌న ఒప్పందాల‌ను ( ఎంఓయూ) చేసుకున్న ఆయా సంస్థల విద్యార్థి బృందాలకు ఆహ్వానం ప‌లుకుతూ భార‌తీయ ప్రమాణాల సంస్థ ( బిఐఎస్ ) హాక‌థాన్ ను ప్రారంభించింది. బీఐఎస్ గుర్తించిన వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థుల్లో సృజనాత్మక స్ఫూర్తిని నింప‌డానికి, సమస్యలను పరిష్కరించే నేర్పును , పరస్పర స‌హ‌కార నైపుణ్యాల‌ను క‌లిగించ‌డానికిగాను ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

 

ఆన్ లైన్ కార్యక్రమాలను (యాక్టివిటీస్), ఆట‌ల‌ను నిర్వహించడానికిగాను ఒక వేదిక‌ను అభివృద్ధి చేయ‌డానికి విద్యార్థులు కృషి చేసేలా హాక‌థాన్ ఒక వినూత్నమైన అవ‌కాశాన్ని అందిస్తోంది. ఆసక్తిని క‌ల‌గ‌జేయ‌డం, విజ్ఞానాన్ని పెంపొందించ‌డం, భార‌తీయ ప్రమాణాల పట్ల అవ‌గాహ‌న పెంచ‌డం...సాధార‌ణ ప్రజలతోపాటు, ఇత‌ర బీఐఎస్ వాటాదారులకు నాణ్యత, భద్రత ల‌భించేలా ఆయా ప్రమాణాల పాత్రపై అవ‌గాహ‌న పెంచ‌డం హాక‌థాన్ ల‌క్ష్యం. దేశ మౌలిక స‌దుపాయాల కల్పనలోనూ, సామాజిక అభివృద్ధిలోను నాణ్యతప‌ట్ల‌, ప్రమాణాలపట్ల చైత‌న్యం క‌లిగి ఉండ‌డం చాలా ముఖ్యం. ప్రమాణాలను ప్రోత్సహించడం కోసం వివిధ వాటాదారుల‌తో క‌లిసి బీఐఎస్ ప‌ని చేస్తుంది. వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ వాటాదారులు, పరిశ్రమలు, వినియోగ‌దారులు,  విద్యాసంస్థలతో క‌లిసి ప‌ని చేస్తుంది. క్వాలిటీ క‌నెక్ట్‌, మ‌న‌క్ మహోత్సవ్, మ‌న‌క్ మంథ‌న్‌, క్యాప్సూల్ కోర్స్‌, గ్రామ పంచాయ‌తీల్లో అవ‌గాహ‌న పెంచ‌డం, ప్రమాణీక‌ర‌ణ‌పై రాష్ట్రస్థాయి క‌మిటీ ఏర్పాటు,  జిల్లాస్థాయి అధికారుల్లో , రాష్ట్రస్థాయి అధికారుల్లో అవ‌గాహ‌న పెంచ‌డం, వినియోగ‌దారుల  చైత‌న్య కార్య‌క్రమాలు, పౌర సంక్షేమ సంస్థల్లో అవ‌గాహ‌న పెంచ‌డం, లైసెన్సీదారుల స‌మావేశాలు, పరిశ్రమలు, పరిశ్రమ అసోసియేషన్ల మధ్య స‌మావేశాలు, ప్రమాణాల క్లబ్బులు, వాటి కార్యక్రమాలు,  అవ‌గాహ‌న పెంచ‌డానికి పర్యటనలు, మెంట‌ర్ శిక్షణ, నిపుణ‌ల సిబ్బంది శిక్షణ, సైన్స్ టీచ‌ర్ శిక్షణ మొద‌లైన కార్యక్రమాలను బీఐఎస్ నిర్వహిస్తోంది.

