సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం పథకాలు

Posted On: 30 JUL 2024 3:20PM by PIB Hyderabad

సామాజిక న్యాయ, సాధికారత శాఖ కింది అంశాలతో వయోవృద్ధుల సంక్షేమం కోసం అటల్ వయో అభ్యుదయ్ యోజనను అమలు చేస్తుంది:

వయోవృద్ధుల కోసం సమీకృత కార్యక్రమం దీని కింద వృద్ధుల ఆశ్రయాలు (వృద్ధాశ్రమాలు), నిరంతర సంరక్షణ గృహాలు మొదలైన వాటిని నడపడం, నిర్వహించడం కోసం ప్రభుత్వేతర/స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించబడుతుంది. నిరుపేదలైన వయోవృద్ధులకు ఆశ్రయం, పోషకాహారం, వైద్య సంరక్షణ, వినోదం వంటి సదుపాయాలు ఉచితంగా అందించబడతాయి.

వయోవృద్ధుల కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక, దీని కింద అవగాహన కల్పించడం, ప్రచారం చేయడం, కంటిశుక్లాల శస్త్రచికిత్సలు, రాష్ట్ర నిర్ధిష్ట కార్యకలాపాల కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించబడుతుంది.

రాష్ట్రీయ వయోశ్రీ యోజన దీని కింద వయోవృద్ధులు, దారిద్య్ర రేఖకు దిగువన గలవారు లేదా నెలవారీ ఆదాయం రూ. 15000/-లకు మించని వయోవృద్ధులు, వయస్సు సంబంధిత వైకల్యాలు/అంగవైకల్యాలతో బాధపడేవారికి తగిన శారీరక సాధనాలు అందించబడతాయి అలాగే వారి శారీరక విధులు సాధారణ స్థితికి రావడంలో సహాయపడే నిత్యజీవిత సాధనాలు అందించబడతాయి.

ఎల్డర్‌లైన్ - వయోవృద్ధుల కోసం జాతీయ హెల్ప్‌లైన్, దీని కింద ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల పరిష్కారం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును పర్యవేక్షించడం వంటివి వయోవృద్ధుల ఎల్డర్‌లైన్ వెబ్‌సైట్ (elderline.dosje.gov.in) ద్వారా నిర్వహించబడును.

సీనియర్-కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ దీని కింద వృద్ధుల సంక్షేమం కోసం ఉత్పత్తులు, ప్రక్రియలు, సేవలను అభివృద్ధి చేయు వినూత్న అంకుర సంస్థలను గుర్తించి ప్రోత్సహిస్తారు.

ఇంకా, దివ్యాంగుల సాధికారత కోసం, దివ్యాంగుల హక్కుల (ఆర్.పి.డబ్ల్యూ.డి.) చట్టం, 2016ను ప్రభుత్వం రూపొందించింది, ఇది 19.04.2017 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్‌.పి.డబ్ల్యూ.డి. చట్టంలోని సెక్షన్ 45 (2) ప్రకారం, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్‌ల వంటి అవసరమైన సేవలను అందించే ప్రభుత్వ, స్థానిక సంస్థలు వారి అన్ని భవనాలు, ప్రాంగణాలలో యాక్సెసిబిలిటీని అందించడానికి, ప్రాధాన్యత ఆధారంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించబడుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ 24, ఆర్థిక సామర్థ్య పరిమితిలో, ఆదాయ పరిమితికి లోబడి దివ్యాంగులకు సముచిత పెన్షన్‌ను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ చట్టంలోని సెక్షన్ 6 మరియు 7 దివ్యాంగుల పట్ల క్రూరత్వం, అమానవీయ ప్రవర్తన, వేధింపులు, హింస నుండి రక్షణ కల్పించును.

ఇంకా, భారత రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా 9వ ప్రవేశం ద్వారా వికలాంగులకు ఉపశమనం రాష్ట్ర పరిధిలోని అంశం అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు ఊతమిస్తుంది. వాటిలో కొన్ని ప్రధాన పథకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

'సహాయక పరికరాలు, ఉపకరణాల కొనుగోలు/అమర్చడం కోసం దివ్యాంగులకు సహాయం అందించడం (ఎ.డి.ఐ.పి)' దీని కింద వైకల్యాల ప్రభావాలను తగ్గించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా వారి శారీరక, సామాజిక, మానసిక పునరావాసాన్ని ప్రోత్సహించే మన్నికైన, అధునాతనమైన, శాస్త్రీయంగా తయారు చేయబడిన, ఆధునిక, ప్రామాణిక సహాయ పరికరాలు, ఉపకరణాలను కొనుగోలు చేయడంలో దేశవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు సహాయం చేయడానికి వివిధ అమలు ఏజెన్సీలకు నిధులు విడుదల చేయబడతాయి.

దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 అమలు కోసం గల పథకం (ఎస్.ఐ.పి.డి.ఎ), ఇది ఒక సంక్షేమ పథకం, దీని కింద రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని స్వయంప్రతిపత్తి గల సంస్థలకు, ఆర్.పి.డబ్ల్యూ.డి చట్టం, 2016 అమలుకు సంబంధించిన వివిధ కార్యకలాపాల కోసం, ప్రత్యేకించి అవరోధ రహిత వాతావరణాన్ని కల్పించడం, యాక్సెసిబుల్ ఇండియా ప్రచారం, దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి కోసం సహాయం అందించబడుతుంది.

దీనదయాళ్ దివ్యాంగుల పునరావాస పథకం (డి.డి.ఆర్.ఎస్) దీని కింద, దివ్యాంగులు వారి సరైన, శారీరక, ఇంద్రియ, మేధోపరమైన, మానసిక లేదా సామాజిక పనితీరు స్థాయిలను చేరుకోవడం, వాటిని నిర్వహించడానికి వీలు కల్పించే లక్ష్యం గల దివ్యాంగుల పునరావాసానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ల కోసం ప్రభుత్వేతర సంస్థలకు (ఎన్.జి.వో.లు) గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందించబడుతుంది.

ఉపకార వేతన పథకం దీని కింద ప్రభుత్వం దివ్యాంగులైన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తుంది.

విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల కోసం యాక్సెసిబిలిటీ మార్గదర్శకాలు, ప్రమాణాలు, అలాగే ఉన్నత విద్యాశాఖ ద్వారా విద్యా సంస్థల కోసం రూపొందించబడిన యాక్సెసిబిలిటీ కోడ్;, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా విద్యా సంస్థల కోసం రూపొందించబడిన యాక్సెసిబిలిటీ కోడ్ వరుసగా ఆర్.పి.డబ్ల్యూ.డి రూల్స్, 2017 కింద తెలియజేయబడినవి.

ఇంకా, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం పాఠశాల విద్యా రంగం కోసం సమగ్ర శిక్షా పథకం అనే విస్తృతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద, దివ్యాంగులైన పిల్లల కోసం సమగ్ర విద్య (సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ కోసం ఐ.ఇ.) కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది, పూర్తి సమానత్వం, సమగ్రతను నిర్ధారించడం ద్వారా దివ్యాంగులైన పిల్లలందరూ పాఠశాలకు హాజరవగలరు. దివ్యాంగులైన పిల్లలకు ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు నిరంతరాయంగా విద్య అందేలా చేయడం ఈ పథకం లక్ష్యం. ఆర్.పి.డబ్ల్యూ.డి చట్టం, 2016 యొక్క వైకల్యాల షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉన్న దివ్యాంగులైన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. సమగ్ర శిక్షా పథకం రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల ద్వారా ఇది అమలు చేయబడుతోంది, అలాగే కేంద్ర ప్రభుత్వం దీని కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

దివ్యాంగులైన పిల్లల కోసం సమగ్ర విద్య విభాగం ద్వారా, దివ్యాంగులైన పిల్లల కోసం గుర్తింపు, అంచనా శిబిరాలు (మండల స్థాయిలో), దివ్యాంగులైన ప్రతి విద్యార్థికి సాధనాలు, ఉపకరణాలు, సహాయక పరికరాలు, టీచింగ్-లర్నింగ్ మెటీరియల్, బ్రెయిలీ పుస్తకాలు, పాఠశాలకు హాజరు కాలేని తీవ్రమైన, బహుళ వైకల్యాలు గల విద్యార్థుల కోసం పెద్ద ముద్రణ వంటి స్టూడెంట్ స్పెసిఫిక్ కార్యక్రమాల కోసం సహాయంగా ఏడాదికి రూ. 3500/- సహాయం అందించడం వంటి వివిధ నిబంధనలు అమలులో ఉన్నాయి. సమగ్ర శిక్ష ప్రధానంగా దివ్యాంగులైన పిల్లలకు సమగ్ర విద్యను అందించడంపై దృష్టిసారిస్తుంది, ఇందులో పిల్లలు వారి సామర్థ్యాలు/వైకల్యాలతో సంబంధం లేకుండా ఒకే తరగతిలో పాలుపంచుకుంటూ అందరితో కలిసి నేర్చుకుంటారు, తద్వారా విద్యార్థులందరికీ సమానమైన విద్యా వాతావరణం కల్పించబడుతుంది.

