ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళ లోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి సంతాపం


కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాన మంత్రి ; కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని ప్రధాన మంత్రి హామీ

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాన మంత్రి



Posted On: 30 JUL 2024 10:28AM by PIB Hyderabad

కేరళ వాయనాడ్ లోని కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డ కారణంగా పలువురు ప్రాణాలను కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  ప్రధాన మంత్రి కేరళ ముఖ్యమంత్రి  శ్రీ పినరయి విజయన్ తో కూడా మాట్లాడారు. అక్కడ తలెత్తిన స్థితి ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సాద్యమై అన్ని రకాల సహాయాన్నీ అందిస్తామంటూ ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.

 

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపారు:

‘‘వాయనాడ్ లోని కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డ ఘటన గురించి తెలిసి కలత చెందాను.  ఈ ఘటనలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు కలిగిన బాధలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను; ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.  బాధితులను ఆదుకోవడానికి సహాయక చర్యలు కొన సాగుతున్నాయి.  కేరళ ముఖ్యమంత్రి శ్రీ @pinarayivijayan తో నేను మాట్లాడాను; అక్కడ తలెత్తిన స్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం సాధ్యమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చాను.

 

 “വയനാടി്റെ ചില ഭാഗങ്ങളി ഉണ്ടായ ഉരുപൊട്ടലി ദുഃഖമുണ്ട്. പ്രിയപ്പെട്ടവരെ നഷ്ടപ്പെട്ട എല്ലാവക്കുമൊപ്പമാണ് എ്റെ ചിന്തക. പരിക്കേറ്റവക്കായി പ്രാത്ഥിക്കുന്നു. ദുരിതബാധിതരെ സഹായിക്കുന്നതിനുള്ള രക്ഷാപ്രവത്തനം ഇപ്പോ നടന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. കേരള മുഖ്യമന്ത്രി ശ്രീ @pinarayivijayan നോട് സംസാരിക്കുകയും അവിടെ നിലവിലുള്ള സാഹചര്യത്തി്റെ പശ്ചാത്തലത്തി കേന്ദ്രത്തി നിന്ന് സാധ്യമായ എല്ലാ സഹായവും ഉറപ്പുനകുകയും ചെയ്തു.” 

 

ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపింది:

‘‘వాయనాడ్ లో కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతున ఎక్స్ గ్రేషియాను ప్రధాన మంత్రి ప్రకటించారు.  ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తులకు 50,000 రూపాయల వంతున ఎక్స్ గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది.’’

 

 *****

DS/ST


(Release ID: 2039306) Visitor Counter : 52