బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు ఉత్పత్తి

Posted On: 29 JUL 2024 4:14PM by PIB Hyderabad

దేశంలో బొగ్గు డిమాండ్‌లో చాలా భాగం దేశీయ ఉత్పత్తి/సరఫరా ద్వారా తీర్చబడుతుంది. బొగ్గు యొక్క వాస్తవ డిమాండ్ 2022-23లో 1115.04 మెట్రిక్ టన్నులుగా ఉండగా 2023-24సంవత్సరానికి అది 1233.86 మిలియన్ టన్నులకు పెరిగింది. పెరిగిన బొగ్గు డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి కూడా పెరిగింది. 2022-23లో 893.19 మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశీయ బొగ్గు ఉత్పత్తి 2023-24లో 11.65% పెరిగి 997.26 మెట్రిక్ టన్నులకు చేరింది.

స్వదేశీ వనరుల ద్వారా భవిష్యత్తులో బొగ్గు డిమాండ్‌ను తీర్చడానికి మరియు బొగ్గు యొక్క అనవసరమైన దిగుమతిని తగ్గించడానికి, దేశీయ బొగ్గు ఉత్పత్తి రానున్న కొన్ని సంవత్సరాలలో ఏటా 6-7% వృద్ధితో 2029-30 నాటికి 1.5 బిలియన్ టన్నులకు చేరుకోగలదని అంచనా.

కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క వాషరీల పనితీరులో క్షీణత, ఉక్కు రంగంలో వాష్డ్ కోకింగ్ బొగ్గుకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, వాష్డ్ కోకింగ్ బొగ్గు సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం పాత వాషరీల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే మార్గాన్ని చేపట్టింది. దీనికి అనుగుణంగా, నాన్-రెగ్యులేటెడ్ సెక్టార్ లింకేజీ వేలం కింద 'డబ్ల్యు.డి.ఓ. మార్గంలో కోకింగ్ బొగ్గును ఉపయోగించే ఉక్కు' అనే పేరుతో ఒక కొత్త ఉప-విభాగాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్ట్ వ్యవధి మొత్తం కాలానికి ప్రధాన గనుల నుండి దీర్ఘకాలం పాటు బొగ్గును అందించే హామీతో కొత్త ఉప-విభాగాన్ని సృష్టించడం ద్వారా కోకింగ్ కోల్ వాషరీస్‌లో ఆదాయ సముపార్జనకు మార్గం సులభమవుతుంది, తద్వారా దేశంలో వాష్డ్ కోకింగ్ బొగ్గు లభ్యత పెరుగుతుంది. దేశంలోని ఉక్కు పరిశ్రమలలో దేశీయ కోకింగ్ బొగ్గు వినియోగాన్ని మెరుగుపరచడానికి ఈ కొత్త ఉప-రంగం దోహదపడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

కోకింగ్ బొగ్గు దిగుమతికి ప్రత్యామ్నాయంగా, ఉక్కు రంగంతో ప్రస్తుత దేశీయ కోకింగ్ బొగ్గు అనుసంధానం ప్రస్తుతం ఉన్న 10-12% నుండి 30-35%కి పెంచాలి. దీని ప్రకారం, జాతీయ ఉక్కు విధానం 2017లో అంచనా వేసిన దేశీయ కోకింగ్ బొగ్గు డిమాండ్‌ను తీర్చడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ 2022 ఆర్థిక సంవత్సరంలో మిషన్ కోకింగ్ కోల్‌ని ప్రారంభించింది. ప్రధానమంత్రి యొక్క ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం కింద బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న పరివర్తనాత్మక చర్యలను అనుసరించి, దేశీయ ముడి కోకింగ్ బొగ్గు ఉత్పత్తి 2030 నాటికి 140 మెట్రిక్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.

పి.ఎస్.యు.లు, ప్రైవేట్ రంగం రెండింటి కోసం బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటును ప్రోత్సహించడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌గా ₹8500 కోట్ల వ్యయంతో ఆర్థిక సహాయం అందించే పథకాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదించబడిన ఈ పథకం మొత్తం ₹8500 కోట్ల ప్రోత్సాహక చెల్లింపుతో మూడు కేటగిరీల కింద గల ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సాయం అందిస్తుంది.

  • కేటగిరీ I, ప్రభుత్వ పి.ఎస్.యు.ల కోసం ₹4050 కోట్ల కేటాయింపులు గలదిప్రభుత్వ పి.ఎస్.యు.లు ఆర్థిక సహాయం కోసం ప్రతిపాదనలను సమర్పించవచ్చు, ఎంపికైన మూడు ప్రాజెక్ట్‌ల కోసం వారు గరిష్టంగా ₹1350 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 15% గ్రాంట్‌లలో వి.జి.ఎఫ్‌గా తక్కువగా ఉన్న మొత్తాన్ని అందుకుంటారు.
  • కేటగిరీ II, ₹3850 కోట్లతో ప్రైవేట్ రంగానికి, పి.ఎస్.యు.లకు గరిష్టంగా రూ. 1000 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 15% గ్రాంట్‌లలో వి.జి.ఎఫ్.గా తక్కువగా ఉన్న మొత్తం అందుబాటులో ఉంటుంది.
  • కేటగిరీ III, ప్రతి ప్రాజెక్ట్‌కు గరిష్టంగా రూ. 100 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 15%లలో తక్కువగా ఉండే మొత్తం చొప్పున డెమాన్‌స్ట్రేషన్ లేదా చిన్న తరహా ప్రాజెక్ట్‌ల కోసం మొత్తం ₹600 కోట్లు కేటాయించబడును.

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానంగా సమర్పించారు.

***



(Release ID: 2038813) Visitor Counter : 27


Read this release in: English , Urdu , Hindi , Tamil