బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు నుంచి సింథటిక్ నేచురల్ గ్యాస్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఒక జెవి కై సిఐఎల్ & జిఎఐఎల్ సంతకాలు

Posted On: 06 AUG 2024 12:58PM by PIB Hyderabad

మహారత్న హోదా కలిగిన  రెండు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్ఇ స్) కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)జిఎఐఎల్  (ఇండియా)  లిమిటెడ్  (జిఎఐఎల్) ల మధ్య  ఈ రోజుఅంటే 2024 ఆగస్టు 5న, ఒక ప్రతిష్టాత్మక సంయుక్త సంస్థ (JV) ను స్థాపించడానికి ఉద్దేశించిన ఒప్పందం కుదరడానికి విద్యుత్తుసహజవాయువు మంత్రిత్వ శాఖ సహకారంతో బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గాన్ని సుగమం చేసింది.  సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ (ఎస్‌సిజి) సాంకేతికతను ఉపయోగించుకొంటూ, బొగ్గు నుంచి సింథెటిక్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) ఉత్పత్తికి ఉద్దేశించిన ఒక ప్లాంటును ఏర్పాటు చేసే దిశలో ఒక ప్రధానమైన ముందడుగును ఈ ఒప్పందం సూచిస్తున్నది.

 

పశ్చిమ బంగాల్ లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ స్ లిమిటెడ్ కు చెందిన రాణిగంజ్ ప్రాంతంలో  ఏర్పాటుకానున్న ఈ ప్లాంటు గంటకు 80000 Nm3   సామర్థ్యం కలిగివుండే సింథెటిక్ నేచురల్ గ్యాస్ (ఎస్ఎన్‌జి) ఉత్పత్తికి ఉద్దేశించింది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి గంటకు 633.6 మిలియన్ Nm3 చొప్పున నిర్ధారణ అయింది. దీనికి గాను 1.9 మిలియన్ టన్నుల (mts) బొగ్గు అవసరమవుతుంది. సిఐఎల్ ఈ బొగ్గును సరఫరా చేస్తుంది.  బొగ్గు తాలూకు రసాయనిక సంపత్తులను ఉపయోగించుకోవడానికి మార్గాన్ని సుగమం చేసే నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ దిశలో రెండు కార్పొరేట్ దిగ్గజాల సహకారం, భాగస్వామ్యాలు ఒక ప్రధానమైన ముందంజ అని చెప్పాలి. 

 

సింథెటిక్ నేచురల్ గ్యాస్ (ఎస్ఎన్‌జి) ఒక ఇంధన జనిత వాయువు.  దీనిలో ప్రధానంగా మీథేన్సిహెచ్4  (CH4) లు ఉంటాయి. ఇవి వేరువేరు రసాయనాలు, ఎరువుల ఉత్పత్తి లో ఫీడ్ స్టాక్ అన్నమాట. త్వరలో ఏర్పాటు కానున్న ప్లాంటు ముడిపదార్థాలను సమకూర్చుకోవడంలో సహాయకారి గా ఉంటూసహజ వాయువు దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ ను ప్రోత్సహిస్తుంది. 

 

 

సంయుక్త సంస్థ స్థాపన సంబంధ ఒప్పంద పత్రం పైన సిఐఎల్ పక్షాన సిఐఎల్ డైరెక్టర్ (వ్యాపారాభివృద్ధి) శ్రీ దేబాశీష్ నందాజిఎఐఎల్ పక్షాన జిఎఐఎల్ డైరెక్టర్ (వ్యాపారాభివృద్ధి) శ్రీ ఆర్.కె. సింఘాల్ లు సంతకాలు చేశారు.