 

భారీ సంఖ్యలో వాటాదారులు తమ నివాస గృహాలనుంచే బీఐఎస్ కార్యకలాపాలతో అనుసంధానం అయ్యేందుకు ఆన్ లైన్ ఉపకరిస్తుంది. అదే స‌మ‌యంలో నాణ్యత, ప్రమాణాలకు సంబంధించిన ఉప‌యోగ‌క‌ర‌మైన స‌మాచారాన్ని విస్తరింప చేయ‌డానికి వీల‌వుతుంది. నాణ్యత, ప్రమణాలనే అంశంమీద బీఐఎస్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్విజ్ పోటీల‌ను నిర్వహించారు. మ‌రింత ఆకర్షణీయమైన, ఆలోచనను రేకెత్తించే ఆన్‌లైన్ కార్యక్రమాలు నాణ్యత, భార‌తీయ ప్రమాణాలపై చైత‌న్యం, అవ‌గాహ‌నను మ‌రింత పెంచుతాయి.

 

చైత‌న్యాన్నీ, నాణ్యతాప‌ర‌మైన స్పృహ‌ను పెంచే కృషిలో భాగంగా బీఐఎస్ అనేక ఆన్ లైన్

కార్యక్రమాలను రూపొందించింది. ఆయా కార్యక్రమాలు, ఆట‌లను నిర్ణీత‌ స‌మ‌య పరిధిలోను, లేదా నిరంత‌రం నిర్వహించడానికి వీలు ఉంది.  ప్రపంచ ప్రమాణాల దినోత్సవం, ప్రపంచ వినియోగ‌దారుల హ‌క్కుల దినోత్సవం, సంస్థల ఏర్పాటు దినోత్సవం  వంటి ప్రత్యేక సంద‌ర్భాల‌ను పురస్కరించుకుని బీఐఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. బ‌హుమ‌తులతో, లేకుండానూ కూడా వాటిని నిర్వహించవచ్చు. ఈ కార్యక్రమాల్లో 5 లక్షల మందికిపైగా పాల్గొనవ‌చ్చు. 

 

హాక‌థాన్ కీల‌క వివ‌రాలు

హాక‌థాన్ పోర్టల్ :   https://www.services.bis.gov.in/php/BIS_2.0/bis-hackathon/  ను క్లిక్ చేయాలి. 

మార్గదర్శకాలు :  https://www.services.bis.gov.in/php/BIS_2.0/bis-hackathon/assets/images/guidelines.pdf ద్వారా పొంద‌వ‌చ్చు. 

 

స‌మ‌స్యల ప్రకటన‌:  భార‌తీయ ప్రమాణాల మీద దృష్టి పెట్టిన ఆన్ లైన్ కార్యక్రమాలు, ఆట‌ల‌కోసం వేదిక‌ను రూపొందించ‌డం, అభివృద్ధి చేయ‌డం అనే ప‌నిని హాక‌థాన్ లో పాల్గొనేవారికి అప్పగిస్తారు.

స‌మ‌స్య ప్రకటన  https://www.services.bis.gov.in/php/BIS_2.0/bis-hackathon/PSInfo/detail/1 లో ల‌భిస్తుంది. 

 

ఆఖ‌రి తేదీ :   అన్ని ఎంట్రీల‌ను ఆగ‌స్ట్ 23, 2024 నాటికి పంపాలి.

 

వినూత్నమైన ఆలోచ‌న‌ల్ని, ప‌రిష్కారాల‌ను ప్రదర్శించే వేదికే బీఐఎస్ హాక‌థాన్. అంతేకాదు దీనిద్వారా వాస్తవ ప్రపంచ సమస్యల ప‌రిష్కారానికి సంబంధించిన విలువైన అనుభ‌వం సంపాదించుకోవ‌చ్చు. ఈ కార్యక్రమంలో అర్హ‌త‌గ‌ల విద్యార్థి బృందాలు పాలుపంచుకోవాలని, ప్రమాణాలు, భద్రత‌ను పెంపొందించడంలో వారి పాత్ర ఉండాలని బీఐఎస్ కోరుకుంటున్నది.

 

***


(Release ID: 2047533) Visitor Counter : 51