పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
నికర-సున్నా ఉద్గారాలను సాధించడానికి వ్యూహాలు
Posted On:
08 AUG 2024 1:18PM by PIB Hyderabad
వాతావరణ మార్పు అనేది ఒక ప్రపంచ సమష్టి కార్యాచరణ అవసరమయ్యే సమస్య, దీనికి ప్రధానంగా ప్రస్తుత గ్రీన్ హౌస్ వాయువు (జిహెచ్ జి) ఉద్గారాలు మాత్రమే కాకుండా, ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలు అందించే చారిత్రక సంచిత జిహెచ్ జి ఉద్గారాలు కూడా కారణం. భారతదేశ తలసరి జిహెచ్ జి ఉద్గారాలు తక్కువగా ఉన్నప్పటికీ, జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని , ఇంకా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యుఎన్ఎఫ్ సిసిసి) లో పొందుపరిచిన విధంగా సమానత్వం, ఉమ్మడి కాని భిన్నమైన బాధ్యతలు, సంబంధిత సామర్థ్యాల (సిబిడిఆర్-ఆర్ సి) సూత్రం ఆధారంగా బహుళపక్షవాదానికి దృఢంగా కట్టుబడి ఈ సవాల్ ను పరిష్కరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ జి హెచ్ జి ఉద్గారాలను తగ్గించడంలో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్య పెంపు మద్దతును అందించడం ద్వారా నాయకత్వం వహించాలి.
2021 నవంబర్ లో జరిగిన యుఎన్ఎఫ్ సి సి భాగస్వాముల 26వ సదస్సులో భారత్ 2070 నాటికి నికర సున్నా సాధించాలన్న తన లక్ష్యాన్ని ప్రకటించింది. దీనికి అనుగుణంగా, భారతదేశం తన దీర్ఘకాలిక తక్కువ గ్రీన్ హౌస్ వాయు ఉద్గార అభివృద్ధి వ్యూహాలను (ఎల్ టి -ఎల్ఇడిఎస్) 2022 నవంబర్ లో యుఎన్ఎఫ్ సిసిసి కి సమర్పించింది, ఇది 2070 నాటికి నికర సున్నాకు చేరుకోవాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది. భారతదేశ విధానం దాని దీర్ఘకాలిక తక్కువ-కార్బన్ అభివృద్ధి వ్యూహానికి మద్దతు ఇచ్చే ఈ కింది నాలుగు ప్రధాన పరిగణనలపై ఆధారపడి ఉంది:
ప్రపంచ వాతావరణ మార్పులకు తక్కువగా భాగస్వామ్యం: 1850 నుండి 2019 వరకు భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 17% ఉన్నప్పటికీ, భారతదేశ చారిత్రక మొత్తం ప్రపంచ జి హెచ్ జి ఉద్గారాల్లో 4% మాత్రమే ఉంది.
భారతదేశం తన అభివృద్ధికి గణనీయమైన ఇంధన అవసరాలను కలిగి ఉంది: 2019 లో భారతదేశం తలసరి వార్షిక ప్రాథమిక ఇంధన వినియోగం 28.7 గిగాజౌల్స్ (జిజె), ఇది అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే చాలా తక్కువ.
అభివృద్ధి కోసం తక్కువ కార్బన్ వ్యూహాలను అనుసరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది. జాతీయ పరిస్థితులకు అనుగుణంగా వాటిని చురుకుగా అనుసరిస్తోంది: గృహ అవసరాలకు ఇంధనం, ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల అభివృద్ధి కోసం తగినంత ఇంధన లభ్యతను నిర్ధారిస్తూనే,తక్కువ కార్బన్ అభివృద్ధి మార్గాలకు మారేందుకు అవకాశాలను గుర్తించడానికి అన్వేషించడానికి భారత దేశం ప్రయత్నిస్తోంది.
భారతదేశం వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించుకోవాలి: పర్వతాల నుండి ఎడారుల వరకు, లోతట్టు నుండి తీర ప్రాంతాల వరకు , మైదానాల నుండి అడవుల వరకు వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను మన దేశం కలిగి ఉంది వాతావరణ మార్పుల ప్రభావాలకు లోనవు తోంది. భారతదేశం తన అభివృద్ధి లాభాలను, మానవ అభివృద్ధి ఫలితాలను నిలబెట్టుకోవడానికి, తన పెరుగుదల, అభివృద్ధిని కొనసాగించడానికి అనుసరణ చర్యలు, ఎదురయ్యే అవకాశం ఉన్న వాతావరణ ప్రభావాలకు స్థితిస్థాపకతను పెంపొందించు కోవడం అవసరం.
