జల శక్తి మంత్రిత్వ శాఖ
గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు
Posted On:
01 AUG 2024 3:45PM by PIB Hyderabad
స్వచ్ఛభారత్ మిషన్- గ్రామీణ ఫేజ్-1 కింద 2014-15 నుంచి 2019-20 మధ్య 10.14 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు (ఐహెచ్‌హెచ్ఎల్) నిర్మించడం జరిగింది. వివిధ ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పెద్దఎత్తున ప్రవర్తన మార్పు తీసుకురావడం జరిగింది. దీని ఫలితంగా 2 అక్టోబర్ 2019 నాటికి అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) గా ప్రకటించుకునేలా చేశాయి. అక్టోబర్ 2014 లో 39 శాతంగా ఉన్న మరుగుదొడ్ల సదుపాయాన్ని మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా, ఆయనకు నివాళిగా అక్టోబర్ 2019 నాటికి 100 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ కార్యక్రమం కింద మిగిలిన కుటుంబాలను (విడిచిపెట్టిన, కొత్తగా నిర్మించిన ఇళ్లు) ఇందులో చేరుస్తూ, ప్రతీ ఇంటినీ మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
గ్రామాలను ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) హోదాను సుస్థిరం చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ రెండో దశను అమలు చేస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ఒకేసారి ముగిసే కార్యక్రమం కాదని, నిరంతరం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు, వలస కుటుంబాలకు మరుగుదొడ్లు అవసరమవుతాయని గ్రహించి, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) నిధులపై కొత్త వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల (ఐహెచ్‌హెచ్ఎల్) నిర్మాణం మొదటి ప్రాధాన్యతగా కొనసాగుతోందని, మిగిలిపోయిన మరుగుదొడ్ల కోసం ప్రణాళికలు రూపొందించాలని, ఈ అంతరాన్ని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కార్యక్రమం సమన్వయంతో ఎస్బీఎం(జీ) నిధుల నుంచి అర్హులైన లబ్ధిదారులకు ఇంటితో పాటు మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చే వెసులుబాటు ఉంది. వీటన్నింటి కారణంగానే ఈ కార్యక్రమం రెండో దశలో కూడా గత నాలుగేళ్లు, ప్రస్తుత సంవత్సరంలో దాదాపు 1.43 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు.
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందిన సమాచారం ప్రకారం, దేశంలోని పట్టణ ప్రాంతాలను బహిరంగ మలవిసర్జన రహితంగా (ఓడీఎఫ్) మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2014 అక్టోబరు 2 న స్వచ్ఛ భారత్ మిషన్ (పట్టణ) ను ప్రారంభించింది. దీని కింద మురికివాడలతో సహా నగరాల్లోని మొత్తం జనాభాకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్బీఎం-పట్టణ కింద కమ్యూనిటీ మరుగుదొడ్డు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేస్తారు. ఎస్బీఎం-యూ, ఎస్బీఎం-యూ 2.0 కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వాటా నిధులు విడుదలవుతాయి. ఆ తర్వాత రాష్ట్రాలు తమ కార్యాచరణ ప్రణాళికల ప్రకారం పట్టణ, నగర పాలక సంస్థలకు నిధులు విడుదల చేస్తాయి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మురికివాడల్లో నివసించే వారిని లక్ష్యంగా చేసుకుని నిర్మించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లోని జనసంఖ్య అధికంగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో, సాధారణ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పబ్లిక్ మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు.
ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి సరఫరాను అందించడానికి భారత ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్- హర్ ఘర్ జల్ ను పథకాన్ని అమలు చేస్తోంది. 15 ఆగస్టు 2019 వ తేదీన జల్ జీవన్ మిషన్ ప్రకటించే సమయానికి, 3.23 కోట్ల (17%) గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయి. 26.07.2024 నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన వివరాల ప్రకారం, సుమారు 11.78 కోట్ల అదనపు గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడ్డాయి. 26.07.2024 నాటికి, దేశంలోని 19.32 కోట్ల గ్రామీణ గృహాలలో, 15.01 కోట్లకు పైగా (77.71%) గృహాలకు వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరా ఉంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ కింద అందించే కుళాయి నీటి కనెక్షన్ యొక్క జిల్లాల వారీగా స్థితి వెబ్‌సైట్ https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx లోని జేజేఎం డ్యాష్ బోర్డులో లభ్యం అవుతుంది.
ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 2040606)