వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2024-౨౫ జులై చివరికి 2.60 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి
ధరల స్థిరీకరణ కోసం 4.68 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసిన కేంద్రం
Posted On:
07 AUG 2024 6:09PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం 4 మే 2024 నుండి ఉల్లిపై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. కనీస ఎగుమతి ధర మిలియన్ టన్నులకు 550 డాలర్లు, 40 శాతం సుంకంతో ఎగుమతికి అనుమతించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 31 జూలై 2024 నాటికి మొత్తం 2.60 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి చేయడం జరిగింది. ధరల స్థిరీకరణ బఫర్ కోసం మహారాష్ట్ర నుంచి ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా 4.68 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. గతేడాది (2023)తో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఉల్లి రైతులు అధిక లాభాలు పొందారు. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య మహారాష్ట్రలో ఉల్లి సగటు నెలవారీ మండీ మోడల్ ధరలు క్వింటాలుకు రూ.1,230 నుంచి రూ.2,578 మధ్య ఉండగా, గత ఏడాది (2023) ఇదే కాలానికి క్వింటాలుకు రూ.693 నుంచి రూ.1,205 వరకు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో బఫర్ కోసం ఉల్లి సగటు కొనుగోలు ధర క్వింటాలుకు రూ .2,833, ఇది గత సంవత్సరం క్వింటాలుకు రూ .1,724 కొనుగోలు ధరతో పోలిస్తే 64% ఎక్కువ.
మన దేశం ఉల్లి నికర ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. గత మూడేళ్లలో భారత్ ఆర్జించిన నికర ఎగుమతుల విలువ 2021-22లో రూ.3,326.99 కోట్లు, 2022-23లో రూ.4,525.91 కోట్లు, 2023-24లో రూ.3,513.22 కోట్లుగా ఉంది.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గత మూడేళ్లలో రాష్ట్రాలవారీగా ఉల్లి ఉత్పత్తి, వార్షిక గృహ వినియోగంపై గణాంకాలు, 2022-23 నివేదిక నుంచి లెక్కించిన ఉల్లి వార్షిక గృహ వినియోగానికి సంబంధించిన గణాంకాలు అనుబంధం-1లో ఉన్నాయి.
గత మూడేళ్లలో దేశాల వారీగా ఉల్లి ఎగుమతులు, దిగుమతుల వివరాలు అనుబంధం-2లో ఉన్నాయి.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2042765
****
(Release ID: 2043092)
Visitor Counter : 69