ఇంకా, ఆర్.పి.డబ్ల్యూ.డి చట్టం, 2016లోని సెక్షన్ 16(ii) దివ్యాంగులైన పిల్లలకు సమగ్ర విద్యను అందించడం కోసం భవనంక్యాంపస్,  వివిధ సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం, స్థానిక సంస్థలను ఆదేశిస్తుంది. ఆర్.పి.డబ్ల్యూ.డి చట్టం, 2016లోని సెక్షన్ 17(i) పరీక్షా పత్రాన్ని పూర్తి చేయడానికి అదనపు సమయాన్ని కేటాయించడం ద్వారా, దివ్యాంగులైన విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ద్వితీయ, తృతీయ భాషా కోర్సుల నుండి మినహాయింపును ఇవ్వడం ద్వారా పాఠ్యాంశాలు, పరీక్షా విధానంలో తగిన సవరణలు చేస్తుంది. దీని దృష్ట్యా, దివ్యాంగులైన విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉంటూ ఆర్.పి.డబ్ల్యూ.డి చట్టంలో పేర్కొనబడినట్లుగా చెవిటి, మూగ వారు సహా దివ్యాంగులైన పిల్లలందరి కోసం సి.బి.ఎస్.ఇ. అనేక మినహాయింపులు/రాయితీలను అందిస్తుంది. అవి - మెడికల్ సర్టిఫికేట్ జారీ అధికారం, లేఖరి, సరిపడునంత సమయం సదుపాయం, లేఖరి నియామకం, సంబంధిత సూచనలు, ఫీజు అలాగే పదవ తరగతిలో తృతీయ భాష నుండి ప్రత్యేక మినహాయింపు, సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో సౌలభ్యం, ప్రత్యామ్నాయ ప్రశ్నలు/ప్రత్యేక ప్రశ్నలు అలాగే 12వ తరగతి వారి కోసం సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో సౌలభ్యం, ప్రత్యేక ప్రశ్నపత్రం మరియు ప్రాక్టికల్ కాంపోనెంట్‌కు బదులుగా ప్రశ్నల వంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం.

ఇంకా, దివ్యాంగుల సాధికారత విభాగం (డి.ఇ.పి.డబ్ల్యూ.డి) 2015 మార్చ్ నెలలో ప్రారంభించబడిన 'నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్.ఎ.పిఫర్ పర్సన్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (పి.డబ్ల్యూ.డి.ల)'ని అమలు చేస్తుంది. 'వికలాంగుల హక్కుల అమలు పథకం 2016 (ఎస్.ఐ.పి.డి.ఎ)' అనే సంక్షేమ పథకం కింద ఎన్.ఎ.పి. అమలు చేయబడుతుంది. ఎన్.ఎ.పి కింద, 15 నుండి 59 సంవత్సరాల వయస్సులో ఉన్న దివ్యాంగులకు నైపుణ్య శిక్షణను అందించడానికి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన సాధారణ నిబంధనల మార్గదర్శకాలు, కాలానుగుణంగా చేయబడిన తదుపరి సవరణల ప్రకారం నిధులు విడుదల చేయబడతాయి. ఈ శాఖ ఇటీవల పి.ఎమ్.-దక్ష్-డి.ఇ.పి.డబ్ల్యు.డి. పోర్టల్‌ను ప్రారంభించింది. పోర్టల్ లింక్ https://pmdaksh.depwd.gov.in/login పై అందుబాటులో ఉంది. ఈ పోర్టల్ కింద, రెండు మాడ్యూల్స్ ఉన్నాయి:

దివ్యాంగ్‌జన్ కౌశల్ వికాస్దేశవ్యాప్తంగా దివ్యాంగుల కోసం ఈ పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణ అందించబడుతుంది.

దివ్యాంగ్‌జన్ రోజ్‌గార్ సేతు: దివ్యాంగులు, దివ్యాంగుల కోసం ఉద్యోగాలు గల యజమానుల మధ్య వారధిగా పనిచేయడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం. ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశంలోని ప్రైవేట్ కంపెనీలు అలాగే దివ్యాంగులలో ఉపాధి/సంపాదన అవకాశాల గురించి జియో-ట్యాగ్ చేయబడిన సమాచారాన్ని అందిస్తుంది.

ఎస్.ఐ.పి.డి.ఎ. పథకంలో భాగంగా డి.ఇ.పి.డబ్ల్యు.డి. దేశవ్యాప్తంగా 'అవగాహన కల్పించు ప్రచార పథకం'ను అమలు చేస్తుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం గల ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి సాధారణ అవగాహన కల్పించడం, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ/స్థానిక సంస్థల ముఖ్య కార్యదర్శులకు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రాష్ట్ర/జిల్లా/మండల స్థాయి వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా దివ్యాంగులకు సంబంధించిన విషయాలపై నిరంతర శిక్షణ, అవగాహన కల్పించడం కోసం ఉద్యోగులు మరియు సహచరుల బృందాలలో దివ్యాంగుల సామర్థ్యాల గురించి అవగాహన పెంచడం దీని  లక్ష్యం.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని ఇచ్చారు.

***

 


(Release ID: 2039545) Visitor Counter : 82