భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఇన్వెస్కో అసెట్ మేనేజ్ మెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెస్కో ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్లలో వాటాల సమీకరణకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ), ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీకి తన ఆమోదాన్ని తెలిపింది.
Posted On:
20 AUG 2024 8:18PM by PIB Hyderabad
ప్రతిపాదిత వాటాల సమీకరణ ప్రకారం- ఇన్వెస్కో అసెట్ మేనేజ్ మెంట్ (ఇండియా ) ప్రైవేట్ లిమిటెడ్ (ఇన్వెస్కో ఎ.ఎం.సి) అలాగే, ఇన్వెస్కో ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ (ఇన్వెస్కో ట్రస్టీ) లలో ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) ఒక్కొక్క దానిలో 60 శాతం చొప్పున వాటాలను తీసుకుంటున్నది. ఐఐహెచ్ఎల్ఈ పెట్టుబడిని తన పూర్తి యాజమాన్యంలోని, తన నియంత్రణలోగల సబ్సిడరీ కంపెనీ ఐఐహెచ్ ఎల్ –ఎ.ఎం.సి హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా సమీకరిస్తుంది. ప్రతిపాదిత కాంబినేషన్ కోసమే దీనిని ఏర్పాటు చేశారు.
ఐఐహెచ్ఎల్ గ్లోబల్ బిజినెస్ లైసెన్స్ (కేటగిరి 1) లైసెన్సీ కంపెనీ. దీనిని రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ దేశంలో ఏర్పాటు చేశారు. ఐఐహెచ్ ఎల్ ప్రధాన కార్యకలాపాలు- ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్. అందువల్ల వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల షేర్లను ఐఐహెచ్ ఎల్ కలిగి ఉంది.
ఇన్వెస్కో ట్రస్టీ ,ఒక ట్రస్టీ కంపెనీ కాగా, ఇన్వెస్కో ఎ.ఎం.సి అనేది అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ. ఇవి ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ నకు చెందినవి. వీటికి సెబి (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్1996 నిబంధనల కింద సెబి అనుమతి అవసరం. ఇన్వెస్కో ఎ.ఎం.సి అనేది సెబి (పోర్టుఫోలియో మేనేజర్స్) రెగ్యులేషన్ , 2020 కింద పోర్టుఫోలియో మేనేజర్ గా రిజిస్టర్ అయింది.
పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని సీసీఐ విడుదల చేయనున్నది.
***
(Release ID: 2047253)
Visitor Counter : 65