సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాలు
Posted On:
29 JUL 2024 5:09PM by PIB Hyderabad
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ 2020 జులై 01 ప్రారంభం అయింది. 2024 జులై 24 నాటికి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్‌లో ఎంఎస్ఎంఈలు నివేదించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 20.51 కోట్లు. సంవత్సరం వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యవధి / ఆర్థిక సంవత్సరం
|
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్
|
ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్*
|
మొత్తం
|
2020-21
(01/07/2020 - 31/03/2021)
|
2,72,96,365
|
-
|
2,72,96,365
|
2021-22
|
3,49,54,322
|
-
|
3,49,54,322
|
2022-23
|
4,46,95,314
|
13,32,489
|
4,60,27,803
|
2023-24
|
7,51,13,797
|
2,22,90,752
|
9,74,04,549
|
Total
|
18,20,59,798
|
2,36,23,241
|
20,56,83,039
|
*11.01.2023న ప్రారంభం అయింది
జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ (జెడ్ఈడి) పద్ధతుల గురించి ఎంఎస్ఎంఈలలో అవగాహన కల్పించడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) మధ్య పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. జెడ్ఈడి సర్టిఫికేషన్ కోసం వాటిని ప్రోత్సహించడం, ద్వారా ఎంఎస్ఎంఈలలో వ్యర్థాలను తగ్గించవచ్చు, ఉత్పాదకతను పెంచడం, పర్యావరణ స్పృహను మెరుగుపరచడం, శక్తిని ఆదా చేయడం, సహజ వనరులను ఉత్తమంగా ఉపయోగించడం, వారి మార్కెట్లను విస్తరించడం మొదలైనవి.
ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజిఎస్), దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియు-జికెవై), గ్రామీణ స్వయం ఉపాధి, శిక్షణా సంస్థ (ఆర్ఎస్ఈటిఐలు), దీన్ దయాల్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (డిఏవై-ఎన్యుఎల్ఎమ్), ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)వంటి విభిన్న పథకాలు, కార్యక్రమాలను ఎంఎస్ఎంఈలతో సహా వివిధ మార్గాల ద్వారా ఉద్యోగాలను ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) ఆ రంగాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, తద్వారా మరిన్ని ఉద్యోగాలను కల్పించడం లక్ష్యంగా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ పథకాలు, కార్యక్రమాలలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంజిపి), క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సిజిటిఎంఎస్ఈ), మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ - క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ-సిడిపి), ఎంఎస్ఎంఈ పనితీరును పెంచడం, వేగవంతం చేయడం (ఆర్ఏఎంపి), మొదలైనవి.
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జితన్‌రామ్ మాంఝీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 2038815)
Visitor Counter : 76