సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో భారీ తిరంగా ర్యాలీకి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వం
* 78 వ స్వాతంత్య్ర దినోత్సవాల సన్నాహ కాల్లో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
* "డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనుపమానమైన త్యాగానికి ప్రధాని మోదీ సమర్పించిన ఘన నివాళి ఆర్టికల్ 370 రద్దు" : డాక్టర్ సింగ్
ప్రజల సమస్యలను ఆకాంక్షలను వేగంగా, స్థానికంగా పరిష్కరించడానికి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రజా దర్బారు
Posted On:
13 AUG 2024 7:12PM by PIB Hyderabad
78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పౌరులలో దేశభక్తి , జాతీయ సగర్వతను పెంపొందించడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఘనంగా జరిగిన తిరంగా ద్విచక్ర వాహన ఊరేగింపుకు శాస్త్ర, సాంకేతిక శాఖ (స్వతంత్ర ప్రతిపత్తి ) మంత్రి , ప్రధాని కార్యాలయం, ఉద్యోగ ప్రజా సమస్యలు, పింఛను, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వం వహించారు.
భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ ర్యాలీని స్థానిక యువకులు నిర్వహించారు.
ర్యాలీ ముగిసిన అనంతరం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి డాక్టర్ జితేంద్ర సింగ్ పూలు చల్లారు. ఆయన చేసిన త్యాగాలు ఆశయాలు 'ఏక్ విధాన్ ఏక్ నిశాన్ ఏక్ ప్రధాన్' ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా విగ్రహం చుట్టూ పరిశుభ్రతా కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలలుకన్న సమగ్ర భారతదేశం ఆశయాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా నెరవేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశంసించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో సమైక్యం చేసింది, 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' అనే లక్ష్యాన్ని సాకారం చేసింది, అని ఆయన అన్నారు .
"ఆర్టికల్ 370 రద్దు డాక్టర్ ముఖర్జీ అత్యున్నత త్యాగానికి ప్రధాని మోదీ సమర్పించిన సరైన ఘన నివాళి", అని ఆయన పేర్కొన్నారు. "ఈ విగ్రహం యువతకు ప్రేరణాలయం. దేశం కోసం చేసిన త్యాగాలకు ఇది ఓ ప్రతీక ", అని ఆయన నొక్కి చెప్పారు.
కథువాను పవిత్ర భూమిగా వర్ణించిన ఆయన, డాక్టర్ ముఖర్జీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు, ఎందుకంటే ఆయనని ఇక్కడే అరెస్టు చేశారు. ఇక్కడ నుండి శ్రీనగర్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆయన అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. సమైక్య భారతదేశం కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన పోరాటానికి, ఆయన త్యాగానికి ప్రతిరూపంగా ఈ ఎత్తైన విగ్రహం నెలకొల్పడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఆయనకు మోడీ సమర్పించిన నిజమైన ఘన నివాళి " అని డాక్టర్ సింగ్ అన్నారు.
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, వారి డిమాండ్లను జిల్లా పరిపాలన వ్యవస్థ సమన్వయం తో పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రి దాదాపు రెండు గంటల పాటు ప్రజా దర్బారును నిర్వహించారు. ఈ ప్రజా దర్బారులో సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలను పరిష్కరించడమే తన నిరంతర ప్రయత్నం అని చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ ప్రజా దర్బారులో ప్రజల సమస్యలను, కోరికలను వేగంగా పరిష్కరించమని అధికారులను కోరారు.
ప్రజా డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని, త్వరలోనే తీసుకున్న చర్యల నివేదికలను తనకు సమర్పించాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. "ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, పాలనలో పారదర్శకతను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అయన ఈ సందర్భంగా అన్నారు.
***
(Release ID: 2045310)
Visitor Counter : 52