రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రైతులకు సజావుగా,సరసమైన ధరలకు డీఏపీ లభించేలా అవసరానికి అనుగుణంగా ఎన్బీఎస్ సబ్సిడీ రేట్లకు మించి డీఏపీపై ప్రత్యేక రాయితీని అందిస్తోన్న ప్రభుత్వం.
ఎరువుల కంపెనీలు నిర్ణయించిన ధరల సహేతుకతను మదింపు చేసే మార్గదర్శకాలు జారీ… సరసమైన ధరల వద్ద ఎరువుల లభ్యత ఉండేలా చూసుకోనున్న ఈ నిబంధనలు.
Posted On:
09 AUG 2024 1:48PM by PIB Hyderabad
ఫాస్ఫేటిక్, పొటాషియం(పీ&కే) ఎరువులకు సంబంధించి 1.4.2010 నుంచి పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్‌బీఎస్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్‌బీఎస్ పథకం కింద డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ)తో సహా పోషక పదార్ధాలను బట్టి వార్షిక లేదా ద్వైవార్షిక ప్రాతిపదికన రాయితీని నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగా రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వ పర్యవేక్షణలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎరువుల కంపెనీలు సహేతుకమైన స్థాయిలో ధరను(ఎంఆర్‌పీ) నిర్ణయిస్తాయి. రసాయన ఎరువుల రంగాన్ని(పీ&కే) ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించారు. ఎన్‌బీఎస్ పథకం ప్రకారం కంపెనీలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులను ఉత్పత్తి, దిగుమతి చేసుకోవచ్చు.
రైతులకు సరసమైన ధరలకు డీఏపీ సజావుగా అందేలా చూసేందుకు అవసరాన్ని బట్టి ఎన్‌బీఎస్ రాయితీ రేట్లకు మించి డీఏపీపై ప్రత్యేక ప్యాకేజీలను ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల, 2024-25లో భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కారణంగా డీఏపీ కొనుగోలు గిట్టుబాటును ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. 01.04.2024 నుంచి 31.12.2024 వరకు డీఏపీ వాస్తవ అమ్మకం ధర(పాయింట్ ఆఫ్ సేల్)పై ఎన్‌బీఎస్ రాయితీని మించి ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం రైతులకు సరసమైన ధరలకు డీఏపీ అందించాలన్న ఉద్దేశంతో పీ&కే ఎరువుల కంపెనీలకు మెట్రిక్ టన్నుకు రూ.3500 రాయితీ అందించారు. అంతేకాకుండా, ఈ కంపెనీలు నిర్ణయించిన ధరల సహేతుకతను మదింపు చేయడంపై మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇవి కూడా రైతులకు సరసమైన ధరల వల్ల ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తాయి.
చట్టపరంగా ప్రకచించిన గరిష్ట రిటైల్ ధర(ఎమ్మార్పీ) ప్రకారం యూరియా రైతులకు అందుతోంది. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.242(వేప పూత, వర్తించే పన్నులు మినహాయించి) కాగా 01.03.2018 నుంచి ఇప్పటి వరకు ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు. యూరియా ఉత్పత్తి ధర, రైతులకు అందే ధర మధ్య వ్యత్యాసాన్ని ఉత్పత్తదారులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. మొత్తంగా రైతులందరికీ యూరియా రాయితీపై అందుతోంది.
ప్రధాన పంటల కింద ఉన్న వివిధ రకాల నేలల్లో దీర్ఘకాలిక రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రభావాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంచనా వేసింది. గత కొన్ని దశాబ్దాలుగా జరిగిన పరిశోధనలో.. సారవంతమైన మట్టి , పంట ఉద్పాదకతపై ఎన్‌పీకే(రసాయన ఎరువులు మాత్రమే)వాడకం.. సూక్ష్మ, ద్వితీయ పోషకాల లోపం వంటి కారణాలు ప్రభావం చూపిస్తున్నాయని తేలింది. కార్బనేతర ఎరువులు, సేంద్రీయ ఎరువులు.. రెండు కలిపి పంట దిగుబడి,భూసారాన్ని పెంచుతాయి. అసమతుల్య ఎరువుల వాడకం , కేవలం యూరియాతోనే భూముల్లో పంట దిగుబడి మిగతా అన్ని నేలల్లో కంటే ఎక్కువగా పడిపోయింది. అందువల్ల భూసార పరీక్షల ఆధారంగా రసాయన, సేంద్రీయ ఎరువులను ఉపయోగించి సమతుల్య, సమీకృత పోషక నిర్వహణ పద్ధతులను సిఫార్సు చేసింది.
సుస్థిరమైన, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ ఎరువుల ఉపయోగం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వనరుల సంరక్షణ సాంకేతికతలను అనుసరించటం ద్వారా భూసారాన్ని కాపాడటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రారంభించిన ప్రజా ఉద్యమాలకు సహాయపడేందుకు 2023 జూన్ నుంచి "ప్రధాన మంత్రి- భూసారం దెబ్బ తినకుండా చూసుకోవడం, అవగాహన కల్పన, పోషణ, మెరుగపరచటం(పీఎం-ప్రాణం)” అమలు చేస్తోంది. రసాయన ఎరువులకు(యూరియా, డీఏపీ, ఎన్‌పీకే, ఎంఓపీ) సంబంధించి మునుపటి 3 ఏళ్ల సగటు వినియోగంతో పోల్చితే ఒక నిర్ధిష్ట ఆర్థిక సంవత్సరంలో ఆదా చేసిన ఎరువుల సబ్సిడీని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడానికి మెట్రిక్ టన్నుకు రూ. 1500 మార్కెట్ అభివృద్ధి పోత్సాహకం(మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్-ఎండీఏ)ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గోబర్‌ధన్ పథకంలో భాగంగా వివిధ బయోగ్యాస్, సీబీజీ ప్రోత్సహాక పథకాలు.. సహజవాయు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ) సాటాట్ పథకం(సస్టెయినబుల్ ఆల్టర్నేటీవ్ టు అఫర్డేబుల్ ట్రాన్స్‌పోర్టేషన్).. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ‘చెత్త నుంచి ఇంధనం(వేస్ట్ టు ఎనర్జీ)’ పథకం.. తాగునీరు, పారిశుద్ధ్య శాఖ (డీడీడబ్ల్యూఎస్) స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)తో సహా వివిధ మంత్రిత్వ శాఖల పథకాల కింద ఉత్పత్తి చేసే ఎరువులను ఇందులో చేర్చారు. పరిశోధన కోసం రూ .360 కోట్ల కార్పస్ నిధితో సహా మొత్తం రూ .1451.84 కోట్లు (2023-24 నుండి 2025-26 వరకు) వ్యయంతో దీన్ని తీసుకొచ్చారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 2044191)
Visitor Counter : 87