గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

అమృత్‌లో స్థానిక సంస్థల ప్రమేయం

Posted On: 29 JUL 2024 1:07PM by PIB Hyderabad

అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం 2015, జూన్ 15వ తేదీన దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన 500 నగరాలు, పట్టణాలలో ప్రారంభించబడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన అన్ని పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్.బి.లు), రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (యు.టి.ల) రాజధానులైన ఇతర నగరాలు, హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హెచ్.ఆర్.ఐ.డి.ఎ.వై) పరిధిలోని అన్ని వారసత్వ నగరాలు, ప్రధాన నదీ తీరాల వెంట గల ప్రముఖ నగరాలు, కొండప్రాంతాలు గల రాష్ట్రాలు, ద్వీపాల నుండి,  పర్యాటక ప్రాంతాల నుండి 10 నగరాల చొప్పున (ప్రతి రాష్ట్రం నుండి ఒకటి కంటే ఎక్కువ లేకుండా) అమృత్ పథకం కింద ఎంపిక చేయబడినవి. అమృత్‌ పథకంలో నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, సెప్టేజీ నిర్వహణ, వరద నీటి ప్రవాహ వ్యవస్థ, పట్టణ రవాణా, హరిత ప్రదేశాలు / ఉద్యానవనాల అభివృద్ధి, సామర్థ్యం పెంపుదల మరియు సంస్కరణల అమలు భాగంగా ఉంటాయి.

అమృత్ పథకం కింద, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు (యు.టి.లు) ప్రాజెక్ట్‌ల ఎంపిక, అంచనా, ప్రతిపాదన, అమలు అధికారం కలిగి ఉంటాయి. రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఎస్.ఎ.ఎ.పి) కోసం ప్రాథమిక ఆధారం అయిన సర్వీస్ లెవల్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ (ఎస్.ఎల్.ఐ.పి.లు) పట్టణ స్థానిక సంస్థల ద్వారా రూపొందించబడుతాయి.

రాష్ట్ర స్థాయిలో ఎస్.ఎ.ఎ.పి.లో ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌లను ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టేట్ హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ (ఎస్.హెచ్.పి.ఎస్.సి)కి పట్టణాభివృద్ధి & గృహనిర్మాణ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్.ఎల్.టి.సి) సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ (ఎమ్.వో.హెచ్.యు.ఎ)లోని అపెక్స్ కమిటీ మిషన్ మార్గదర్శకాల పరిధిలో ఏర్పాటు చేయబడి, రాష్ట్రం సమర్పించిన ఎస్.ఎ.ఎ.పి. కోసం తరువాతి దశ ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రాజెక్ట్‌లు రాష్ట్ర స్థాయిలో యు.ఎల్.బి.లు/పారాస్టేటల్ ఏజెన్సీల ద్వారా అమలు చేయబడతాయి.

గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 2038811) Visitor Counter : 37