సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యువ కళాకారులకు ఉపకార వేతనాలు
Posted On:
05 AUG 2024 2:04PM by PIB Hyderabad
యువ కళాకారులకు సహకారం అందించేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాల పథకం(స్కాలర్‌షిప్స్ టు యంగ్ ఆర్టిస్ట్స్ ఇన్ డిఫెరెంట్ కల్చరల్ ఫీల్డ్స్)(ఎస్‌వైఏ)’ పేరుతో ఆర్థిక చేయుతను అందించే పథకాన్ని అమలు చేస్తోంది. సాంస్కృతిక నృత్యరూపకాలు, దేశీయ కళాకృతులు, ఇతర సంప్రదాయ కళారూపాలలో ప్రావీణ్యం పొందేందుకు ఆయా రంగాల్లో మరింత అధునాతన శిక్షణ పొందడానికి సహకరించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గరిష్టంగా 400 మంది విద్యార్థులకు నెలకు రూ.5,000 చొప్పున రెండేళ్ల కాలానికి గానూ ఆరు నెలలకు ఒక వాయిదా చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తోంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఎవరైనా గురువు లేదా సంస్థలో కనీసం 5 ఏళ్ల పాటు శిక్షణ పొందుతున్న విద్యార్థులను ఇందుకోసం ఎంపిక చేస్తుంది. మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసే నిపుణుల కమిటీ ముందు వ్యక్తిత్వ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ‘వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాల పథకం’ కింద ఎంపికైన లబ్ధిదారుల మొత్తం సంఖ్యకు సంబంధించి రాష్ట్రాలవారీగా వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.
దీంతో పాటు వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాలు అందించేందుకు ‘కళలు, సాంస్కృతిక ప్రోత్సాహం కోసం ఉపకార వేతనాలు, ఫెలోషిప్ అందించే పథకం(స్కీమ్ ఫర్ స్కాలర్‌షిప్ ఆండ్ ఫెలోషిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్ ఆండ్ కల్చర్)’ పేరుతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరో కేంద్ర పథకాన్ని సైతం అమలు చేస్తోంది. ‘కళలు, సంస్కృతి ప్రోత్సాహం కోసం ఉపకార వేతనాలు, ఫెలోషిప్ అందించే పథకం’ అమలుకు కేటాయించిన నిధులను రాష్ట్రాలవారీగా మంజూరు చేయడం ఉండదు. ఈ పథకానికి గత ఐదేళ్లలో మంజూరైన నిధుల వివరాలు కింద ఉన్నాయి:-
వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాలు అందించే పథకం(స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ టు యంగ్ ఆర్టిస్ట్స్ ఇన్ డిఫెరెంట్ కల్చరల్ ఫీల్డ్స్) కింద గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వినియోగించిన నిధుల వివరాలు రాష్ట్రాలవారీగా అనుబంధం-2లో ఉన్నాయి.
‘వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ఉపకార వేతనాలు(స్కాలర్‌షిప్స్ టు యంగ్ ఆర్టిస్ట్స్ ఇన్ డిఫెరెంట్ కల్చరల్ ఫీల్డ్స్)’ మార్గదర్శకాల ప్రకారం ఈ కింది సాంస్కృతిక కార్యక్రమాలు/అంశాలు/రంగాలకు ఉపకార వేతనాలు అందిస్తోంది:-
భారతీయ శాస్త్రీయ సంగీతం
భారతీయ శాస్త్రీయ నృత్యం/ నృత్య సంగీతం
థియేటర్
విజువల్ ఆర్ట్స్
జానపద, సాంప్రదాయ, దేశీయ కళలు
లైట్ క్లాసికల్ మ్యూజిక్
***
(Release ID: 2041769)
Visitor Counter : 44