హోం మంత్రిత్వ శాఖ

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి డిజిటల్ చర్యలు

Posted On: 07 AUG 2024 4:53PM by PIB Hyderabad

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (డ్రగ్ లా)  అమలులో ప్రభుత్వం అనేక  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత చొరవలకు శ్రీకారం చుట్టింది. వాటిలో కొన్ని ఈ కింది  విధంగా ఉన్నాయి:-

(i)   నార్కో కోఆర్డినేషన్ (ఎన్ సి ఒ ఆర్ డి ) పోర్టల్ https://narcoordindia.in/ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి , మాదక ద్రవ్యాల నిరోధక చట్టం అమలు చేసే అన్ని సంస్థల (డిఎల్ఇఎ) తో సహా కేంద్ర మంత్రిత్వ శాఖల వరకు నాలుగు అంచెల వాటాదారులకు అన్ని డ్రగ్స్ , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) సంబంధిత సమాచారానికి  గేట్ వే గా ఉంది.

 (ii) దర్యాప్తు , క్రియాశీల పోలీసింగ్ కోసం అన్ని డిఎల్ఇఎలు / ఇతర దర్యాప్తు సంస్థలకు సహాయపడటానికి నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో-అఫెండర్స్ (నిడాన్) పోర్టల్ ను అభివృద్ధి చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన నార్కోటిక్ నేరస్థుల డేటాను ఇది అందిస్తుంది.

 (iii)  క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) దర్యాప్తు, డేటా అనలిటిక్స్, పరిశోధన, విధాన రూపకల్పన, ఫిర్యాదుల రిపోర్టింగ్ ,ట్రాకింగ్, ముందస్తు ధృవీకరణల అభ్యర్థన వంటి పౌర సేవలను అందించడం కోసం అన్ని పోలీస్ స్టేషన్లను ఒకే ఉమ్మడి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద ఇంటర్-లింక్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 (iv) నార్కో-ట్రాఫికింగ్ కు దోహదపడే అన్ని ప్లాట్ఫామ్ లను పర్యవేక్షించడం, ఏజెన్సీలు / ఎంఎసి సభ్యుల మధ్య మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని  పంచుకోవడం, మాదకద్రవ్యాల నెట్ వర్క్ ను అడ్డుకోవడం, ధోరణులను నిరంతరం అందిపుచ్చు కోవడం , క్రమం తప్పకుండా డేటాబేస్ నవీకరణలతో పద్ధతులు , నోడ్లను నిరంతరం పట్టుకోవడం , సంబంధిత నిబంధనలు, చట్టాలను సమీక్షించడంపై దృష్టితో మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఎసి) యంత్రాంగం కింద డార్క్  నెట్ ,  క్రిప్టో-కరెన్సీపై  టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు.

 (v) మాదకద్రవ్యాలకు సంబంధించిన సమస్యలను బహుళ కమ్యూనికేషన్ల ద్వారా నివేదించడానికి పౌరుల కోసం ఏకీకృత వేదికగా 1933- మానస్ హెల్ప్ లైన్ ను ప్రభుత్వం ప్రారంభించింది.

నిడాన్ పోర్టల్ ను ప్రత్యేకంగా డ్రగ్ చట్టం అమలు సంస్థల ఉపయోగం కోసం ఉద్దేశించారు. డ్రగ్ చట్టం అమలు ఏజెన్సీలకు ఈ పోర్టల్ సమర్థవంతమైన సాధనంగా అవతరించింది. డాట్స్, మునుపటి ప్రమేయాలు, వేలిముద్రల శోధన, ఇంటర్ లింకేజీలు పనిచేయడం, నెట్వర్క్l ను ఛేదించడం, అలవాటైన నేరస్థులను పర్యవేక్షించడం, ఆర్థిక దర్యాప్తు , నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (పిఐటి ఎన్ డి పిఎస్) లో అక్రమ ట్రాఫిక్ నిరోధం కింద నిర్బంధానికి ప్రతిపాదనలు చేయడంలో ఇది వారికి సహాయపడింది. ఇది ప్రస్తుత కేసులు, బెయిల్, పెరోల్, హ్యాండ్లర్లు మొదలైన వాటి స్థితిని పర్యవేక్షించడానికి కూడా సహాయపడుతుంది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


 

***

 



(Release ID: 2043108) Visitor Counter : 44