బొగ్గు మంత్రిత్వ శాఖ

గృహ వినియోగానికి ఉన్నత శ్రేణి బొగ్గుకు డిమాండ్

Posted On: 07 AUG 2024 4:16PM by PIB Hyderabad

అన్ని శ్రేణుల బొగ్గు అవసరాలను అంచనా వేయడానికి అంతర్ మంత్రిత్వ శాఖల  కమిటీ (దిగుమతుల ప్రత్యామ్నాయం కోసం ఏర్పాటు చేశారు) వివిధ సమావేశాలు నిర్వహించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న దృష్ట్యా సిమెంట్, అల్యూమినియం, స్పాంజ్ ఐరన్ వంటి బొగ్గు వినియోగ పరిశ్రమల్లో ఉన్నత శ్రేణి బొగ్గుకు గణనీయమైన డిమాండ్ ఉంది.

జాతీయ ఉక్కు విధానం, 2017 వివరాల ప్రకారం, దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి 2017 ఆర్థిక సంవత్సరంలో 101 మిలియన్ టన్నుల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 300 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 2024 ఆర్థిక సంవత్సరంలో 148 మెట్రిక్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి అవుతోంది. ఉక్కు ఉత్పత్తి పెరుగుదల భారతదేశంలో ఖనిజ కోకింగ్ బొగ్గు అవసరాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

2024-25 నాటికి దేశవ్యాప్తంగా 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, అదేవిధంగా 2026-27 నాటికి కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తిని 1 బిలియన్ టన్నులకు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఫలితంగా బొగ్గు లభ్యత పెరగడం వల్ల ఈ శ్రేణి బొగ్గు అవసరాన్ని అందుబాటులో ఉన్న మేరకు తీర్చగలుగుతుంది.

కోకింగ్ బొగ్గును దిగుమతి చేసుకోకుండా ప్రత్యామ్నాయంగా, ఉక్కు రంగం ద్వారా కోకింగ్ బొగ్గు ప్రస్తుత డొమెస్టిక్ బ్లెండింగ్‌ను ప్రస్తుతమున్న 10-12 శాతం నుండి 30-35 శాతానికి పెంచాలి. తదనుగుణంగా, జాతీయ ఉక్కు విధానం 2017 లో అంచనా వేసిన దేశీయ కోకింగ్ బొగ్గు అవసరాలను తీర్చడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ 2022 ఆర్థిక సంవత్సరంలో మిషన్ కోకింగ్ కోల్ ను ప్రారంభించింది. 2030 నాటికి దేశీయ ముడి కోకింగ్ బొగ్గు ఉత్పత్తిని 140 మెట్రిక్ టన్నులకు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకుంది.

కోకింగ్ బొగ్గు సరఫరా: 2024 ఆర్థిక సంవత్సరంలో శుభ్రపరిచిన దేశీయ కోకింగ్ బొగ్గు సరఫరా 5.4 మిలియన్ టన్నులు (ఏడాదికి), ఇందులో కోల్ ఇండియా లిమిటెడ్ నుండి 2.22 ఎంటిపిఎ గా ఉంది. బొగ్గు శుభ్రం చేసే వాషెరీల ఏర్పాటుతో 2030 నాటికి ఉక్కు రంగానికి 23 ఎంటీపీఏ కోకింగ్ బొగ్గును సరఫరా చేయగలుగుతుంది.

ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్ సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


 

*****



(Release ID: 2043102) Visitor Counter : 33