 

 

సంతకాల కార్యక్రమంలో బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఎమ్. నాగరాజు మాట్లాడుతూఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సిఐఎల్జిఎఐఎల్ లు చాటిన నిబద్ధత ఒక రోల్ మాడల్ అవుతుందన్నారు.  ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ అత్యున్నత ప్రాథమ్య రంగాలలో ఒకటి గ్యాసిఫికేషన్.  భారతదేశంలో భారీ స్థాయిలో బొగ్గు నిక్షేపాలను కలిగివుంది.  ఈ నిక్షేపాలను ప్రయోజనకరంగాపర్యావరణ స్నేహపూర్వకమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని శ్రీ ఎమ్. నాగరాజు అన్నారు.  కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించడానికి మరిన్ని కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశలో పథక రచన జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.  వయబుల్ గ్యాప్ ఫండింగ్ కు ఆర్థికపరమైన సమర్థన సహా  ప్రభుత్వం వైపు నుంచి సాధ్యమైన అన్ని రకాలుగాను మద్ధతుకు రంగం సిద్ధమైందని ఆయన అన్నారు.  కోల్/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు కోసం మూడు కేటగిరీలలో భాగంగా 8,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాల కోసం అర్హులైన బిడ్డర్ లను (ప్రభుత్వప్రైవేటు) ఆహ్వానిస్తూరిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్‌పి స్) ను 2024 మే 15న ప్రారంభించడమైందన్నారు.  ఆర్ఎఫ్‌పి లను దాఖలు చేయడానికి 2024 నవంబరు 11న ఆఖరు తేదీ.

 

జిఎఐల్ (చైర్ మన్మేనేజింగ్ డైరెక్టర్) శ్రీ ఎస్.కె.  గుప్తా మాట్లాడుతూ సిఐఎల్జిఎఐఎల్ ల బృందాన్ని అభినందించారు.  ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలంటే అందుకు ప్రభుత్వం నుంచి మరిన్ని అండదండలు అవసరమవుతాయని ఆయన అన్నారు. 

 

 

పెట్రోలియమ్సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఎమ్ఒపి ఎన్‌జి) శ్రీ పంకజ్ జైన్ మాట్లాడుతూదేశంలో ఉద్గారాల సంబంధ లక్ష్యాన్ని చేరుకోవాలంటే  కోల్ గ్యాసిఫికేషన్ వంటి పర్యావరణ మిత్రపూర్వకమైన సంస్థల ఏర్పాటు వంటి బొగ్గు తాలూకు ప్రత్యామ్నాయ వినియోగాల వైపు రాబోయే కాలంలో మొగ్గు చూపాలన్నారు.  ఎస్‌సిజి (SCG) ఒక అభివృద్ధికి రాదగ్గ సాంకేతికత.  అది బొగ్గును విలువైన సింథెటిక్ గ్యాస్ (Syn gas)గా మార్చుతుందని ఆయన అన్నారు.  దీనిని మరింతగా శుద్ధి చేశామా అంటే గనక సింథెటిక్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తికి తలుపులు తెరచుకొంటాయి.  సింథెటిక్ నేచురల్ గ్యాస్ ను నేచురల్ గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.  అంతేకాకుండాడౌన్ స్ట్రీమ్ కెమికల్స్ ఉత్పత్తి ప్రక్రియలో ఫీడ్ స్టాక్ గా కూడా దీనిని వినియోగించుకోవచ్చు.  ప్రస్తుతం ఈ అవసరాలకు గాను దిగుమతులపై ఆధారపడుతున్నామని ఆయన వివరించారు.

 

సిఐఎల్ డైరెక్టర్బిజినెస్ డెవలప్ మెంట్ (బిడి) శ్రీ దేబాశీష్ నందా మాట్లాడుతూప్లాంటు సమగ్ర సంభావ్యత నివేదికను రూపొందించే పనిని అప్పగించిన మెస్సర్స్ ప్రాజెక్ట్ స్ అండ్ డెవలప్ మెంట్ ఇండియా  లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.  ఈ సంతకాల కార్యక్రమంలో పాలుపంచుకొన్నందుకు బొగ్గు మంత్రిత్వ శాఖపెట్రోలియమ్సహజ వాయువు మంత్రిత్వ శాఖసిఐఎల్జిఎఐఎల్ఇంకా పిడిఐఎల్ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

            

                              

***


(Release ID: 2042162) Visitor Counter : 86