హోం మంత్రిత్వ శాఖ
సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాలలు
Posted On:
07 AUG 2024 4:49PM by PIB Hyderabad
అందుబాటులో వున్న సమాచారం ప్రకారం, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నివారణ చట్టం కింద రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోమ్ శాఖ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సాయంతో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయి. ఇంతవరూ 33 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్, శిక్షణా ప్రయోగశాలలు పని చేస్తున్నాయి.
డిజిటల్ మోసాలు / సైబర్ ఫోరెన్సిక్స్ కు సంబంధించిన ముఖ్యమైన కేసులను పరిశోధించడానికి హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎన్ సీ ఎఫ్ ఎల్)ని ఏర్పాటుచేసింది. ఈ ప్రయోగశాల దేశంలోని ఇతర కేంద్ర, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు ఒక నమూనా ప్రయోగశాలగా పని చేస్తుంది. ఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా, గౌహతి, భోపాల్ పూణేలలో ఉన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలలో 6 ఎన్ సీ ఎఫ్ ఎల్ ల ఏర్పాటు కోసం “మహిళల భద్రత” అనే ప్రధాన పథకం (అంబ్రెల్లా స్కీమ్) కింద రూ.126.84 కోట్ల నిధులకు ఆమోదం తెలిపారు.
ఫోరెన్సిక్ సామర్థ్యాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ఆమోదించింది, దీని కింద, మిగతా వాటితోపాటు, సైబర్ ఫోరెన్సిక్స్‌తో సహా ఆధునిక యంత్రాలు , పరికరాలతోకూడిన అధిక నాణ్యత గల ఫోరెన్సిక్ సైన్స్ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి గాను ఆయా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం అందిస్తారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించిన సాక్ష్యాల కేసులలో అవసరమైన ఫోరెన్సిక్ మద్దతును హైదరాబాద్ లోని ఎన్ సి ఎఫ్ ఎల్ అందిస్తుంది. కొత్త సౌకర్యాలు/విభాగాన్ని ఏర్పాటు చేయడమనేదాన్ని నిరంతరం కొనసాగే ప్రక్రియగా చూడాలి. అంతే కాదు వీటిని ఆయా రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిమాండ్ , సాధ్యతను బట్టి ఏర్పాటు చేస్తారు. "నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్" అనే పథకానికి 19.06.2024న ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఇతర అంశాలతోపాటు దేశంలో 7 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీల స్థాపనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.
రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది.
****
(Release ID: 2043190)
Visitor Counter : 78