వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ విధానాలు రూపాయి విలువను పెంచే అవకాశం ఉంది: శ్రీ పీయూష్ గోయల్
ప్రతి పౌరుడికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తుంది: గోయల్
ప్రభుత్వం చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి, నాణ్యమైన తయారీకి కేంద్రబిందువుగా మారడంపై దృష్టి సారించింది: గోయల్
"భారత్@100: రేపటి ఆర్థిక శక్తిపై ఆలోచన" పుస్తకాన్ని ఆవిష్కరించిన వాణిజ్య పరిశ్రమల మంత్రి
Posted On:
01 AUG 2024 6:06PM by PIB Hyderabad
సెమీకండక్టర్ల తయారీ, దేశీయ నౌకాయానం, నూనె గింజలు, రబ్బర్, పప్పుధాన్యాల దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ బలపడటానికి సహాయపడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ రచించిన భారత్@100: రేపటి ఆర్థిక శక్తిపై ఆలోచన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశం 8% వార్షిక వృద్ధి రేటును కొనసాగిస్తే, 2047 నాటికి భారతదేశం 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలదని శ్రీ సుబ్రమణియన్ పుస్తకంలో అంచనా వేశారు.
స్థిరమైన ఆర్థిక వ్యవస్థ భారత్‌ను ప్రపంచంలోని ఉత్తమ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపేందుకు దోహదపడుతుందని సమావేశంలో కేందమంత్రి అన్నారు. కేంద్రం వచ్చే ఐదేళ్లలో పిరమిడ్‌లో దిగువన ఉన్న చిట్టచివరి వ్యక్తికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తుందని అన్నారు. చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మారడం, తయారీలో నాణ్యతను ప్రధానాంశంగా మార్చే ప్రయత్నాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, బలమైన కరెన్సీ, స్థూల ఆర్థిక మౌలికాంశాలు వంటి చర్యలతో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు.
చైనా వేగవంతమైన వృద్ధి గురించి శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, తక్కువ ద్రవ్యోల్బణం ఆధారంగా 2000-2020 మధ్య చైనా 8% వృద్ధిని సాధించిందన్నారు. భారత్ ఇప్పుడు అదే స్థితిలో ఉందని అన్నారు. "మన రాజకీయ, సామాజిక సమస్యలు మెల్లిగా తగ్గుతూ, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. చైనా వృద్ధి అంశాలను భారత్ ప్రతిబింబిస్తుంది" అని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నారు.
నైతిక సంపద సృష్టి, ప్రైవేటు పెట్టుబడుల ఆవశ్యకతపై ప్రసంగించిన శ్రీ పియూష్ గోయల్, ప్రైవేటు రంగం, వ్యాపారాల్లో సంపద సృష్టికర్తల సహకార గుర్తింపు పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను కొనియాడారు.
"ఉద్యోగాల కల్పనలో, పౌరులకు వస్తు, సేవలను అందించడంలో సంపద సృష్టికర్తల పాత్రను ప్రధాని మోదీ గౌరవిస్తారు." అని ఆయన అన్నారు. సిఐఐ బడ్జెట్ తదనంతర కాన్ఫరెన్స్ లో ప్రధాని ప్రసంగంలో భారతదేశ వృద్ధిలో తయారీ రంగం ప్రాముఖ్యతను, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి స్థిరమైన విధానాల ఆవశ్యకతను పేర్కొన్నట్లు ఆయన అన్నారు.
***
(Release ID: 2040616)
Visitor Counter : 90