భారత పోటీ ప్రోత్సాహక సంఘం
హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ ద్వారా ‘పిఎన్‌సి’ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, ‘పిఎన్‌సి’ ఇన్‌ఫ్రా హోల్డింగ్స్‌కు చెందిన 12 ప్రత్యేక ప్రయోజన సంస్థల్లో 100 శాతం ఈక్విటీ.. నిర్వహణ.. నియంత్రణ.. కొనుగోలుకు ‘సిసిఐ’ ఆమోదం
Posted On:
07 AUG 2024 6:48PM by PIB Hyderabad
‘పిఎన్‌సి ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, ‘పిఎన్‌సి’ ఇన్‌ఫ్రా హోల్డింగ్స్‌కు (‘పిఎన్‌సి’ ‘ఎస్‌పివి’లు/టార్గెట్స్) చెందిన పన్నెండు (12) ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పివి)లలో 100 శాతం ఈక్విటీ సహా నిర్వహణ-నియంత్రణ హక్కును హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (అక్వైరర్ ట్రస్ట్) కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
అక్వైరర్ ట్రస్ట్ అనేది భారత ట్రస్టుల చట్టం-1882 కింద ఏర్పాటైన శాశ్వత ట్రస్టు. ఇది సెబీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) నిబంధనలు-2014 ప్రకారం నిర్దిష్ట కార్యకలాపాల నిర్వహణ కోసం ‘సెక్యూరిటీస్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుగా నమోదైంది. ఈ ట్రస్టుకు భారతదేశంలో ‘ప్రత్యేక ప్రయోజన సంస్థలు’ (ఎస్‌పివి) ఉన్నాయి. దేశంలో రహదారులు, జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను నిర్వర్తిస్తుండగా, ఈ సంస్థలకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తోంది. ఈ అక్కైవర్ ట్రస్టుకు సెబీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్) నిబంధనలు-2014 ప్రకారం- గెలాక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్-II పిటిఇ. లిమిటెడ్ స్పాన్సరర్‌గా, హైవే కన్సెషన్స్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌సి వన్) పెట్టుబడి మేనేజర్‌గా ఉన్నాయి.
‘పిఎన్‌సి’ ‘ఎస్‌పివి’లు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూపకల్పన, అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. అలాగే వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్/నిర్మాణం-నిర్వహణ-బదిలీ పద్ధతిలో పనులు చేపడతాయి. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ/ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ రహదారుల సంస్థతో ‘పిఎన్‌సి’ ‘ఎస్‌పివి’లు రాయితీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఈ లావాదేవీలపై ‘సిసిఐ’ సమగ్ర ఉత్తర్వులు త్వరలో వెలువడతాయి.
***
(Release ID: 2043408)
Visitor Counter : 40