ఆయుష్
ఆయుష్‌ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో సవాళ్లు
Posted On:
30 JUL 2024 5:49PM by PIB Hyderabad
ప్రజలకు అందుబాటులో, సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించటానికి ఉద్దేశించిన జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన వ్యూహాలలో ఆయుష్‌ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ఒకటి. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్ఎం-నేషనల్ హెల్త్ మిషన్)లో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి(ఆయుష్) వైద్యులు/ పారామెడికల్ సిబ్బందిని నియమించటాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే సంబంధింత ఆయూష్ సెంటర్లు ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులు (డీహెచ్‌లు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీలు) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్‌సీలు) ఉండి ఉండాలి. ఇందులో మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎన్‌హెచ్ఎంలోని ఆరోగ్య కేంద్రాల వద్దనున్న 13,222 ఆయుష్ కేంద్రాల్లో (6,612 పీహెచ్‌సీలు, 3,035 సీహెచ్‌సీలు, 469 డీహెచ్‌లు.. ఉప కేంద్రం (ఎస్‌సీ) పై స్థాయి, బ్లాక్ లెవల్ కంటే దిగువన ఉన్న 2,916 ఆరోగ్య కేంద్రాలు..సీహెచ్‌సీలు కాకుండా బ్లాక్ స్థాయిలో లేదా బ్లాక్ స్థాయి పైన 190 ఆరోగ్య కేంద్రాలు) ఆయూష్‌ను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చారు. 27,421 మంది ఆయుష్ వైద్యులు, 4,581 మంది ఆయుష్ పారామెడికల్ సిబ్బంది వివిధ ఆరోగ్య కేంద్రాల్లోని ఆయుష్ విభాగంలో (31.12.2023 నాటికి ఎన్‌హెచ్ఎం-ఎంఐఎస్ గణాంకాల ప్రకారం) ఉన్నారు.
ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా, సార్వత్రిక ఆరోగ్య కవరేజీ లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ స్థాయిలో నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రోత్సాహించటంతో కూడిన సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (సీపీహెచ్‌సీ)ను అందించడానికి దేశవ్యాప్తంగా ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలుగా మార్చేందుకు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ కేంద్రాల్లో కొన్ని ఆయుష్- ఎస్‌హెచ్‌సీ లేదా ఆయుష్ డిస్పెన్సరీలు. కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య నిర్వహణ కోసం ఆయుష్ మందులను కూడా ఆశా డ్రగ్ కిట్‌లో భాగం చేశారు. .
అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌లో ఉన్న నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద & ఫోక్ మెడిసిన్ రీసెర్చ్.. జానపద వైద్యం, జానపద వైద్యాన్ని పునరుజ్జీవనం, ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎథ్నోమెడిసిన్ పద్ధతుల డాక్యుమెంటేషన్, జానపద వాదనల శాస్త్రీయ ధృవీకరణను నిర్ధారించటంలో నిమగ్నమైంది. అంతేకాక, ఈ సంస్థ సంప్రదాయ వైద్యులకు సంబంధించి సామర్థ్య పెంపును(కెపాసిటీ బిల్డింగ్) చేపట్టటానికి, జానపద వైద్య పద్ధతులు, జానపద వైద్య సామర్థ్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అవగాహన శిబిరాలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సంప్రదాయ కమ్యూనిటీ ఆరోగ్య సంరక్షణ అందించేవారికి స్వచ్ఛంద దృవీకరణ(వీసీఎస్‌టీసీహెచ్‌పీ) కింద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సంప్రదాయ సామాజిక ఆరోగ్య సంరక్షణదారులను(టీసీహెచ్‌పీ) ధ్రువీకరిస్తోంది.
రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2039555)
Visitor Counter : 72