వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిఙ్ఞ
Posted On:
16 AUG 2024 6:28PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగస్టు 16న ,ఉభయ మంత్రిత్వశాఖలకు చెందిన స్వీపర్లు, ఎం.టి.ఎస్ నుంచి కార్యదర్శి స్థాయివరకు గల ఉద్యోగులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ భగీరథ్ చౌదరి, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
స్వాతంత్ర్యదినోత్సవం మరుసటిరోజున శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తో పాటు, ఐకార్ సిబ్బందితో సమావేశమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఎర్రకోటనుంచి చేసిన ప్రసంగంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించి ప్రకటించిన దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన ప్రతిఙ్ఞ చేశారు. 2047 కు రూపొందించిన రోడ్ మ్యాప్ ను, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి తామందరం గట్టి కృషి చేయడంతోపాటు, కష్టపడి పనిచేద్దామన్నారు. ఈ కల సాకారం కావడానికి మూడురెట్లు పని జరగాల్సి ఉందని ప్రధానమంత్రి తమ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేస్తూ, ప్రధానమంత్రి మార్గనిర్దేశంలో మూడురెట్లు కష్టించి పనిచేద్దామని అన్నారు.
‘మనమంతా ఒకే కుటుంబం, మనం కలిసి పనిచేద్దాం’ అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పూర్తి నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తామంటూ ఆయన ప్రతిఙ్ఞ చేశారు. అదేవిధంగా ఉద్యోగులు, సిబ్బంది చేత ప్రతిఙ్ఞ చేయించారు. ‘కష్టపడి పనిచేసి ,నిజాయితీ, అంకితభావంతో తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి ద్వారా అభివృద్ధి చెందిన భారత్ ను సాధించేందుకు మేం కృషి చేస్తాం’ అంటూ ఆయన ప్రతిఙ్ఞ చేయించారు. అభివృద్ధిచెందిన భారత్ ను సాకారం చేయడంలో గ్రామీణాభివృద్ధి విభాగం కీలక పాత్ర పోషించాలని అంటూ ఆయన, మనం నిజాయితీతో, కష్టపడి పనిచేద్దామని అన్నారు.
***
(Release ID: 2046246)
Visitor Counter : 65