గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అమృత కాలానికి మార్గాలు
Posted On:
01 AUG 2024 1:15PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ ప్రణాళిక రూపకల్పన అనేది పట్టణ స్థానిక సంస్థలు ( యు ఎల్ బీలు) / పట్టణాభివృద్ధి సంస్థలు నిర్వహించాల్సిన పని. రాష్ట్రాలు చేపట్టే పనుల విషయంలో పథకాలపరంగా కలగజేసుకోవడం, సలహాలు ఇవ్వడమనేది కేంద్రప్రభుత్వ పని . కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందజేస్తుంది.
పట్టణ ప్రణాళికకు సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీ అమృత కాలానికి మార్గాలు: భారతదేశ నగరాల సమీప భవిష్యత్తు రూపకల్పన, సాకారం పేరుతో మొదటి ముసాయిదా నివేదికను 2023 ఏప్రిల్ న సమర్పించింది. కమిటీ కాలపరిమితిని 31-07-2024వరకూ పొడిగించారు.
వేగంగా కొనసాగుతున్న పట్టణీకరణ, జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కింద తెలియజేసిన మార్గదర్శకాలను, బైలాలను విడుదల చేసింది.
పట్టణ, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, అమలు ( యుఆర్ డిపి ఎఫ్ ఐ) మార్గదర్శకాలు, 2014, నమూనా భవన నిర్మాణ బైలాలు ( ఎంబిబిఎల్) -2016
ప్రణాళికా పరంగా కలగజేసుకోవడంద్వారా పట్టణ ప్రణాళిక సమతుల్యతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రి శాఖ పని చేస్తుంది. రాష్ట్రాలు పట్టణ ప్రణాళికా సంస్కరణల్ని చేపట్టడంకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా రాష్ట్రాలకు ప్రత్యేక సాయం అందించే పథకాలకోసం మూలధన పెట్టుబడుల వ్యయవిభాగాన్ని ప్రారంభించడం జరిగింది. భూమి వినియోగంలో సామర్థ్యాన్ని, సుస్థిర అభివృద్ధిని, స్థోమతను, ఆదాయ కల్పనను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఇందుకో పట్టణ ప్రణాళికను ఉపయోగించుకుంటుంది.
మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించే పథకం 2022-23 – పార్ట్ – VI (పట్టణ ప్రణాళిక సంస్కరణలు) రూ. 6000 కోట్ల కేటాయింపులు-
సంస్కరణ భాగాలనేవి వైరుధ్యాలను తొలగించడాన్ని, భూ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా భవన నిర్మాణ బైలాస్ ఆధునికీకరణను కలిగి వున్నాయి. బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు (టిడిఆర్), స్థానిక ప్రాంత ప్రణాళికలు (LAP), పట్టణ ప్రణాళికా పథకాలు (టిపిఎస్), రవాణా-ఆధారిత అభివృద్ధి (టిఓడి) అమలు వంటి ఆధునిక పట్టణ ప్రణాళిక సాధనాలను స్వీకరించడం ఇందులో భాగం. స్పాంజ్ నగరాలను ఏర్పాటు చేసినందుకు, ప్రజా రవాణా కోసం బస్సులను నడపడానికివీలుగా పన్నులను తొలగించడానికి గాను రాష్ట్రాలను ప్రోత్సహించడం జరిగింది.
మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించే పథకం 2023-24 - పార్ట్ - III (పట్టణ ప్రణాళిక సంస్కరణలు) రూ. 15000 కోట్ల కేటాయింపు- సంస్కరణ భాగాలలో, అర్హత కలిగిన పట్టణ ప్రణాళికదారుల నియామకం ద్వారా మానవ వనరులను పెంపొందించడం కూడా ఉంది. టౌన్ ప్లానింగ్ స్కీమ్ (TPS)/ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అమలు, బిల్డింగ్ బైలాస్ ఆధునికీకరణ, ఎప్పటినుంచో వున్న మురికివాడల్లో పునరావాసాన్ని ప్రోత్సహించడం ఈ సంస్కరణల్లో వున్నాయి. రవాణా ఆధారిత అభివృద్ధి (TOD), ప్రణాళికా సాధనంగా బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు, పట్టణ ప్రణాళిక ద్వారా పట్టణ ప్రాంతాల సహజ పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, జల సమీప ప్రాంతాల అభివృద్ధి మొదలైనవి కూడా ఈ సంస్కరణల్లో వున్నాయి.
500 అమృత నగరాలకోసం జిఐఎస్ ఆధారిత మాస్టర్ ప్రణాళికల రూపకల్పన అనేది అమృత్ కార్యక్రమం కింద ఉప పథకంగా తయారై అమలు దశలో వుంది. ఈ ఉప పథకం అనేది భౌగోళిక సమాచారాన్ని తయారు చేయడానికి, జిఐఎస్ ఆధారిత మాస్టర్ ప్రణాళికల రూపకల్పనకోసం ఉద్దేశించినది. ప్రస్తుతం ఈ పథకం కింద 35 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 431 అమృత్ నగరాలను తీర్చిదిద్దుతున్నారు. ముసాయిదా జిఐఎస్ ఆధారిత మాస్టర్ ప్రణాళికను 355 పట్టణాలకోసం తయారు చేశారు. వీటిలో 208 పట్టణాల మాస్టర్ ప్రణాళికలకు ఆమోదం తెలిపారు.
అంతే కాదు పట్టణ ప్రణాళిక పథకం ( టిపిఎస్), స్థానిక ప్రాంత ప్రణాళికల తయారీకోసం అమృత్ కార్యక్రమంకింద పైలెట్ ఉప పథకాన్ని 2018లో ప్రారంభించారు. స్థల భాగాలను సర్దుబాటు చేయడం, పాత నగర కేంద్రాలను తిరిగి నిర్మించడం ద్వారా ప్రణాళికాబద్దంగా పట్టణ అభివృద్ధిని చేయడం ఈ పథకం లక్ష్యం. 50వేలనుంచి 99, 999 జనాభా కలిగిన క్లాస్ 2 పట్టణాల్లో అమృత్ 2.0 కింద జిఐఎస్ ఆధారిత మాస్టర్ ప్రణాళిక రూపకల్పనను పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి జియో డాటాబేస్ తయారు కోసం జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రంతో , సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఎంఓయు మీద సంతకాలు చేశారు.
లోక్ సభలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ టోకన్ సాహు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది.
***
(Release ID: 2040604)
Visitor Counter : 52