భారతదేశ ఎల్ టి- ఎల్ ఇ డి ఎస్ ఏడు కీలక వ్యూహాత్మక పరివర్తనలను కలిగి ఉంటుంది, అవి: (i) అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్ వ్యవస్థల నుంచి తక్కువ కార్బన్ అభివృద్ధి; (ii) సమీకృత, సమర్థవంతమైన, సమ్మిళిత తక్కువ-కార్బన్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం; (iii) పట్టణ రూపకల్పనలో అనుసరణను ప్రోత్సహించడం, భవనాల్లో ఇంధన, సామగ్రి సమర్థత, స్థిరమైన పట్టణీకరణను ప్రోత్సహించడం; (iv) ఆర్థిక వ్యవస్థ వ్యాప్తంగా ఉద్గారాల నుండి వృద్ధిని వేరు చేయడాన్ని, సమర్థవంతమైన, వినూత్నమైన తక్కువ ఉద్గారాల పరిశ్రమల వ్యవస్థ ను అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహించడం; కార్బన్ డయాక్సైడ్ (సి ఒ2) తొలగింపు , సంబంధిత ఇంజనీరింగ్ పరిష్కారాలు; (vi) సామాజిక-ఆర్థిక , పర్యావరణ పరిగణనలకు అనుగుణంగా అటవీ , వృక్షసంపదను పెంచడం; (vii) తక్కువ కార్బన్ అభివృద్ధి , 2070 నాటికి నికర సున్న దిశగా దీర్ఘకాల పరివర్తన సంబంధిత ఆర్థిక అంశాలు.
కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సిసియుఎస్) కు సంబంధించి ఆర్థిక, సాంకేతిక, రాజకీయ సాధ్యాసాధ్యాలు చాలా అనిశ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం, సిసియుఎస్ అమలు కోసం ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పాదక యూనిట్లను పునరుద్ధరించడం (రీట్రోఫిట్) సరసమైన ధరలో, తక్కువ శక్తిని వినియోగించే సాంకేతికత అందుబాటులో వచ్చేంత వరకు వ్యావహారికమైన ఎంపిక కాదు. సిసియుఎస్ ను ఏదైనా కీలక స్థాయిలో అమలు చేయడానికి సమర్థవంతమైన అంతర్జాతీయ సహకారంతో తగినంత వాతావరణ ఆర్థిక సహాయం, సాంకేతికత బదిలీ అవసరం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి మారడం అనేది ఎల్ టి-. ఎల్ ఇ డి ఎస్ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న మార్పులతో పాటు, దాని అంతరాయ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిరంతర శక్తి నిల్వ వ్యవస్థ కూడా అవసరం. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ (పిఎస్.పి), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బిఇఎస్ఎస్) దేశంలో అందుబాటులో ఉన్న ప్రధాన రకాల నిల్వ సాంకేతికతలు
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపిసిసి) ఆరో అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం, ఒక దేశం/ రంగంలో అమలు చేసిన ఉపశమన చర్యలు ఇతర దేశాలు/ రంగాల్లో ఉద్గారాల పెరుగుదలకు దారితీసినప్పుడు 'కార్బన్ లీకేజీ' సంభవిస్తుంది. గ్లోబల్ కమోడిటీ వ్యాల్యూ చైన్లు , సంబంధిత అంతర్జాతీయ రవాణా కార్బన్ లీకేజీ సంభవించే ముఖ్యమైన యంత్రాంగాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి, అభివృద్ధి చెందిన దేశాలు తమ వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, వాతావరణ అనుకూల జీవనశైలిని అవలంబించాల్సిన అవసరం ఉంది. 2022 లో భారతదేశం ప్రారంభించిన 'మిషన్ ఎల్ఐఎఫ్ఇ' వ్యక్తులు , సమాజాల ప్రయత్నాలను సానుకూల ప్రవర్తనా మార్పుల ప్రపంచ ప్రజా ఉద్యమంగా మళ్లించడానికి ప్రయత్నిస్తుంది, ఇది డిమాండ్ లో మార్పుకు దారితీస్తుంది. తత్ఫలితంగా విధానాలలో కూడా మార్పును తీసుకువస్తుంది.దీని ద్వారా, ఆలోచనా రహిత మైన, నాశనకరమైన వినియోగం నుండి విచక్షణతో , ఉద్దేశపూర్వకమైన వనరుల వినియోగం వైపు ఆలోచనా మార్పును సాధించడానికి ప్రయత్నం చేస్తుంది.
ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగం, అన్నింటికీ మించి ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమానికి ఇది పిలుపునిచ్చింది. భారతదేశం జాతీయంగా నిర్ణయించిన కృషి(ఎన్ డిసి ) ని సవరించి , “సంరక్షణ , సామాన్య విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన , సుస్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ‘ లైఫ్ ‘ – ‘లైఫ్ష్ స్టయిల్ ఫర్ ఎన్‌విరాన్మెంట్’ అనే పెద్ద పర్యావరణ ఉద్యమం ద్వారా వాతావరణ మార్పు కు వ్యతిరేకంగా పోరాడే కీలకమైన లక్ష్యాన్ని’ చేర్చింది.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
***
(Release ID: 2043639)
Visitor Counter : 170