బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు బ్లాకుల వేలం
Posted On:
31 JUL 2024 3:48PM by PIB Hyderabad
బొగ్గు బ్లాకుల వేలంపాటలు నిరంతరంగా సాగే ప్రక్రియ; దీనిలో ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఈ రెండూ కూడా పాల్గొనవచ్చు.
బొగ్గు బ్లాకులను కేటాయించడానికి అనుసరించే విధానం ప్రకారం, అన్ని బొగ్గు బ్లాకులను ప్రస్తుతం బొగ్గు అమ్మకానికి ఉద్దేశించిన వేలంపాటలు అనే పద్ధతిలో కేటాయించడం జరుగుతోంది. బొగ్గు అన్వేషణను, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను తగ్గించడంతో పాటు బొగ్గు ఎగుమతులలో సత్వర వృద్ధిని సాధించడం కోసం సిఫారసులను ఇవ్వడానికి గనులు, ఖనిజాలు మరియు బొగ్గు రంగాలపై ఒక ఉన్నత స్థాయి సంఘాన్ని (హెచ్ఎల్‌సి) నీతి ఆయోగ్ వైస్ చైర్ మన్ అధ్యక్షతన 2019 మార్చి నెల 29న ఏర్పాటు చేయడమైంది. అన్వేషణకు, తవ్వకానికి ఉద్దేశించిన అన్ని రాయితీలను క్రమంగా వాణిజ్య ప్రయోజనాలకు బదలాయించడం జరుగుతుందని హెచ్ఎల్‌సి 2020 లో ఇచ్చిన నివేదికలో ఉన్న సిఫారసులకు మంత్రిత్వ శాఖ అంగీకారాన్ని తెలిపింది.
ఇంకా, ఈ నివేదికను ఆమోదించినప్పటి నుంచి ఒక సంవత్సరం గడచిన తరువాత అన్ని వేలంపాటలను/కేటాయింపులను వాణిజ్య ఉద్దేశ్యంతోనే ఇవ్వాలని, బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించే అసాధారణ పరిస్థితులలో మినహా డైరెక్ట్ అలాట్‌మెంట్ రూట్ ను మూసి వేయాలని, అంతేకాకుండా బొగ్గు బ్లాకుల వేలంపాటలలో ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్‌యులు) పాల్గొనవచ్చని హెచ్ఎల్‌సి సిఫారసు చేసింది.
సింగరేణీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను ప్రైవేట్ పరం చేయాలన్న దృష్టితో బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రణాళిక ఏదీ లేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి లోక్ సభ లో ఈ రోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2040051)
Visitor Counter : 54