నౌకారవాణా మంత్రిత్వ శాఖ
జల మార్గాల అభివృద్ధిలోకి దేశీయ, విదేశీ పెట్టుబడులు
Posted On:
06 AUG 2024 1:42PM by PIB Hyderabad
దేశంలో అంతర్గత జల రవాణాను (ఐడబ్ల్యుటి) ప్రోత్సహించేందుకు 24 రాష్ర్టాలకు చెందిన 111 జలమార్గాలను (ప్రస్తుతం ఉన్నవి 5; కొత్తవి 106) జాతీయ జల మార్గాల చట్టం, 2016 కింద జాతీయ జల మార్గాలుగా ప్రకటించారు. ఈ 111 జలమార్గాల్లోను (ఎన్ డబ్ల్యు) 25 ఎన్ డబ్ల్యులు అంతర్ రాష్ర్ట జలమార్గాలు. ఆ వివరాలు ఈ దిగువ అనుబంధం-1లో ఉన్నాయి.
గుజరాత్ లోని ఎన్ డబ్ల్యు-73 (నర్మదా నదిపై), ఎన్ డబ్ల్యు-100 (తపతి నదిపై) రెండింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో (పిపిపి) అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకురావడంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి గల వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ (ఆసక్తి వ్యక్తీకరణ లేదా ఇఓఐ) భారత అంతర్గత జలమార్గాల సంస్థ (ఐడబ్ల్యుఏఐ) 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీ చేసింది. నదీ మార్గాల్లో నౌకాశ్రయాల ఏర్పాటుకు ఇది దోహదపడుతుంది. అయితే ఇంతవరకు ఏ సంస్థ నుంచి ఎలాంటి నిర్దిష్ట పెట్టుబడి ప్రతిపాదన రాలేదు.
అనుబంధం. 1
అంతర్ రాష్ర్ట జాతీయ జలమార్గాల జాబితా
(2016 ఏప్రిల్ 12వ తేదీన చేసిన జాతీయ జలమార్గాల చట్టం, 2016 కింద భారత ప్రభుత్వం 111 జలమార్గాలనను జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది).
క్రమ సంఖ్య
|
జాతీయ జలమార్గం సంఖ్య
|
నిడివి (కిలోమీటర్లు)
|
జలమార్గం వివరాలు
|
1
|
జాతీయ జల మార్గం 1
|
1620
|
గంగ-భాగీరథి-హుగ్లీ నదీ వ్యవస్ (హాల్దియా-అలహాబాద్)
|
2
|
జాతీయ జలమార్గం 4
|
50
|
కాకినాడ కాలువ (కాకినాడ నుంచి రాజమండ్రి)
|
|
|
171
|
గోదావరి నది (భద్రాచలం నుంచి రాజమండ్రి)
|
|
|
139
|
ఏలూరు కాల్వ (రాజమండ్రి నుంచి విజయవాడ)
|
|
|
157
|
కృష్ణా నది (వజీరాబాద్ నుంచి విజయవాడ)
|
|
|
113
|
కొమ్మమూరు కాలువ (విజయవాడ నుంచి పెద్ద గంజాం)
|
|
|
316
|
ఉత్తర బకింగ్ హామ కాల్వ (పెద్ద గంజా నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్)
|
|
|
110
|
దక్షిణ బకింగ్ హామ్ కాల్వ (చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి మరకనం)
|
|
|
22
|
మరకనం నుంచి కలువెల్లి చెరువు మీదుగా పుదుచ్చేరి)
|
|
|
1202
|
గోదావరి నది (భద్రాచలం నుంచి నాసిక్)
|
|
|
636
|
కృష్ణా నది (వజీరాబాద్-గలగలి)
|
3
|
జాతీయ జలమార్గం 5
|
256
|
ఈస్ట్ కోస్ట్ కెనాల్, మతాయ్ నది
|
|
|
265
|
బ్రహ్మణి-ఖర్సువా-ధర్మ నదులు
|
|
|
67
|
మహానది డెల్టా నదులు (హన్సువా నది, నుననల, గోబ్రినల, ఖర్నాసి నది; మహానది)
|
4
|
జాతీయ జలమార్గం 13
|
11
|
ఎవిఎం కెనాల్
|
5
|
జాతీయ జలమార్గం 17
|
189
|
బియాస్ నది
|
6
|
జాతీయ జలమార్గం 21
|
139
|
భీమా నది
|
7
|
జాతీయ జలమార్గం 37
|
296
|
గండక్ నది
|
8
|
జాతీయ జలమార్గం 38
|
62
|
గంగాధర్ నది
|
9
|
జాతీయ జలమార్గం 40
|
354
|
ఘాఘ్రా నది
|
10
|
జాతీయ జలమార్గం 45
|
650
|
ఇందిరా గాంధీ కెనాల్
|
11
|
జాతీయ జలమార్గం 48
|
590
|
జవాయ్-లుని-కచ్ సింధు శాఖ నదీ వ్యవస్థ
|
12
|
జాతీయ జలమార్గం 50
|
43
|
జింజిరం నది
|
13
|
జాతీయ జలమార్గం 54
|
86
|
కరమ్నాసా నది
|
14
|
జాతీయ జలమార్గం 62
|
86
|
లోహిత్ నది
|
15
|
జాతీయ జలమార్గం 70
|
245
|
మంజారా నది
|
16
|
జాతీయ జలమార్గం 73
|
226
|
నర్మదా నది
|
17
|
జాతీయ జలమార్గం 78
|
262
|
పెన్ గంగ-వార్ధా నదీ వ్యవస్థ
|
18
|
జాతీయ జలమార్గం 84
|
44
|
రావి నది
|
19
|
జాతీయ జలమార్గం 96
|
311
|
సువర్ణరేఖ నది
|
20
|
జాతీయ జలమార్గం 98
|
377
|
సట్లెజ్ నది
|
21
|
జాతీయ జలమార్గం 100
|
436
|
తపీ నది
|
22
|
జాతీయ జలమార్గం 101
|
87
|
తల్వాంగ్ (ధళేశ్వరి నది)
|
23
|
జాతీయ జలమార్గం 104
|
232
|
తుంగభద్ర నది
|
24
|
జాతీయ జలమార్గం 109
|
166
|
వైన్ గంగ-ప్రాణహిత నదీ వ్యవస్థ
|
25
|
జాతీయ జలమార్గం 110
|
1080
|
యమునా నది
|
|
|
|
|
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.
***
(Release ID: 2042506)
Visitor Counter : 69