ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఐటీ నిబంధనలు- 2021 కింద 1,065 కేసులు నమోదు
937 కేసులకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీల పరిష్కారం
సురక్షిత, విశ్వసనీయమైన ఇంటర్నెట్ కోసం మధ్యవర్తుల జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తున్న ఐటి రూల్స్- 2021
Posted On:
02 AUG 2024 7:08PM by PIB Hyderabad
ప్రభుత్వం ఇంటర్నెట్ సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021 (ఐటి రూల్స్- 2021) ను 2021, ఫిబ్రవరి 25 న నోటిఫై చేసింది. 2022, అక్టోబర్ 28, 2023 ఏప్రిల్ 6 తేదీల్లో వీటికి సవరణలు జరిగాయి.
సురక్షిత, విశ్వసనీయ అంతర్జాల సేవల పట్ల జవాబుదారీతనాన్ని పెంచేందుకు కొన్ని ప్రత్యేక సామాజిక మాధ్యమాల తో పాటు వివిధ సామాజిక మాధ్యమ సంస్థల మధ్యవర్తులపై నిర్దిష్ట చట్టపరమైన బాధ్యతలను ఉంచిన ఐటి రూల్స్- 2021 తెలియజేస్తున్నాయి.
గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీలు 2023, మార్చి 1 నుంచి 2024 జూన్ 30 వరకు దాఖలు చేసిన, పరిష్కరించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
• దాఖలైన కేసులు: 1,065
• పరిష్కారమైన కేసులు: 937
ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
***
(Release ID: 2041193)
Visitor Counter : 84