కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎఫ్‌ఎమ్ ఫేజ్ -III లో భాగంగా ఎఫ్‌ఎమ్ రేడియో ఛానెల్స్ వేలం రిజర్వ్ ధరలను నిర్ధారించడానికి ట్రాయ్ సంప్రదింపు పత్రం విడుదల చేసింది

Posted On: 01 AUG 2024 6:09PM by PIB Hyderabad

భారత టెలికాం నియంత్రణ అధారిటీ (ట్రాయ్) ఈ రోజు "ఎఫ్‌ఎమ్ రేడియో ఛానెల్స్ ల వేలం రిజర్వ్ ధరలు" పై ఒక సంప్రదింపు పత్రం విడుదల చేసింది.

 

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (ఎం ఐ బి), హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరియు జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో యూ టీ) ఉన్న 18 నగరాలు/పట్టణాల్లో ప్రైవేటు ఎఫ్‌ఎమ్ రేడియో విస్తరణ కోసం ఎఫ్‌ఎమ్ రేడియో ఛానెల్స్ వేలం రిజర్వ్ ధరపై 19 మార్చి 2024 న ట్రాయ్ సిఫారసులు కోరింది. ఈ నగరాల కోసం ఎం ఐ బి కొత్త ' ఈ ' వర్గాన్ని ప్రవేశపెట్టటానికి నిర్ణయించింది. ప్రభావవంతమైన ప్రసార శక్తి (ఈ ఆర్ పి) మినహా ,  'డి 'వర్గం నగరాలకు వర్తించే అన్ని సాంకేతిక అంశాలు, ' ఈ 'వర్గం నగరాలకు కూడా వర్తిస్తాయి.

 

ఎం ఐబి ' ఈ 'వర్గం కోసం ఈ ఆర్ పి ని 750 వాట్ల నుండి 1 కిలో వాట్లుగా ప్రతిపాదించింది. చత్తీస్‌గఢ్ లో బిలాస్‌పూర్, ఒడిశాలో రౌర్‌కెలా మరియు ఉత్తరాఖండ్‌లో రుద్రాపూర్ నగరాల రిజర్వ్ ధరలను కూడా సిఫారసు చేయాలని ఎం ఐబి  ట్రాయ్ ని అభ్యర్థించింది.

 

ఎఫ్ ఎం  రేడియో ఛానెల్ ల వేలం రిజర్వ్ ధరలను నిర్ధారించడంలో ఆసక్తి ఉన్న వారి అభిప్రాయాలు/సూచనలను కోరడం కోసం ఈ సంప్రదింపు పత్రం అందరికీ అందుబాటులో ఉంచింది. ఈ సంప్రదింపు పత్రంపై వ్యాఖ్యలు వ్రాతపూర్వకంగా 29 ఆగస్టు 2024 లోగా చేరేలా పంపవలసిందిగా ఆసక్తి గల వారిని ఆహ్వానిస్తున్నారు. కౌంటర్-కామెంట్స్ (తిరుగు వ్యాఖ్యలు) ను 12 సెప్టెంబర్ 2024 లోగా సమర్పించవచ్చు. కామెంట్స్ మరియు కౌంటర్-కామెంట్స్ ను ఎలక్ట్రానిక్ రూపంలో advbcs-2@trai.gov.in,  jtadvbcs-1@trai.gov.in ఇమెయిల్ ఐడీలకు పంపవచ్చు.

 

ఏదైనా వివరణ/సమాచారం కోసం, శ్రీ దీపక్ శర్మ, సలహాదారుడు (బి & సి ఎస్ ) ను +91-11-20907774 నంబర్ లో సంప్రదించవచ్చు. పూర్తి సంప్రదింపు పత్రం  ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.in లో అందుబాటులో ఉంది.

***


(Release ID: 2040618) Visitor Counter : 76