గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణ రవాణా పునర్వ్యవస్థీకరణకు అడుగులు
Posted On:
29 JUL 2024 1:12PM by PIB Hyderabad
‘పట్టణ ప్రణాళిక’ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాబట్టి, వేర్వేరు ప్రజా రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడం సహా పట్టణ రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళిక, ఏర్పాటు, అభివృద్ధి సంబంధితమైనవి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ పట్టణ రవాణా విధానం(ఎన్‌యూటీపీ), 2006, మెట్రో రైలు విధానం, 2017, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవెలప్‌మెంట్ పాలసీ, 2017లు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంచుతూ మరింత స్థిరమైన, ఆచరణీయ పట్టణ రవాణా వ్యవస్థల సమ్మిళిత ప్రణాళికలు రూపొందించడానికి, అమలు చేయడానికి మార్గదర్శిగా పని చేస్తున్నాయి. ఫాస్టర్ అడాప్షన్ ఆండ్ మానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలెక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్) - 1, 2 పథకాల ద్వారా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి, వివిధ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇవే కాకుండా, 2023 ఆగస్టులో “పీఎం-ఇబస్” సేవా అనే కేంద్ర ప్రాయోజిత పథకం ప్రారంభమైంది. రూ.20,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ సహాయంతో నగరాల్లో బస్సు రవాణా కోసం 10,000 విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చి పట్టణ రవాణా సదుపాయాన్ని పెంచాలనేది ఈ పథకం లక్ష్యం.
విద్యుత్ వాహనాలు, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కింది ఉత్తర్వులను జారీ చేసింది:
(i) బాటరీ ద్వారా నడిచే రవాణా వాహనాలు, ఇథనాల్, మిథనాల్ ఇంధనాలతో నడిచే రవాణా వాహనాలకు పర్మిట్ల జారీలో మినహాయింపులు.
(ii) బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ, పునరుద్ధరణ, కొత్త రిజిస్ట్రేషన్ గుర్తు జారీకి చెల్లించాల్సిన రుసుముల మినహాయింపు
(iii) రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే బ్యాటరీ వాహనాలకు భారత దేశవ్యాప్త టూరిస్ట్ పర్మిట్ జారీ.
(iv) వాహనాలకు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థ లేదా విద్యుత్ కిట్ ఏర్పాటుచేసుకునేందుకు ప్రమాణాల ప్రకారం అనుమతి.
ఈ సమాచారాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ తొఖన్ సాహు సోమవారం(29.07.2024) నాడు రాజ్యసభలో రాతపూర్వకంగా తెలియజేశారు.
***
(Release ID: 2039558)
Visitor Counter : 48