బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

Posted On: 07 AUG 2024 4:17PM by PIB Hyderabad

బొగ్గు దేశీయ ఉత్పత్తిని పెంచడం పై కేంద్రం దృష్టి సారిస్తోంది. 2023-24 లో దేశంలో దేశీయ బొగ్గు ఉత్పత్తి 997.26 మిలియన్ టన్నులకు (ఏంటీ) పెరిగింది, తద్వారా గత ఆర్థిక సంవత్సరం (2022-23) కంటే 11.65 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 2024 వరకు, బొగ్గు ఉత్పత్తి 321.41 ఎంటీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 9.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ప్రస్తుత దిగుమతి విధానం ప్రకారం, బొగ్గు ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఓజిఎస్) కింద ఉంది. తమ ఒప్పందం ప్రకారం వినియోగదారులు, సంబంధిత సుంకాన్ని చెల్లించి  బొగ్గును దిగుమతి చేసుకోవచ్చు. దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించింది.

(i) వార్షిక కాంట్రాక్ట్ పరిమాణం (ఏసిక్యూ) సాధారణ అవసరాలకు అనుగుణంగా 100 శాతం వరకు పెంచడం జరిగింది. ఏసిక్యూ 90 శాతం నిర్దేశక అవసరాలకు (నాన్ కోస్టల్) లేదా  ఏసిక్యూని 70 శాతం సాధారణ అవసరాలకు (తీర విద్యుత్ ప్లాంట్లు) తగ్గించిన సందర్భాల్లో ఈ పెంపు జరిగింది. ఏసీక్యూ లో పెరుగుదల మరింత దేశీయ బొగ్గు సరఫరాలకు దారి తీస్తుంది, తద్వారా దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుంది.

(ii) 'శక్తి' పాలసీలోని పేరా బి (viii) (ఎ) నిబంధనల ప్రకారం, ఉత్పత్తి చేసే విద్యుత్ కొనుగోలుకు స్వల్పకాలం పాటు బొగ్గు లింకేజీ అందించడం జరుగుతుంది. ఇది పవర్ ఎక్స్ఛేంజ్‌లలో ఏదైనా ఉత్పత్తి ద్వారా లేదా డీప్ పోర్టల్ ద్వారా పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ అనుసరించి ఆ లింకేజీ అందించడం జరుగుతుంది. అదనంగా, 2020లో ప్రవేశపెట్టిన నాన్-రెగ్యులేటెడ్ సెక్టార్ (ఎన్ఆర్ఎస్) లింకేజ్ వేలం విధానానికి సవరణతో,  ఎన్ఆర్ఎస్  లింకేజ్ వేలంలో కోకింగ్ బొగ్గు (ముఖ్యంగా స్టీల్ తయారీలో వాడే బొగ్గు) లింకేజీల పదవీకాలం 30 సంవత్సరాల వరకు సవరించారు. శక్తి పాలసీ సవరించిన నిబంధనల ప్రకారం పవర్ ప్లాంట్‌లకు స్వల్పకాలికంగా అందించిన బొగ్గు అలాగే 30 సంవత్సరాల వరకు ఎన్ఆర్ఎస్ లింకేజీ వేలంలో కోకింగ్ బొగ్గు లింకేజీల పదవీకాలాన్ని పెంచడం బొగ్గు దిగుమతుల ప్రత్యామ్నాయంపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

(iii) విద్యుత్ రంగంలోని ప్రస్తుత లింకేజీ హోల్డర్లందరికీ పూర్తి పీపీఏ అవసరాన్ని తీర్చడానికి బొగ్గును బొగ్గు కంపెనీలు అందుబాటులో ఉంచాలని 2022లో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

'వాషరీ డెవలపర్, ఆపరేటర్ (డబ్ల్యూడిఓ) మార్గం ద్వారా కోకింగ్ బొగ్గును ఉపయోగించి ఉక్కు' నామకరణంతో ఎన్ఆర్ఎస్ అనుసంధాన వేలం కింద కొత్త ఉప-విభాగాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్ట్ వ్యవధి మొత్తం కాలానికి గుర్తించిన గనుల నుండి ఉక్కు రంగానికి దీర్ఘకాలిక బొగ్గు అనుసంధానం కోసం హామీతో కొత్త ఉప-విభాగాన్ని సృష్టించడం వల్ల దేశంలో కడిగిన కోకింగ్ బొగ్గు లభ్యత పెరుగుతుంది. దేశీయ కోకింగ్ బొగ్గు వినియోగం పెరుగుతుంది. దేశంలో ఉక్కు పరిశ్రమ, తద్వారా కోకింగ్ బొగ్గు దిగుమతులు తగ్గుతాయి.
(v) బొగ్గు దిగుమతి ప్రత్యామ్నాయం కోసం 2020 మే 29న బొగ్గు మంత్రిత్వ శాఖలో అంతర్ మంత్రిత్వ కమిటీ (ఐఎంసి) ఏర్పాటు చేశారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ), పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటీ) నుండి ప్రతినిధులు , సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఈఏ), బొగ్గు కంపెనీలు, పోర్ట్‌లు ఈ ఐఎంసిలో సభ్యులు. ఐఎంసి  పదకొండు సమావేశాలు ఇప్పటివరకు జరిగాయి. ఐఎంసి ఆదేశాల మేరకు, బొగ్గు దిగుమతులను ట్రాక్ చేయడానికి మంత్రిత్వ శాఖను అనుమతించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక దిగుమతి డేటా సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. మరింత దేశీయంగా బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా బొగ్గు ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

***

 


(Release ID: 2043113) Visitor Counter : 72