సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ రంగంలో ఆవిష్కరణలు

Posted On: 29 JUL 2024 4:57PM by PIB Hyderabad

దేశంలో ఎంఎస్ఎంఈ రంగానికి మద్దతు ఇవ్వడానికి, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు తీసుకుంది:

  1. ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిధిని విస్తృతం చేయడానికి, పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా అధిక థ్రెషోల్డ్‌తో  ఎంఎస్ఎంఈ  ల వర్గీకరణ కోసం కొత్త ప్రమాణాలు 2020 జూన్ 26న నోటిఫై అయ్యాయి. 
  2. రూ. 200 కోట్ల వరకు సేకరణకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు.  
  3. ఎంఎస్ఎంఈల సులభతర వాణిజ్యానికి  “ఉదయం రిజిస్ట్రేషన్ ” 2020 జులై ఒకటో తేదీన ప్రారంభం అయింది. 
  4. అధికారిక పరిధిలో అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ని తీసుకురావడం కోసం 2023 జనవరి 11వ తేదీన ఉదయం అసిస్ట్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభం.
  5. క్రెడిట్ ప్రయోజనం కోసం రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులను 2021 జులై 2 నుండి ఎంఎస్ఎంఈలుగా చేర్చడం.
  6. ఎంఎస్ఎంఈల హోదాలో స్థాయి పెరిగితే పన్నేతర ప్రయోజనాలు 3 సంవత్సరాల పాటు పొడిగించారు. 
  7. వస్తువులు, సేవల కొనుగోలుదారుల నుండి సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఫిర్యాదుల దాఖలు, బకాయిల పర్యవేక్షణ కోసం సమాధాన్ పోర్టల్ ప్రారంభం.
  8. ఫిర్యాదులను పరిష్కరించడం, ఎంఎస్ఎంఈల హ్యాండ్‌హోల్డింగ్‌తో సహా ఇ-గవర్నెన్స్‌లోని అనేక అంశాలను కవర్ చేయడానికి జూన్, 2020లో ఆన్‌లైన్ పోర్టల్ “ఛాంపియన్స్” ప్రారంభించారు. 

2022 మార్చి 10న ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ (ఇంక్యుబేషన్, డిజైన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్)ను ప్రారంభించింది, ఇంక్యుబేషన్, డిజైన్ జోక్యాల ద్వారా ఆలోచనలను వినూత్న అప్లికేషన్‌లుగా అభివృద్ధి చేయడం నుండి పూర్తి విలువ గొలుసులో ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో. పథకం కింద అందించే ఆర్థిక సహాయం క్రింద విధంగా ఉంది:

  1. ఇంక్యుబేషన్: ఒక్కో ఐడియాకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం. సంబంధిత ప్లాంట్, యంత్రాల కోసం  రూ.1.00 కోటి  వరకు అందిస్తారు. 
  2. డిజైన్:  డిజైన్ ప్రాజెక్ట్ కోసం రూ.40 లక్షలు, స్టూడెంట్ ప్రాజెక్ట్ కోసం రూ.2.5 లక్షలు అందిస్తారు. 
  3. మేధో సంపత్తి హక్కులు: విదేశీ పేటెంట్ కోసం రూ.5 లక్షల వరకు, డొమెస్టిక్ పేటెంట్ కోసం  రూ. 1.00 లక్ష వరకు, జిఐ నమోదు కోసం రూ.2.00 లక్షలు, డిజైన్ రిజిస్ట్రేషన్ కోసం రూ.15,000/-, రీయింబర్స్‌మెంట్ రూపంలో ట్రేడ్‌మార్క్ కోసం రూ.10,000/-. 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం, దీనదయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (డిఏవై-ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జిలు) తక్కువ వడ్డీ రుణాలు అందిస్తారు. ఇందులో మహిళ ఎస్హెచ్జిలకు రూ.3 లక్షల వరకు రుణాల కోసం, సంవత్సరానికి 7 శాతం రాయితీ వడ్డీ రేటుతో  అందిస్తారు.

ఇంకా, దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద, వ్యక్తిగత, గ్రూప్  సంస్థలను స్థాపించడంలో పట్టణ పేదలకు ఆర్థిక సహాయం 7 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీ రేటుపై బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ రూపంలో లభిస్తుంది.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలియజేసినట్లుగా, విధించిన ఛార్జీల సమీక్ష బ్యాంక్ బోర్డు లేదా ఏదైనా సమర్థ అధికారం ద్వారా ఎప్పటికప్పుడు చేస్తారు.

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జితన్‌రామ్‌ మాంఝీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

***


(Release ID: 2038814) Visitor Counter : 103