రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జాతీయ రహదారుల నాణ్యతపై అంచనా
Posted On:
31 JUL 2024 1:40PM by PIB Hyderabad
జాతీయ రహదారుల ఫీజు వసూలు ప్లాజాల వద్ద , జాతీయ రహదారుల ఫీజు నిబంధనల మేరకు వినియోగ చార్జీలు వసూలు చేస్తారు.
జాతీయ రహదారులు (ఎన్.హెచ్) , వాటిపై గల బ్రిడ్జిలు, నిర్మాణాల నిర్వహణను సంబంధిత కాంట్రాక్టు, కన్సెషన్ ఒప్పందం ప్రకారం వివిధ పద్ధతులలో చేపడతారు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, నిర్మాణ కాంట్రాక్టులలో (ఇపిసి) ,రోడ్డు నిర్మాణ సమయంలో, అనంతరం లోపాల బాధ్యత–నిర్వహణ సమయంలోను వాటి నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లు చేపడతారు.
ఆకృతి రూపకల్పన, నిర్మాణం, ఆర్ధిక మద్దతు, నిర్వహణ, బదిలీ(డిబిఎఫ్ఒటి, హైబ్రిడ్ యాన్యుటి విధానం(హెచ్.ఎ.ఎం) కాంట్రాక్టుల లో, కన్సెషనీర్లు రోడ్డు నిర్మాణ సమయంలో , అలాగే కన్సెషన్ సమయం ముగిసే వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత చేపడతారు. ఐ.ఎన్.వి.ఐ.టి కింద,టోల్ ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టిఒటి, స్పెషల్ పర్పస్ వెహికిల్ ) ఒప్పందాల విషయంలో కన్సెషనర్లు కన్సెషన్ సమయంలో రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూస్తారు.
మిగిలిన జాతీయ రహదారుల విషయంలో సాధారణంగా , పనితీరు ఆధారిత నిర్వహణా కాంట్రాక్టు (పి.బి.ఎం.సి), స్వల్పకాలిక నిర్వహణ కాంట్రాక్టు (ఎస్.టి.ఎం.సి)లకు చెందిన కాంట్రాక్టర్లు వాటి నిర్వహణను చూస్తారు.
వినియోగ చార్జీల సమర్ధ వసూలు దిశగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు కింది విధంగా ఉన్నాయి.
1. ఫాస్టాగ్ అందుబాటును మరింత సులభతరం , విస్తృతం చేశారు.ఎం అండ్ ఎన్ కేటగిరీ మోటారు వాహనాలకు వాటిని అతికించడం తప్పనిసరి .
2. ఫీ ప్లాజాలలోని అన్ని లేన్లను ఫాస్టాగ్ లేన్లుగా మార్చారు.
3. ఒక వాహనాన్ని ఒకేఫాస్టాగ్తో అనుసంధానం చేసేవిధంగా ‘‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’’(ఒవిఒటి) విధానాన్ని చేపట్టారు.
4. ఫీజు వసూలులో పారదర్శకతను పెంపొందించడం కోసం, కొన్ని ప్రాంతాలలో ఫాస్టాగ్ వ్యవస్థతో అనుసంధానమైన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు (ఎ.ఎన్.పి.ఆర్)ను ప్రవేశపెట్టారు.
5 .జి.ఎన్.ఎస్.ఎస్ ఆధారిత టోల్ ఫీజు వసూలును భారతదేశంలో చేపట్టేందుకు అంతర్జాతీయ ఆసక్తి వ్యక్తీకరణ (ఇఒఐ)ని ఆహ్వానించారు. పైలట్ విధానంలో ఎంపిక చేసిన జాతీయ రహదారుల సెక్షన్లలో జి.ఎన్.ఎస్.ఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ ఫీజు వసూలు వ్యవస్థను , ఫాస్టాగ్‌తో పాటు అదనపు సౌకర్యంగా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
రోడ్డు వాడకం దారులు జాతీయ రహదారుల నాణ్యత , జాతీయ రహదారుల ఫీజు ప్లాజాలవద్ద మౌలిక సదుపాయాలు, వాటి నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే వాటిని భారత జాతీయ రహదారుల అథారిటీ వారి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ 1033 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
దీనికితోడు జాతీయరహదారుల వాడకం దారులు ఫొటో లేదా వీడియో ఆధారాలతో తమ సమస్య లేదా ఫిర్యాదును రాజమార్గయాత్ర అప్లికేషన్ ద్వారా దాఖలు చేయవచ్చు. అనంతరం ఆ ఫిర్యాదు పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు. వారి స్పందనను తెలియజేయవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి 2024 జూలై 31న రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2040071)