శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లక్షలాది డయాబెటిక్ రోగులకు ఆశలు కల్పిస్తున్న కొత్త పరిశోధన

Posted On: 14 AUG 2024 4:47PM by PIB Hyderabad

మూత్రపిండాల పనితీరును సమర్థవంతంగా పనిచేసేలా, అదేవిధంగా డయాబెటిక్ నెఫ్రోపతి (డిఎన్) వ్యాధిని ఎదుర్కోవటానికి జింక్ ఆక్సైడ్ నానోపార్టికల్స్ సామర్థ్యాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఇది అతిమూత్రవ్యాధి/ మధుమేహ వ్యాధిలో మూత్రపిండాల సమస్యలను నిర్వహించడంలో కొత్త చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేసింది.

డయాబెటిక్ నెఫ్రోపతి (డిఎన్) అనేది దీర్ఘకాలిక డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం) కారణంగా ఏర్పడిన ఒక సాధారణ, తీవ్రమైన సమస్య, ఇది రోగులను బలహీనపరుస్తుంది. ఈ నూతన ఆవిష్కరణ కారణంగా మధుమేహ సంబంధిత మూత్రపిండాల సమస్యలను ఎదుర్కోవడంలో కొత్త చికిత్సా విధానాలకు మార్గం సుగమం చేస్తుంది.

డయాబెటిక్ నెఫ్రోపతి (డిఎన్) అనేది దీర్ఘకాలిక డయాబెటిస్ మెల్లిటస్ (అతిమూత్రవ్యాధి) వల్ల కలిగే సమస్య. ఇది టైప్-1 డయాబెటిస్ ఉన్న 20-50% మంది రోగులలో సాధారణంగా కనిపిస్తుంది. దీన్ని మూత్రపిండాల పనితీరులో క్షీణత ఆధారంగా వర్గీకరిస్తారు. ఇది సాధారణంగా మూత్రపిండ వ్యాధి చివరి దశకు దారితీస్తుంది. మధుమేహం ఉన్నవారి రక్తంలో, అధిక చక్కెర స్థాయిల కారణంగా మూత్రపిండాలలో ఆక్సీకరణ ఒత్తిడిని ప్రేరేపిస్తుంది, తాపజనక అణువులను క్రియాత్మకంగా మారుస్తుంది. మొక్కల నుండి పొందిన అనేక అణువులు, ఉత్పత్తులు డిఎన్ లో వాటి చికిత్సా పాత్ర కోసం పరిశోధిస్తున్నారు

మధుమేహ రోగులలో జింక్ లోపం కారణంగా డీఎన్ వస్తుంది. దేహంలో జింక్ అయాన్లను నిరంతరం విడుదల చేయడానికి జోన్ ఒక డిపోగా పనిచేస్తుంది. జంతు నమూనాలలో ఎఆర్ఐలో నిర్వహించిన అధ్యయనాలు జింక్ ఆక్సైడ్ నానోపార్టికల్స్ గ్లూకోజ్-తగ్గించడం, ఇన్సులినోమిమెటిక్, β-సెల్ ప్రొలిఫెరేటివ్ ప్రభావాలను నిరూపించాయి. మూత్రపిండాలు దెబ్బతినడానికి దారితీసే సెల్యులార్ మార్గాలను కూడా జోన్ తగ్గించగలదా అనే కోణంలో పరిశీలించేందుకు ఇటీవల ప్రయోగాలు జరిగాయి.

డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్న విస్టార్ ఎలుకలపై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్వయంప్రతిపత్తి సంస్థ అయిన పూణేలోని అగార్కర్ పరిశోధన సంస్థ పరిశోధకులు చేసిన అధ్యయనంలో, ఇన్సులిన్ చికిత్స పొందిన డయాబెటిక్ ఎలుకలతో పోలిస్తే జోన్ చికిత్స మూత్రపిండాల పనితీరును గణనీయంగా మెరుగుపరిచింది.

అదనంగా, జింక్ ఆక్సైడ్ నానోపార్టికల్స్ (జోన్) రక్తంలో అధిక చక్కెర ప్రేరిత తాపజనక కణాలు చనిపోకుండా, రక్షణను కల్పించింది.  జోన్ చికిత్స మూత్రపిండాల పనితీరుకు అవసరమైన కొన్ని ప్రోటీన్లను కూడా సంరక్షించింది.

శాస్త్రవేత్తల పరిశోధనల్లో, మధుమేహ సమస్యలకు చికిత్స చేయడానికి జోన్ పరిపూరకరమైన చికిత్సా ఏజెంట్‌గా పనిచేస్తుందని లైఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం డిఎన్ ను ఎదుర్కునే సంభావ్య యంత్రాంగాన్ని జోన్ ప్రతిపాదిస్తుంది. ఇది శరీరం బయట (ఇన్ విట్రో) రూపొందించిన పోడోసైట్లపై జోన్ ప్రభావాలను ప్రదర్శించిన మొదటి పరిశోధన.

ఈ పరిశోధనలను రోగులకు చికిత్స అందించడంలో అమలు చేయడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మధుమేహ రోగులకు ఒక ఆశాకిరణం అని చెప్పుకోవచ్చు. నిరంతర అన్వేషణతో, జింక్ ఆక్సైడ్ నానోపార్టికల్స్, డయాబెటిక్ నెఫ్రోపతికి వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన సాధనంగా మారవచ్చు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారికి జీవన నాణ్యతను, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ మూత్రపిండాల వ్యాధిని సమర్థవంతంగా నిర్వహించగల లేదా నివారించగల భవిష్యత్తు కోసం వైద్య సమాజం రోగులు ఆశాజనకంగా ఉన్నారు.

***


(Release ID: 2045753) Visitor Counter : 69