రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫార్మాస్యూటికల్ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించుటకు అనేక పథకాలు అమలు చేసిన భారత ప్రభుత్వం


ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించుట (పి.ఆర్.ఐ.పి.) కోసం ఒక పథకాన్ని ప్రారంభించిన ఫార్మాస్యూటికల్స్ విభాగం; పి.ఆర్.ఐ.పి. పథకం యొక్క కాంపోనెంట్ BIII కింద, గుర్తింపు పొందిన ఆరు ప్రాధాన్యతా రంగాల్లోని 125 పరిశోధన ప్రాజెక్టులలో 50 ఫార్మాస్యూటికల్స్ రంగంలోని అంకుర సంస్థల కోసమే

Posted On: 30 JUL 2024 2:22PM by PIB Hyderabad

ఫార్మాస్యూటికల్ రంగం సహా వివిధ రంగాల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించుటకు భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. వాటిలో భాగంగా ఉన్నవి:

ఫార్మాస్యూటికల్ రంగం సహా వివిధ పరిశ్రమలలో ఆవిష్కరణలను పెంపొందించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా 2016 జనవరి 16వ తేదీన స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభించబడింది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్.ఎఫ్.ఎస్.); స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్.ఐ.ఎస్.ఎఫ్.ఎస్.); క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (సి.జి.ఎస్.ఎస్.) అనే మూడు ప్రధాన పథకాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

బయోటెక్నాలజీ ఇగ్నీషన్ గ్రాంట్ (బి.ఐ.జి.), సస్టెయినెబుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ (ఎస్.ఇ.ఇ.డి.), లాంచింగ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ డ్రైవెన్ అపార్డెబుల్ ప్రొడక్ట్స్ (ఎల్.ఇ.ఎ.పి.) వంటి పథకాల ద్వారా బయోటెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బి.ఐ.ఆర్.ఎ.సి.) నిధులను అందిస్తూ సహాయపడుతున్నది. ప్రతి అంకుర సంస్థ కోసం రూ.30 లక్షల నుండి రూ.100 లక్షల వరకు నిధులను అందిస్తూ, వారు వారి ఆలోచనలను మెరుగుపరుచుకోవడానికి, ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్స్ రూపొందించడానికి, మార్గద్శనం చేయడానికి, వారి ఉత్పత్తులు, సాంకేతికతలను వాణిజ్యీకరించేందుకు వీలు కల్పిస్తుంది. i4 ప్రోగ్రామ్, పి.ఎ.సి.ఇ. ప్రోగ్రామ్ ద్వారా బి.ఐ.ఆర్.ఎ.సి. బయోటెక్నాలజీలో ఆవిష్కరణలు, పరిశోధనలకు ఊతమిస్తున్నది.

ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించుట (పి.ఆర్.ఐ.పి.) కోసం ఫార్మాస్యూటికల్స్ విభాగం ఒక పథకాన్ని ప్రారంభించినదని చెప్పడం సందర్భోచితం అవుతుంది. పి.ఆర్.ఐ.పి. పథకం యొక్క కాంపోనెంట్ BIII కింద, గుర్తింపు పొందిన ఆరు ప్రాధాన్య రంగాలలోని 125 పరిశోధన ప్రాజెక్టులలో 50 ఫార్మాస్యూటికల్స్ రంగంలోని అంకుర సంస్థల కోసం అందించబడినవి.

2024, జూన్ 30వ తేదీ నాటికి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ (డి.పి.ఐ.ఐ.టి.) మొత్తం 1,40,803 సంస్థలను అంకుర సంస్థలుగా గుర్తించినది, వాటిలో 2,127 సంస్థలు ఫార్మాస్యూటికల్ రంగానికి చెందినవి. గత మూడు సంవత్సరాలలో, డి.పి.ఐ.ఐ.టి. గుర్తింపు పొందిన 1397 అంకుర సంస్థలు ఫార్మాస్యూటికల్ రంగంలో ఏర్పాటు చేయబడినవి. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి:

 

Sector

రంగం

2021

2022

2023

Total

మొత్తం

Pharmaceutical

ఫార్మాస్యూటికల్

283

451

663

1,397

 

స్టార్టప్ ఇండియా ఇన్షియేటివ్ కింద, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్.ఎఫ్.ఎస్.); స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్.ఐ.ఎస్.ఎఫ్.ఎస్.); క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (సి.జి.ఎస్.ఎస్.) అనే మూడు ప్రధాన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకాల కింద అన్ని రంగాలు, పరిశ్రమలలోని అంకుర సంస్థలకు వాటి వివిధ బిజినెస్ సైకిల్ దశలలో మద్దతు విస్తరించబడినది. ఇంక్యుబేటర్స్ ద్వారా సీడ్-దశలో గల అంకుర సంస్థలకు ఎస్.ఐ.ఎస్.ఎఫ్.ఎస్. ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ పథకం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4 సంవత్సరాల కాలవ్యవధి కోసం రూ. 945 కోట్లతో ప్రారంభించబడింది. 2024, జూన్ 30వ తేదీ నాటికి, ఎస్.ఐ.ఎస్.ఎఫ్.ఎస్. 205 ఇంక్యుబేటర్స్ కోసం రూ.862.84 కోట్ల నిధులు మంజూరు చేయబడినవి. వెంచర్ క్యాపిటల్ పెట్టుబడును ప్రోత్సహించడానికి ఎఫ్.ఎఫ్.ఎస్. స్థాపించబడి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.ఐ.డి.బి.ఐ.) ద్వారా నిర్వహించబడుతున్నది. సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్.ఇ.బి.ఐ.)లో నమోదు అయిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఏ.ఐ.ఎఫ్.లకు) ఎస్.ఐ.డి.బి.ఐ. మూలధనాన్ని అందిస్తుంది, ఇవి ఆపై అంకుర సంస్థలలో పెట్టుబడి పెడతాయి. 2024, జూన్ 30వ తేదీ నాటికి, ఎఫ్.ఎఫ్.ఎస్. కింద రూ. 138 ఏ.ఐ.ఎఫ్‌.లకు 10,804.7 కోట్లు కేటాయించబడినవి. డి.పి.ఐ.ఐ.టి. గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు అర్హత కలిగిన ఆర్థిక సంస్థల (సభ్య సంస్థలు – ఎమ్.ఐ.ల) ద్వారా తనఖా రహిత రుణాలను అనుమతించడం కోసం సి.జి.ఎస్.ఎస్. అమలు చేయబడింది. ఈ పథకం నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్.సి.జి.టి.సి.) లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతూ, 2023, ఏప్రిల్ 1వ తేదీ నుండి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడింది. 2024, జూన్ 30వ తేదీ నాటికి, లబ్ధిదారులైన అంకుర సంస్థలకు రూ. 426.09 కోట్ల విలువైన 182 రుణాలకు హామీ ఇవ్వబడింది. ఈ కార్యక్రమాలు భారతదేశంలో పటిష్టమైన అంకుర సంస్థల వ్యవస్థను పెంపొందించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి.

గత మూడు సంవత్సరాల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో స్థాపించబడిన కొత్త ఫార్మా రంగ పరిశ్రమల సంఖ్య 214 కాగా వాటిలో 176 యూనిట్స్ వైద్య పరికరాలు, 38 యూనిట్స్ ఔషధాలు, ఫార్ములేషన్స్ కోసం ఉద్దేశించబడినవి.

ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖా మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈరోజు రాజ్యసభలో సమర్పించారు.  

***


(Release ID: 2039338) Visitor Counter : 55