శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శిలీంధ్ర వ్యాధులను ఎదుర్కోవడంలో సమర్థవంతమైన డ్రగ్ డెలివరీ పద్దతి

Posted On: 20 AUG 2024 1:09PM by PIB Hyderabad

దీర్ఘకాలం పాటు అస్తమా (ఉబ్బసం), సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ఇతర శ్వాసకోస వ్యాధులు, హెచ్ఐవి, క్యాన్సర్ వంటి వ్యాధుల కోసం ఔషదాలు వాడేవారు లేదా కార్టికోస్టెరాయిడ్ మందులను ఎక్కువ కాలం వాడిన రోగులకు ఔషధాన్ని ఇచ్చేందుకు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఔషదాలను నానోపార్టికల్స్ రూపంలో ఇచ్చినట్లయితే, రోగుల శరీరాల్లోకి వ్యాధికారక ప్రాంతానికి మాత్రమే వెళతాయి. పాలిమరిక్ నానోపార్టికల్స్ వాడకం ఔషధ పంపిణీలో అత్యంత అధునాతన పద్ధతి. ప్రస్తుతం ఉపయోగించే అజోల్ మందులు ఫంగల్ పొరపై దాడి చేసి శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. ఏదేమైనా, ఇప్పటికే ఉన్న శిలీంద్ర నాశని మందులకు నిరోధకత  ఆందోళన కలిగిస్తున్న అంశం. అందువల్ల ఔషధాన్ని  ఇవ్వడంలో మెరుగైన పద్ధతులు అవసరం. తద్వారా వ్యాధుల చికిత్సకు మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. సైన్స్,  టెక్నాలజీ విభాగానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ, అగార్కర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం పాలిమరిక్ నానోపార్టికల్స్ కలిగిన కైటిన్ సంశ్లేషణ శిలీంధ్ర నాశిని 'నిక్కోమైసిన్' ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం స్ట్రెప్టోమైసిన్ తరహా బాక్టీరియాని ఉపయోగించారు. కైటిన్ అనేది శీలీంధ్ర కణ గోడల యొక్క ప్రధాన భాగం. ఇది మానవ శరీరంలో లేదు. ఆస్పెర్జిల్లస్ ఫ్లేవస్, ఆస్పెర్జిల్లస్ ఫ్యూమిగటస్ అనే శిలీంధ్రాల వల్ల కలిగే ఆస్పెర్గిలోసిస్ అనే శిలీంధ్ర వ్యాధులకు వ్యతిరేకంగా ఈ నానోపార్టికల్స్ ఔషధం ప్రభావవంతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అభివృద్ధి చేసిన నానో ఫార్ములేషన్ సైటోటాక్సిక్, హీమోలైటిక్ వంటి ప్రతికూల ప్రభావాలు లేవని నిర్థారణ అయింది. పల్మనరీ ఆస్పెర్జిల్లోసిస్ వ్యాధికి వ్యతిరేకంగా నానో పద్దతిలో అభివృద్ధి చేసిన ఈ విధానం పట్ల ఎఆర్ఐ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. శాస్త్రవేత్త డాక్టర్ వందనా ఘోర్మాడే, పీ‌హెచ్‌డీ విద్యార్థి కమల్ మాయట్టు నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన జర్మనీకి చెందిన జర్నల్ ఫర్ నేచర్ రీసెర్చిలో ప్రచురితమైంది. ఇటువంటి యాంటీ ఫంగల్ నానో ఫార్ములేషన్ల పరిధిని మరింత విస్తరించాలని, భవిష్యత్తులో వాణిజ్య కోణంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

 

****


(Release ID: 2047183) Visitor Counter : 107